Friday, April 20, 2018

మీ మొహాలకు తెలుగు హీరోయిన్లు పనికిరారా? తెలుగు హీరోలపై సంధ్య ఫైర్

యూట్యూబ్ తెరిస్తే చాలు.. శ్రీరెడ్డికి సపోర్టుగా, వ్యతిరేకంగా తెలుగు సమాజం నిలువునా చీలిపోయిన ముఖచిత్రమే గత కొన్ని వారాలుగా కనబడుతోంది. ఎవరి వైఖరి సరైంది, కాదు అని ఎవరికి వారు తేల్చుకునే సమయంలోనే పరిణామాలు విపరీతంగా మారిపోతున్నాయి. ప్రత్యేక హోదా ఉద్యమమే పక్కకు పోయేంత తీవ్ర స్థాయిలో ఇప్పుడు తెలుగు మీడియా తెలుగు సినీరంగంలో క్యాస్టింగ్ క్యాచ్‌పై ఎడతెగని యుద్ధాలు చేస్తోంది. రాంగోపాల్ వర్మ సలహా వ్యవహారం మరో కొత్త యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేస్తోంది.

కానీ ఇన్ని సంక్లిష్టతల మధ్య, వాదవివాదాల మధ్య కొన్ని ఉత్తేజకరమైన, స్ఫూర్తిదాయక మైన ప్రసారాలు యూట్యూబ్‌లో కనబడుతున్నాయి. వాటిలో ఇవ్వాళ నాకు కనిపించిన వీడియోలో కొంత భాగం ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఇది తెలుగు సినీమా మాఫియా గురించి, తెల్లతోలుపై హీరోల యావ గురించి, చిత్రసీమలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యే లేదంటూ సినీ నటి జీవిత చేసిన సంచలనాత్మక ప్రకటనపై పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య చేసిన ప్రసంగం. అత్యంత స్పష్టతతో కూడిన ఆమె ఉపన్యాసంలో కొంత భాగం ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఆమె ప్రసంగం పూర్తి పాఠం కింది వీడియో లింకులో కూడా చూడవచ్చు.

"తెలుగు సినీ మాఫియా, వీరి వెనక రాజకీయ నాయకులు, అక్రమ డబ్బును పోగేసుకుని వస్తున్నవారు తెలుగు సినిమాలోకి వచ్చి పెట్టుబడులు పెడుతుంటే, నాలుగే నాలుగు బ్యానర్లు మాత్రమే సినీరంగాన్ని ఏలుతున్నాయి. నాలుగు లేక అయిదు కుటుంబాలు.. దాంట్లో కూడా ఒక్క కులం లేదా రెండో కులం ఒకటి ఆరా కులాలు ఇవ్వాళ తెలుగు సినీ రంగాన్ని ఏలుతున్నాయి. వీళ్లే ముక్కుమొహాలున్నోళ్లా..  వీళ్లే వారసులా? ఇవ్వాళ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఈ హీరోల కంటే అందమైన పిల్లలు లేరా హీరోలుగా? మీరు అమ్మాయిలను ఇతర రాష్ట్రాలనుంచి తెచ్చుకుంటున్నారు. మరి అందంగా ఉండే అరవిందస్వామి లాంటివారిని, బాలీవుడ్ నుంచి మరికొందరిని తీసుకురండి. మీ నాలుగైదు కుటుంబాల హీరోలనే ఎందుకు చూడాలి మేం.  పక్కరాష్ట్రాల నుంచి అందంగా ఉండే హీరోలను తెచ్చుకుని ఎందుకు పెట్టరు? హీరోలుగా మీరే ఉంటారు? హీరోయిన్లనేమో పక్క రాష్ట్రాలనుంచి తెచ్చుకుంటారు.

