యూట్యూబ్ తెరిస్తే చాలు.. శ్రీరెడ్డికి సపోర్టుగా, వ్యతిరేకంగా తెలుగు సమాజం నిలువునా చీలిపోయిన ముఖచిత్రమే గత కొన్ని వారాలుగా కనబడుతోంది. ఎవరి వైఖరి సరైంది, కాదు అని ఎవరికి వారు తేల్చుకునే సమయంలోనే పరిణామాలు విపరీతంగా మారిపోతున్నాయి. ప్రత్యేక హోదా ఉద్యమమే పక్కకు పోయేంత తీవ్ర స్థాయిలో ఇప్పుడు తెలుగు మీడియా తెలుగు సినీరంగంలో క్యాస్టింగ్ క్యాచ్‌పై ఎడతెగని యుద్ధాలు చేస్తోంది. రాంగోపాల్ వర్మ సలహా వ్యవహారం మరో కొత్త యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేస్తోంది.
కానీ ఇన్ని సంక్లిష్టతల మధ్య, వాదవివాదాల మధ్య కొన్ని ఉత్తేజకరమైన, స్ఫూర్తిదాయక మైన ప్రసారాలు యూట్యూబ్‌లో కనబడుతున్నాయి. వాటిలో ఇవ్వాళ నాకు కనిపించిన వీడియోలో కొంత భాగం ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఇది తెలుగు సినీమా మాఫియా గురించి, తెల్లతోలుపై హీరోల యావ గురించి, చిత్రసీమలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యే లేదంటూ సినీ నటి జీవిత చేసిన సంచలనాత్మక ప్రకటనపై పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య చేసిన ప్రసంగం. అత్యంత స్పష్టతతో కూడిన ఆమె ఉపన్యాసంలో కొంత భాగం ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఆమె ప్రసంగం పూర్తి పాఠం కింది వీడియో లింకులో కూడా చూడవచ్చు.
"తెలుగు సినీ మాఫియా, వీరి వెనక రాజకీయ నాయకులు, అక్రమ డబ్బును పోగేసుకుని వస్తున్నవారు తెలుగు సినిమాలోకి వచ్చి పెట్టుబడులు పెడుతుంటే, నాలుగే నాలుగు బ్యానర్లు మాత్రమే సినీరంగాన్ని ఏలుతున్నాయి. నాలుగు లేక అయిదు కుటుంబాలు.. దాంట్లో కూడా ఒక్క కులం లేదా రెండో కులం ఒకటి ఆరా కులాలు ఇవ్వాళ తెలుగు సినీ రంగాన్ని ఏలుతున్నాయి. వీళ్లే ముక్కుమొహాలున్నోళ్లా.. వీళ్లే వారసులా? ఇవ్వాళ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఈ హీరోల కంటే అందమైన పిల్లలు లేరా హీరోలుగా? మీరు అమ్మాయిలను ఇతర రాష్ట్రాలనుంచి తెచ్చుకుంటున్నారు. మరి అందంగా ఉండే అరవిందస్వామి లాంటివారిని, బాలీవుడ్ నుంచి మరికొందరిని తీసుకురండి. మీ నాలుగైదు కుటుంబాల హీరోలనే ఎందుకు చూడాలి మేం. పక్కరాష్ట్రాల నుంచి అందంగా ఉండే హీరోలను తెచ్చుకుని ఎందుకు పెట్టరు? హీరోలుగా మీరే ఉంటారు? హీరోయిన్లనేమో పక్క రాష్ట్రాలనుంచి తెచ్చుకుంటారు.
