దాదాపు ఆరేళ్ల క్రితం అంటే 2009లో చెన్నైలో చందమామ పత్రిక వెబ్‌సైట్‌లో అసోసియేటెడ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నప్పుడు మద్రాస్ మ్యూజియంలో విశేషాలను ప్రచురించే పనిమీద ఆ మ్యూజియం సందర్శించాము. నాతోపాటు తమిళ, ఇంగ్లీష్ భాషల చందమామ అసోసియేటెడ్ ఎడిటర్లు ప్రేమ్ కుమార్, తార కూడా మ్యూజియంకు వచ్చారు. (మద్రాస్ మ్యూజియంకి మరోపేరు ఉంది చచ్చిన కాలేజి అని. అంటే జీవంలేని వస్తువులను భద్రపర్చారు కాబట్టి అది చచ్చిన కాలేజి. జీవం ఉన్న వాటిని సంరక్షిస్తున్నారు కాబట్టి బతికిన కాలేజి అని మద్రాస్ జూ పార్క్‌ని పిలిచేవారు. దీంట్లోనే చిల్డ్రన్ పార్క్ కూడా భాగం.)
మా పనిలో భాగంగా మద్రాస్ మ్యూజియం వెళ్లి అక్కడున్న అయిదారు మహా భవంతులలోని విశేషాలను నోట్ చేసుకుని అవసరమైన ఫొటోలు తీసుకున్నాం. ఆ మ్యూజియంలో కెల్లా పంచలోహాలతో చేసిన భారీ నటరాజ విగ్రహం ఒక శిఖర స్థాయి కళాఖండం. దాన్ని చూసేందుకు విదేశీయులు సైతం పనిగట్టుకుని వస్తుంటారని ప్రతీతి. ఆ మ్యూజియం భవంతుల వెలుపల భద్రపర్చిన ఒక పురాతన కొయ్య ఒకటి మమ్మల్ని విశేషంగా ఆకర్షించింది. 2 కోట్ల సంవత్సరాల క్రితం నాటి పురాతన కొయ్య శిలాజం అది.
ప్రపంచంలోనే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అతి పురాతన వస్తువుగా దానికి గుర్తింపు ఉంది. దాన్ని అలా ఆరుబయట ఉంచేయటం బాధ కలిగించినా చేసేదేమీ లేక దాని ఫొటో కూడా తీసుకుని చందమామ ఆఫీసుకు వెళ్లిపోయాం. రెండ్రోజుల తర్వాత మద్రాసు మ్యూజియంపై రెండు లేదా మూడు బాగాల కథనాన్ని తెలుగు, తమిళ, ఇంగ్లీషు చందమామ వెబ్‌సైట్లలో ప్రచురించాము. తెలుగు చందమామ వెబ్‌సైట్లో ప్రచురించిన ఆ పురాతన కొయ్య శిలాజం ఫొటోను చూసి చాలామంది పాఠకులు స్పందించారు కూడా. ఇంత పురాతన వస్తువు మద్రాసు మ్యూజియంలో ఉందన్న ఊహే లేదంటూ మద్రాసు పాఠకులు కూడా మెయిల్ పెట్టారు. అది నా చందమామ అనుభవాల గతం.
విషాదకరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు చందమామ పత్రికా లేదు. వెబ్ సైటూ లేదు. మద్రాసు మ్యూజియంపై ప్రచురించిన ఆ విశేష కథనం కూడా అందుబాటులో లేదు. నా చందమామ బ్లాగులో దానిగురించి లింక్ ఇచ్చినట్లు ఉంది కాని ఆ లింకు ఇప్పుడు తెరుచుకోదు. వెబ్‌సైటే లేదు కాబట్టి.
కానీ ఇవ్వాళ సాక్షి పత్రిక సంపాదకీయ పేజీ పని ముగించుకుని అర్థరాత్రి ఇంటికొచ్చి లాప్‌టాప్ తెరిచి గూగుల్ న్యూస్ చూస్తే పరమాద్భుత విషయం కనిపించింది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ తరంగాల ఉనికిని కనుగొనడమే కాకుండా వాటి శబ్దాన్ని కూడా విన్నామని అమెరికా శాస్త్రజ్ఞులు ప్రకటించారు. ఆ వార్త విశేషాలను వెదకటం, కాపీ చేసుకోవడం అయ్యాక వివరాల చూస్తే ఒళ్లు గగుర్పొడిచే అంశం బయటపడింది. ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ సరిగ్గా వందేళ్ల క్రితం గురుత్వాకర్షణ తరంగాలు విశ్వంలో ఉన్నాయని చేసిన ఊహాత్మక ప్రతిపాదన ఇప్పుడు వాస్తవంగా రుజువయింది. లేదా కనిపెట్టారు.