తెలుగు రాష్ట్రాల్లో తెలుగు అమ్మాయిలు లేరా అందంగా? నటన చేయగలిగే అబ్బాయిలు లేరా? మీరే హీరోలుగా ఉంటారు. మీకు మాత్రం ఇంత పక్షపాతం అవసరమా? మీ సినిమాలే ధియేటర్లలో విడుదల చేసుకుంటారు. నిర్మాతలు లేకపోయినా, పెట్టుబడులు లేకపోయినా డబ్బులు పోగేసుకుని సినిమా పిచ్చితో సినిమా తీస్తే వాళ్లకు థియేటర్లు దొరకనీయరు. ఒకవేళ వేరేవాళ్ల సినిమాలు బాగున్నాయని టాక్ వస్తే వ్యతిరేకంగా రివ్యూలు రాయిస్తారు. నేనివాళ చెబుతున్నాను. సినిమారంగంలో ఉన్న అయిదు బ్యానర్లు, నాలుగైదు కుటుంబాలు ఒక మాఫియా. మీలో మార్పు వస్తేనే సినిమారంగంలో మార్పు వస్తుంది. మీరు అందరినీ అణిచివేస్తున్నారు. కొత్తగా సృజనాత్మకంగా కథలు రానివ్వరు. సృజనాత్మకంగా నటించే వారిని రానివ్వరు. ఉదయ్ కిరణ్ లాంటి వాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?

సినిమారంగంలోకి వేరే కులాల వాళ్లు వచ్చినా, లేదా సినిమా కుటుంబాలకు చెందని చిన్నవాళ్లు వచ్చినా మీరు తొక్కేస్తున్నారు. ఎంతకాలం తొక్కేస్తారో చూస్తాం. సినిమారంగంలో కొత్త రక్తం రావాలి. కొత్తవాళ్లు రావాలి. సృజనాత్మకత రావాలి. మంచి కథలు రావాలి అని ప్రజాసంఘాలుగా మేము కూడా కోరుకుంటున్నాం.  అలాగే సినిమారంగంలోని తీరుతెన్నుల్లో మార్పు రావాలి. అక్కడి వారి సమస్యలు పరిష్కరించాలి. సినీరంగంలోని దోపిడీ విధానాలు మారాలని కోరుకుంటున్నాం కాబట్టే ఈ క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఇతర మహిళా సంఘాలతో కలిసి చేపట్టాం.

జీవితగారు ఇవ్వాళ మాపై కేసు పెట్టారని భయపడం. అనేకమంది మాకు మద్దతుగా వస్తామని, సాక్ష్యం చెబుతామని చెబుతున్నారు. ఇలాంటి కేసులు చాలా చూశాం. కేసులు పెడితే భయపడిపోయే వాళ్లం కాదు. ఇలాంటి కేసులు మాకు కొత్త కాదు. రాజ్యమే మాపై ఎన్నో కేసులు పెట్టింది. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు వస్తే తొమ్మిది వామపక్షాలు కలిసి నిరసన తెలిపాయని ఆరోపించి నన్ను ఏ1 ముద్దాయిగా కేసు పెట్టారు. ఎంతోమంది వామపక్ష నేతలపై కేసులు పెట్టారు. ఎంతోమంది ఉద్యోగాలను రాజ్యం తీసేసింది. నా ఉద్యోగాన్ని కూడా తీసింది. అయినా మేం వేటికీ చెక్కుచెదరలేదు. అలాంటిది జీవిత పెట్టిన కేసును ఎదుర్కొవడానికి ఇక్కడెవరూ భయపడటం లేదు.

జీవిత అనుకోవచ్చు సంధ్య అంటే ఒక వ్యక్తి అని. కానీ సంధ్య వ్యక్తి కాదు. సంస్థ. ప్రగతిశీల మహిళా సంఘం ఆశయాలతో  గత 40 ఏళ్లుగా శ్రామికవర్గ మహిళా ఉద్యమాన్ని నిర్మించడానికి పనిచేస్తున్న సంఘానికి నేను బాధ్యురాలిని. పీడిత వర్గం ఎక్కడుంటే అక్కడ వారికోసం మేం పనిచేస్తున్నాం. ఇలాంటి కేసులకు మేం భయపడేది లేదు. జీవితా నువ్వు భాష మార్చుకో. నువ్వు మహిళలను అవమానపరుస్తున్నావు.  విడాకులు తీసుకున్న వారిని అవమానిస్తున్నావు. ఉద్యమకారులను అవమానపరుస్తున్నావు. ఇది కొనసాగించవద్దు.మహిళగా నీమీద మాకు సింపతీ ఉంది. కానీ హద్దులు దాటి నువ్వు హెచ్చరికలు చేస్తే భయపడేది లేదు. నీ తీరును మార్చుకో అని హెచ్చరిస్తున్నాం. 