తెలుగు రాష్ట్రాల్లో తెలుగు అమ్మాయిలు లేరా అందంగా? నటన చేయగలిగే అబ్బాయిలు లేరా? మీరే హీరోలుగా ఉంటారు. మీకు మాత్రం ఇంత పక్షపాతం అవసరమా? మీ సినిమాలే ధియేటర్లలో విడుదల చేసుకుంటారు. నిర్మాతలు లేకపోయినా, పెట్టుబడులు లేకపోయినా డబ్బులు పోగేసుకుని సినిమా పిచ్చితో సినిమా తీస్తే వాళ్లకు థియేటర్లు దొరకనీయరు. ఒకవేళ వేరేవాళ్ల సినిమాలు బాగున్నాయని టాక్ వస్తే వ్యతిరేకంగా రివ్యూలు రాయిస్తారు. నేనివాళ చెబుతున్నాను. సినిమారంగంలో ఉన్న అయిదు బ్యానర్లు, నాలుగైదు కుటుంబాలు ఒక మాఫియా. మీలో మార్పు వస్తేనే సినిమారంగంలో మార్పు వస్తుంది. మీరు అందరినీ అణిచివేస్తున్నారు. కొత్తగా సృజనాత్మకంగా కథలు రానివ్వరు. సృజనాత్మకంగా నటించే వారిని రానివ్వరు. ఉదయ్ కిరణ్ లాంటి వాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?
సినిమారంగంలోకి వేరే కులాల వాళ్లు వచ్చినా, లేదా సినిమా కుటుంబాలకు చెందని చిన్నవాళ్లు వచ్చినా మీరు తొక్కేస్తున్నారు. ఎంతకాలం తొక్కేస్తారో చూస్తాం. సినిమారంగంలో కొత్త రక్తం రావాలి. కొత్తవాళ్లు రావాలి. సృజనాత్మకత రావాలి. మంచి కథలు రావాలి అని ప్రజాసంఘాలుగా మేము కూడా కోరుకుంటున్నాం. అలాగే సినిమారంగంలోని తీరుతెన్నుల్లో మార్పు రావాలి. అక్కడి వారి సమస్యలు పరిష్కరించాలి. సినీరంగంలోని దోపిడీ విధానాలు మారాలని కోరుకుంటున్నాం కాబట్టే ఈ క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఇతర మహిళా సంఘాలతో కలిసి చేపట్టాం.
జీవితగారు ఇవ్వాళ మాపై కేసు పెట్టారని భయపడం. అనేకమంది మాకు మద్దతుగా వస్తామని, సాక్ష్యం చెబుతామని చెబుతున్నారు. ఇలాంటి కేసులు చాలా చూశాం. కేసులు పెడితే భయపడిపోయే వాళ్లం కాదు. ఇలాంటి కేసులు మాకు కొత్త కాదు. రాజ్యమే మాపై ఎన్నో కేసులు పెట్టింది. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు వస్తే తొమ్మిది వామపక్షాలు కలిసి నిరసన తెలిపాయని ఆరోపించి నన్ను ఏ1 ముద్దాయిగా కేసు పెట్టారు. ఎంతోమంది వామపక్ష నేతలపై కేసులు పెట్టారు. ఎంతోమంది ఉద్యోగాలను రాజ్యం తీసేసింది. నా ఉద్యోగాన్ని కూడా తీసింది. అయినా మేం వేటికీ చెక్కుచెదరలేదు. అలాంటిది జీవిత పెట్టిన కేసును ఎదుర్కొవడానికి ఇక్కడెవరూ భయపడటం లేదు.
జీవిత అనుకోవచ్చు సంధ్య అంటే ఒక వ్యక్తి అని. కానీ సంధ్య వ్యక్తి కాదు. సంస్థ. ప్రగతిశీల మహిళా సంఘం ఆశయాలతో గత 40 ఏళ్లుగా శ్రామికవర్గ మహిళా ఉద్యమాన్ని నిర్మించడానికి పనిచేస్తున్న సంఘానికి నేను బాధ్యురాలిని. పీడిత వర్గం ఎక్కడుంటే అక్కడ వారికోసం మేం పనిచేస్తున్నాం. ఇలాంటి కేసులకు మేం భయపడేది లేదు. జీవితా నువ్వు భాష మార్చుకో. నువ్వు మహిళలను అవమానపరుస్తున్నావు. విడాకులు తీసుకున్న వారిని అవమానిస్తున్నావు. ఉద్యమకారులను అవమానపరుస్తున్నావు. ఇది కొనసాగించవద్దు.మహిళగా నీమీద మాకు సింపతీ ఉంది. కానీ హద్దులు దాటి నువ్వు హెచ్చరికలు చేస్తే భయపడేది లేదు. నీ తీరును మార్చుకో అని హెచ్చరిస్తున్నాం.