దాదాపు వందకోట్ల కాంతి సంవత్సరాల క్రితం విశ్వంలో రెండు నల్లబిలాలు (బ్లాక్ హోల్స్) ఢీకొని ఒకటిగా కలిసిపోయినప్పుడు ఏర్పడిన శబ్దాన్ని అమెరికాలోని లైగో (Laser Interferometer Gravitational Wave Observatory) కనిపెట్టింది. వందేళ్ల క్రితం ఐన్‌స్టీన్ చేసిన ఊహను నిరూపించడానికి, తమ కెరియర్‌నే ఫణంగా పెట్టిన ముగ్గురు భౌతిక శాస్త్రజ్ఞుల అవిరామ కృషి నేటికి ఫలించింది. విశ్వ-కాలం (స్పేస్ టైమ్)ని దాని ప్రశాంత స్థితిలోనే ఇంతవరకు శాస్త్రజ్ఞులు చూడగలిగారని, ఇది ప్రశాతం సమయంలో సముద్ర ఉపరితలాన్ని చూడటంతో సమానమని ఈ బృందంలో ఒకరైన డాక్టర్ థ్రోన్ పేర్కొన్నారు. రాక్షస అలలతో ఉవ్వెత్తున చెలరేగే సముద్ర తుఫానును చూసిన పరిణామం ఇప్పుడు విశ్వంలో నెలకొన్నదని, గురుత్వాకర్షణ తరంగాలను కనుగొని వినటం, దాన్ని రికార్డు చేయడం సైన్స్ ఈ శతాబ్ది సైన్స్ సాధించిన అతిగొప్ప ఆవిష్కరణగా చరిత్రలో మిగలనుందని శాస్త్ర ప్రపంచం పేర్కొంటోంది. ఈ గొప్ప ఆవిష్కరణ గురించి కూలకషంగా రాయడం ఈ తెల్లవారు జామున సాధ్యం కాదని తేలిపోతోంది. కాబట్టి గురుత్వాకర్షణ తరంగాల ఉనికిపై వచ్చిన సమాచారాన్ని కింది లింకులలో చూడండి.
Gravitational Waves Detected, Confirming Einstein’s Theory
OUT THERE
FEB. 11, 2016 468 COMMENTS
http://www.nytimes.com/2016/02/12/science/ligo-gravitational-waves-black-holes-einstein.html?_r=0
న్యూయార్క్ టైమ్స్ వెబ్‌సైట్ ప్రచురించిన ఈ వ్యాసంలో నల్లబిలాలు అంటే ఏమిటి, అవి ఢీకొన్నప్పుడు, సంలీనం చెందినప్పుడు జరిగే శక్తి విస్పోటనం ఏమిటి. గురుత్వాకర్షణ తరంగాల స్వరూపం ఏమిటి అనే విశేషాలను స్పష్టంగా ఒక వీడియో లింకు ద్వారా చూపించారు. ఆసక్తి ఉంటే తప్పక చూడగలరు.
ఈ అంశంపై నేను సేకరించిన మరి కొన్ని మంచి ఇంగ్లీషు వార్తా కథనాలను కూడా ఇక్కడ లింకుల రూపంలో చూడవచ్చు.
Gravitational waves The universe in a new light
(Written by Rajesh Gopakumar, Spenta R. Wadia
Gopakumar is senior professor and director, ICTS-TIFR, Bangalore. Wadia is emeritus professor and founding director, ICTS-TIFR, Bangalore)
http://indianexpress.com/article/opinion/columns/gravitational-waves-albert-einstein-theory-of-relativity-the-universe-in-a-new-light/
-------------------------------
Gravitational waves detected 100 years after Einstein predicted them
AP Feb 11, 2016, 09.41 PM IST
http://timesofindia.indiatimes.com/home/science/Gravitational-waves-detected-100-years-after-Einstein-predicted-them/articleshow/50950379.cms
----------------------------------
మనిషి నిలువెల్లా గడ్డకట్టుకుపోయే మంచు దిమ్మెల కింద కూరుకుపోయి ఆరు రోజులు ప్రాణాలు నిలుపుకుని రెస్క్యూ టీమ్ అవిరళ కృషి వల్ల బయటపడిన సియాచిన్ సోల్జర్ హనుమంతప్ప ప్రకృతి హద్దులను అధిగమించలేక నిన్ననే కన్ను మూశారు. ఇక్కడ మానవ ప్రయత్నం విషాదకరంగా ఓడిపోయింది.
India's resolute troops Lance Naik Hanamanthappa Koppad symbolises every soldier in Siachen
Feb 11, 2016 2115 IST
By Lt Gen Prakash Katoch
http://www.firstpost.com/india/indias-resolute-troops-lance-naik-hanamanthappa-koppad-symbolises-every-soldier-in-siachen-2622288.html?utm_source=fp_top_internal
-----------------------------------------
మానవ ఊహకు, పరికల్పనకు వందేళ్ల తర్వాత విజయాన్ని కట్టబెడుతూ నిన్ననే శాస్త్రజ్ఞులు విశ్వ చలన (గురుత్వాకర్షణ తరంగాల) సంగీతాన్ని రికార్డు చేశారు. ఒక ధీరోదాత్త మరణం 120 కోట్లమంది భారతీయులను కదిలించింది. తన ప్రాణాలు నిలవాలంటూ తపించింది. వందేళ్ల క్రితం నాటి ఐన్‌స్టీన్ ఊహ నిజం కావడంతో 700 కోట్లపైబడిన ప్రపంచం ఆ వార్తను సంభ్రమాశ్చర్యాలతో సొంతం చేసుకుంటోంది. కోట్లాదిమందిని నిరాశలో ముంచెత్తుతూ ఒక చోట మానవ ప్రయత్నం అంతిమ పరాజయం పొందితే కోటానుకోట్ల మందిలో కొత్త ఆశలు రేపుతూ మరో పెనువిజయం మానవ ప్రయత్నాన్ని మకుటాయమాన స్థానంలో నిలిపింది.
ఆ అంతిమ పరాజయాన్ని, ఈ ప్రారంభ విజయాన్ని ఒకేలాగా స్వీకరిద్దాం. పదార్థ చలన క్రమాన్ని ఇలాగే పరిశీలిద్దాం.
గమనిక:
ఇప్పుడే ఈనాడులో వచ్చిన ప్రధాన వ్యాసాన్ని కింది లింకులో చూడవచ్చు
వైజ్ఞానిక మైలురాయి
http://www.eenadu.net/Homeinner.aspx?item=break28
0 comments:
Post a Comment