గ్లామర్ ఉన్న హీరోయిన్లను కాకుండా తెలుగు అమ్మాయిలను పెట్టుకుని సినిమాలు తీస్తే మాకు నష్టాలు వస్తే వాటిని ఎవరు భరించాలి అనే ప్రశ్న కొంతకాలంగా ముందుకొస్తోంది. మరి ముక్కూ మొహాలు సక్కంగ లేనోళ్లు, 20, 30 ఆపరేషన్లు చేసుకుని ఇండస్ట్రీలో నిలబడిన మీ మొహాలను తెలుగు ప్రజలమీద రుద్దుతున్నారా అని నేనడుగుతున్నాను. మంచిదే. తెలుగు వారు ఎవరూ పనికిరారు. మన ఇండస్ట్రీలో ఉన్నవారు ఎవరూ పనికిరారు. మీకిష్టమైన వారిని తెచ్చుకుని ఇక్కడి వారికి పది రూపాయలు ఖర్చుపెడితే వాళ్లకు వందరూపాయలు ఖర్చుపెడుతున్నారు. మరి ఆ నాలుగైదు కుటుంబాల వారినే ఎందుకు జనంమీద హీరోలుగా రుద్దుతున్నారు. వాళ్లనే హీరోలుగా అలవాటు చేశారు కదా. అంటే వీళ్లంతా సినిమాతోనే పుట్టిపెరిగిన హీరోలా? ఈ ముక్కూ మొహం సరిగా లేని హీరోలను అలవాటు చేయగలిగినప్పుడు.. ప్రతిభ, అందం ఉన్నవారిని, నటన చేయగలిగినవారిని ఇక్కడివారిని సెలెక్ట్ చేసుకుంటే తెలుగు ప్రజలు ఆదరించరా అని నేనడుగుతున్నాను.

బయటి వాళ్లే కావాలి అనేది ముందే నిర్ధారించుకుని తెచ్చుకున్న అభిప్రాయాలు మాత్రమే. వాళ్లొక మైండ్ సెట్‌తో ఉన్నారు. వాళ్లకు కావలసిన వారని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిలను. అమితాబ్ లాంటి వాడే కోట శ్రీనివాసరావును మీరు టాలీవుడ్‌లో ఉండవలసిన వారు కాదు. బాలీవుడ్‌కి రండి అని ఆహ్వానించారని ఈమధ్యే విన్నాను. అలాంటి కోటా గారే విలన్లను కూడా బయటి నుంచి తెచ్చుకోవడం ఏమిటి అని చాలాసార్లు ప్రశ్నించారు. ఇండస్ట్రీలో ఈ వాయిస్ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. కమిడియన్లు కూడా మాట్లాడుతున్నారు. విలన్లు మాట్లాడుతున్నారు. ఇవేవో మేము మాట్లాడుతున్నది కాదండి. చిన్న చిన్న హీరోలు, చిన్న నిర్మాతలు, చిన్న దర్శకులు కూడా మాట్లాడుతున్నారు. గతంలో వీరంతా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు. మీడియాకు గుర్తుంటుంది. వాళ్లు రోడ్డుమీదికొస్తే మేం వెళ్లి మద్దతు ప్రకటించాం.