గ్లామర్ ఉన్న హీరోయిన్లను కాకుండా తెలుగు అమ్మాయిలను పెట్టుకుని సినిమాలు తీస్తే మాకు నష్టాలు వస్తే వాటిని ఎవరు భరించాలి అనే ప్రశ్న కొంతకాలంగా ముందుకొస్తోంది. మరి ముక్కూ మొహాలు సక్కంగ లేనోళ్లు, 20, 30 ఆపరేషన్లు చేసుకుని ఇండస్ట్రీలో నిలబడిన మీ మొహాలను తెలుగు ప్రజలమీద రుద్దుతున్నారా అని నేనడుగుతున్నాను. మంచిదే. తెలుగు వారు ఎవరూ పనికిరారు. మన ఇండస్ట్రీలో ఉన్నవారు ఎవరూ పనికిరారు. మీకిష్టమైన వారిని తెచ్చుకుని ఇక్కడి వారికి పది రూపాయలు ఖర్చుపెడితే వాళ్లకు వందరూపాయలు ఖర్చుపెడుతున్నారు. మరి ఆ నాలుగైదు కుటుంబాల వారినే ఎందుకు జనంమీద హీరోలుగా రుద్దుతున్నారు. వాళ్లనే హీరోలుగా అలవాటు చేశారు కదా. అంటే వీళ్లంతా సినిమాతోనే పుట్టిపెరిగిన హీరోలా? ఈ ముక్కూ మొహం సరిగా లేని హీరోలను అలవాటు చేయగలిగినప్పుడు.. ప్రతిభ, అందం ఉన్నవారిని, నటన చేయగలిగినవారిని ఇక్కడివారిని సెలెక్ట్ చేసుకుంటే తెలుగు ప్రజలు ఆదరించరా అని నేనడుగుతున్నాను.
బయటి వాళ్లే కావాలి అనేది ముందే నిర్ధారించుకుని తెచ్చుకున్న అభిప్రాయాలు మాత్రమే. వాళ్లొక మైండ్ సెట్‌తో ఉన్నారు. వాళ్లకు కావలసిన వారని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిలను. అమితాబ్ లాంటి వాడే కోట శ్రీనివాసరావును మీరు టాలీవుడ్‌లో ఉండవలసిన వారు కాదు. బాలీవుడ్‌కి రండి అని ఆహ్వానించారని ఈమధ్యే విన్నాను. అలాంటి కోటా గారే విలన్లను కూడా బయటి నుంచి తెచ్చుకోవడం ఏమిటి అని చాలాసార్లు ప్రశ్నించారు. ఇండస్ట్రీలో ఈ వాయిస్ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. కమిడియన్లు కూడా మాట్లాడుతున్నారు. విలన్లు మాట్లాడుతున్నారు. ఇవేవో మేము మాట్లాడుతున్నది కాదండి. చిన్న చిన్న హీరోలు, చిన్న నిర్మాతలు, చిన్న దర్శకులు కూడా మాట్లాడుతున్నారు. గతంలో వీరంతా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు. మీడియాకు గుర్తుంటుంది. వాళ్లు రోడ్డుమీదికొస్తే మేం వెళ్లి మద్దతు ప్రకటించాం.