థియేటర్లు దొరకకపోతే మాకూ థియేటర్లు ఇవ్వమని కోరుతూ అమ్మాయిలను పంపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇవి చెబితే ఒడిసేటివి కాదండి.  థియేటర్లు దొరకనీయక పోవడం అప్రజాస్వామ్యం కాదా? వాళ్లకున్న భూములు, ఆస్తులు, బంగారం అమ్మి అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చి సినిమా పూర్తి చేస్తే, ఆ సినిమా రిలీజ్‌కి థియేటర్లు దొరకలేదంటే,  ఇది ఎవరి బాధ్యత? ఇన్ని సమస్యలు మీకుంటే ఇన్నాళ్లుగా మీరు నిర్లక్ష్యం చేశారు. మీరు లెక్కచేయకపోబట్టే ఇవ్వాళ క్యాస్టింగ్ కౌచ్ సమస్య బయటికొచ్చింది. మీ వైఫల్యాలే సమస్యను ఇవాళ ఇలా బయటకు తెచ్చాయి. బయటి వారి మద్దతు లేకుండా మీ సమస్యను పరిష్కరించుకుంటే మా ప్రమేయమే అవసరం లేదు. ఇప్పటికైనా తెలుగు సినీ రంగంలో సమస్యలు ఉన్నాయని గుర్తించండి. తగిన చర్యలు చేపట్టండి.

జీవిత మీద కేసు పెట్టాలన్న ఆలోచన కాని, ఆ సమయం కానీ మాకు లేవు. క్యాస్టింగ్ కౌచ్ సమస్య తెలుగు సినీరంగంలో లేదని, అసలు కమిటీయే అవసరం లేదని ప్రకటించింది కాబట్టే, ఆమెనే క్యాస్టింగ్ కౌచ్ కమిటీ చైర్ పర్సన్‌గా చేయనున్నారు అని తెలిసే ఎలాంటి అవగాహనా లేని ఆమెకు, ఇంత అహంకారంతో అసలు సమస్యే లేదని బహిరంగంగా ప్రకటించిన జీవితను కమిటీ చైర్మన్‌గా ఎలా పెడతారు అనే ప్రశ్నిస్తున్నాం. ఇన్ని పోరాటాల తర్వాత 'మా' దిగి వచ్చి క్యాషింగ్ కౌచ్‌కి వ్యతిరేకంగా కమిటీ పెడతామని ప్రకటిస్తే అ కమిటీయే వద్దని జీవిత ప్రకటించడం చట్టవ్యతిరేకం, చట్ట విరుద్ధం. ఒక మహిళగా సంధ్య నన్ను అలా అనవచ్చా అని జీవిత అంది. క్యాస్టింగ్‌పై కమిటీ పెడతామని 'మా' అంటే వద్దని ఒక మహిళగా జీవిత అనడం సబబేనా అన్నది మా ప్రశ్న. నలభై ఏళ్ల ఉద్యమ జీవితంలో ఏనాడూ వ్యక్తుల వ్యక్తిగత విషయాలను మేం బయటపెట్టలేదు. స్పష్టమైన ఆధారాలున్నా, వ్యక్తుల పేర్లు బయటపెట్టకుండా సమస్యను పరిష్కరించడానికే ప్రయత్నించాం. ఆంధ్రజ్యోతిలో ఏడేళ్ల క్రితం జీవిత భర్త వ్యవహరంపై పూర్తి పేజీలో ప్రచురింపచేసిన వ్యాసంలో కూడా ఆ అమ్మాయిలు రాసిన లేఖనే ప్రచురించాం కానీ వ్యక్తుల పేరు బయటపెట్టలేదు. కానీ క్యాస్టింగ్ కౌచ్ సమస్యే లేదని చెబుతున్న వ్యక్తి అదే కమిటీ బాధ్యతల్లోకి వస్తోందని స్పష్టంగా తెలిసిన తర్వాతే, ఆమె అర్హతను ప్రశ్నిస్తూ మేం మాట్లాడాల్సి వచ్చింది.