థియేటర్లు దొరకకపోతే మాకూ థియేటర్లు ఇవ్వమని కోరుతూ అమ్మాయిలను పంపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇవి చెబితే ఒడిసేటివి కాదండి. థియేటర్లు దొరకనీయక పోవడం అప్రజాస్వామ్యం కాదా? వాళ్లకున్న భూములు, ఆస్తులు, బంగారం అమ్మి అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చి సినిమా పూర్తి చేస్తే, ఆ సినిమా రిలీజ్‌కి థియేటర్లు దొరకలేదంటే, ఇది ఎవరి బాధ్యత? ఇన్ని సమస్యలు మీకుంటే ఇన్నాళ్లుగా మీరు నిర్లక్ష్యం చేశారు. మీరు లెక్కచేయకపోబట్టే ఇవ్వాళ క్యాస్టింగ్ కౌచ్ సమస్య బయటికొచ్చింది. మీ వైఫల్యాలే సమస్యను ఇవాళ ఇలా బయటకు తెచ్చాయి. బయటి వారి మద్దతు లేకుండా మీ సమస్యను పరిష్కరించుకుంటే మా ప్రమేయమే అవసరం లేదు. ఇప్పటికైనా తెలుగు సినీ రంగంలో సమస్యలు ఉన్నాయని గుర్తించండి. తగిన చర్యలు చేపట్టండి.
జీవిత మీద కేసు పెట్టాలన్న ఆలోచన కాని, ఆ సమయం కానీ మాకు లేవు. క్యాస్టింగ్ కౌచ్ సమస్య తెలుగు సినీరంగంలో లేదని, అసలు కమిటీయే అవసరం లేదని ప్రకటించింది కాబట్టే, ఆమెనే క్యాస్టింగ్ కౌచ్ కమిటీ చైర్ పర్సన్‌గా చేయనున్నారు అని తెలిసే ఎలాంటి అవగాహనా లేని ఆమెకు, ఇంత అహంకారంతో అసలు సమస్యే లేదని బహిరంగంగా ప్రకటించిన జీవితను కమిటీ చైర్మన్‌గా ఎలా పెడతారు అనే ప్రశ్నిస్తున్నాం. ఇన్ని పోరాటాల తర్వాత 'మా' దిగి వచ్చి క్యాషింగ్ కౌచ్‌కి వ్యతిరేకంగా కమిటీ పెడతామని ప్రకటిస్తే అ కమిటీయే వద్దని జీవిత ప్రకటించడం చట్టవ్యతిరేకం, చట్ట విరుద్ధం. ఒక మహిళగా సంధ్య నన్ను అలా అనవచ్చా అని జీవిత అంది. క్యాస్టింగ్‌పై కమిటీ పెడతామని 'మా' అంటే వద్దని ఒక మహిళగా జీవిత అనడం సబబేనా అన్నది మా ప్రశ్న. నలభై ఏళ్ల ఉద్యమ జీవితంలో ఏనాడూ వ్యక్తుల వ్యక్తిగత విషయాలను మేం బయటపెట్టలేదు. స్పష్టమైన ఆధారాలున్నా, వ్యక్తుల పేర్లు బయటపెట్టకుండా సమస్యను పరిష్కరించడానికే ప్రయత్నించాం. ఆంధ్రజ్యోతిలో ఏడేళ్ల క్రితం జీవిత భర్త వ్యవహరంపై పూర్తి పేజీలో ప్రచురింపచేసిన వ్యాసంలో కూడా ఆ అమ్మాయిలు రాసిన లేఖనే ప్రచురించాం కానీ వ్యక్తుల పేరు బయటపెట్టలేదు. కానీ క్యాస్టింగ్ కౌచ్ సమస్యే లేదని చెబుతున్న వ్యక్తి అదే కమిటీ బాధ్యతల్లోకి వస్తోందని స్పష్టంగా తెలిసిన తర్వాతే, ఆమె అర్హతను ప్రశ్నిస్తూ మేం మాట్లాడాల్సి వచ్చింది.
నిన్ను సినీరంగం రాణిగా చూసుకుంటుందని అంటున్నావు. రేపు నీ కూతురు సినిమాల్లోకి వస్తే ఆమెకు నువ్వు ఏ సమస్య లేకుండా కాపాడుకోవచ్చు. ఎవరూ నీ కూతురు జోలికి వెళ్లకపోవచ్చు. కానీ చాలామంది బిడ్డలు, చెల్లెళ్లు, తల్లులు, అమ్మాయిలు సినిమామీద పిచ్చితో, సినిమాకళపై మోజుతో వచ్చారు. వచ్చి బయటకు పోలేక, వేరే పనులు చేసుకోలేక వేలాడుతున్నారు. వాళ్లకు మీకు ఉన్నంత అండదండలు లేకపోవచ్చు. నీకు భర్త ఉన్నాడు. నీ కూతురుకు మీరున్నారు. కానీ అలాంటి అండదండ లేని వారికి రక్షణ కల్పించమని అడిగితే తప్పెలా అవుతుంది? అలాంటివాళ్లు లైంగిక దోపిడికి గురికాకూడదు అని కోరుకుంటే తప్పెలా అవుతుంది?
జీవిత ఆలోచించాలి. బతుకు జట్కా బండి ప్రోగ్రామ్‌లో జీవితే అంది. సినీరంగంలోకి అమ్మాయిలు వస్తే, తెలుగు అమ్మాయిలు వస్తే వద్దు అని చెప్పి అనేకసార్లు వారిని వెనక్కు పంపానని జీవితే గతంలో అన్నది. ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయని అమ్మాయిలను వెనక్కు పంపించావు? సమస్యను పరిష్కరించాల్సింది పోయి అమ్మాయిలను వెనక్కు పంపిస్తున్నారు. ఆ సమస్యలు ఇప్పుడైనా పరిష్కరించమని అడిగితే అసలు క్యాష్ కమిటీలే వద్దంటున్నారు. పైగా 'సంధ్య ఒక విడాకులు తీసుకున్న వ్యక్తి' అని జీవిత మాట్లాడింది. నేనెవరో అందరికీ తెలుసు. కానీ డైవోర్సీ అంటే ఒక లంగ, దొంగ అనే అర్థంవచ్చేలా వెటకారంగా మాట్లాడిందామె. నీ సినిమా పరిశ్రమలో వందలమంది సింగిల్ వుమెన్ ఉన్నారు. నువ్వు వాళ్లందరినీ ఉద్దేశించి డైవోర్సీలు అని అపహాస్యంగా మాట్లాడుతున్నావంటే డైవోర్సు తీసుకున్నవారు నేరస్తులా, వాళ్లే తప్పులు చేస్తేనే వారికి డైవోర్సులు వచ్చాయా అని అడుగుతున్నాను.
తినితాగేవాళ్లు, అక్రమ సంబంధాలు పెట్టుకునేవాళ్లు, భార్యల్ని వదిలేసేవాళ్లు ఎంతమంది లేరు? మగాళ్లు చేసే ఆకృత్యాలకు పిల్లలు బలవుతున్నా, కుటుంబాలు నలిగిపోతున్నా సింగిల్ విమెన్‌గా, డైవోర్సీలుగా తమ కుటుంబాలను నెట్టుకుని వస్తున్నారు. ఇలాంటి వారి పట్ల సానుభూతి చూపనవసరం లేదు. సహానుభూతి చూపాలి. వందలాది మంది డైవోర్సీలు ఇవాళ నాకు ఫోన్లు చేసి, మీరు మీటింగ్ పెట్టండి మేం వచ్చి మాట్లాడతాం. జీవిత మమ్మల్ని అవమానించింది. విడాకులు తీసుకుని మేం తప్పు చేశామా, ఆమె ఎందుకనాలి? డైవోర్సీలను అలా అనవద్దు అని మీరు చెప్పడం మాకు చాలా ధైర్యాన్నిచ్చింది అని వారన్నారు. అందుకే కుటుంబాల చరిత్రలు చెప్పుకోవలసిన గతి నీకుందేమో కానీ మాకెవరికీ లేదు. మహిళలందరినీ ప్రేమిస్తాం.
పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య స్ఫూర్తిదాయక ప్రసంగం పూర్తి పాఠం కింది లింకులో చూడండి
POW Sandhya counters Jeevitha || Tollywood Casting Couch