నిన్ను సినీరంగం రాణిగా చూసుకుంటుందని అంటున్నావు. రేపు నీ కూతురు సినిమాల్లోకి వస్తే  ఆమెకు నువ్వు ఏ సమస్య లేకుండా కాపాడుకోవచ్చు. ఎవరూ నీ కూతురు జోలికి వెళ్లకపోవచ్చు. కానీ చాలామంది బిడ్డలు, చెల్లెళ్లు, తల్లులు, అమ్మాయిలు సినిమామీద పిచ్చితో, సినిమాకళపై మోజుతో  వచ్చారు. వచ్చి బయటకు పోలేక, వేరే పనులు చేసుకోలేక వేలాడుతున్నారు. వాళ్లకు మీకు ఉన్నంత అండదండలు లేకపోవచ్చు. నీకు భర్త ఉన్నాడు. నీ కూతురుకు మీరున్నారు. కానీ అలాంటి అండదండ లేని వారికి రక్షణ కల్పించమని అడిగితే తప్పెలా అవుతుంది? అలాంటివాళ్లు లైంగిక దోపిడికి గురికాకూడదు అని కోరుకుంటే తప్పెలా అవుతుంది?

జీవిత ఆలోచించాలి. బతుకు జట్కా బండి ప్రోగ్రామ్‌లో జీవితే అంది. సినీరంగంలోకి అమ్మాయిలు వస్తే, తెలుగు అమ్మాయిలు వస్తే వద్దు అని చెప్పి అనేకసార్లు వారిని వెనక్కు పంపానని జీవితే గతంలో అన్నది. ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయని అమ్మాయిలను వెనక్కు పంపించావు? సమస్యను పరిష్కరించాల్సింది పోయి అమ్మాయిలను వెనక్కు పంపిస్తున్నారు. ఆ సమస్యలు ఇప్పుడైనా పరిష్కరించమని అడిగితే అసలు క్యాష్ కమిటీలే వద్దంటున్నారు. పైగా 'సంధ్య ఒక విడాకులు తీసుకున్న వ్యక్తి' అని జీవిత మాట్లాడింది. నేనెవరో అందరికీ తెలుసు. కానీ డైవోర్సీ అంటే ఒక లంగ, దొంగ అనే అర్థంవచ్చేలా వెటకారంగా మాట్లాడిందామె. నీ సినిమా పరిశ్రమలో వందలమంది సింగిల్ వుమెన్ ఉన్నారు. నువ్వు వాళ్లందరినీ ఉద్దేశించి డైవోర్సీలు అని అపహాస్యంగా మాట్లాడుతున్నావంటే డైవోర్సు తీసుకున్నవారు నేరస్తులా, వాళ్లే తప్పులు చేస్తేనే వారికి డైవోర్సులు వచ్చాయా అని అడుగుతున్నాను.

తినితాగేవాళ్లు, అక్రమ సంబంధాలు పెట్టుకునేవాళ్లు, భార్యల్ని వదిలేసేవాళ్లు ఎంతమంది లేరు?  మగాళ్లు చేసే ఆకృత్యాలకు పిల్లలు బలవుతున్నా, కుటుంబాలు నలిగిపోతున్నా సింగిల్ విమెన్‌గా, డైవోర్సీలుగా తమ కుటుంబాలను నెట్టుకుని వస్తున్నారు. ఇలాంటి వారి పట్ల సానుభూతి చూపనవసరం లేదు. సహానుభూతి చూపాలి. వందలాది మంది డైవోర్సీలు ఇవాళ నాకు ఫోన్లు చేసి, మీరు మీటింగ్ పెట్టండి మేం వచ్చి మాట్లాడతాం. జీవిత మమ్మల్ని అవమానించింది. విడాకులు తీసుకుని మేం తప్పు చేశామా, ఆమె ఎందుకనాలి? డైవోర్సీలను అలా అనవద్దు అని మీరు చెప్పడం మాకు చాలా ధైర్యాన్నిచ్చింది అని వారన్నారు. అందుకే కుటుంబాల చరిత్రలు చెప్పుకోవలసిన గతి నీకుందేమో కానీ మాకెవరికీ లేదు. మహిళలందరినీ ప్రేమిస్తాం.

పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య స్ఫూర్తిదాయక ప్రసంగం పూర్తి పాఠం కింది లింకులో చూడండి

POW Sandhya counters Jeevitha || Tollywood Casting Couch

31 comments:

నీహారిక said...

>>> డైవోర్సు తీసుకున్నవారు నేరస్తులా, వాళ్లే తప్పులు చేస్తేనే వారికి డైవోర్సులు వచ్చాయా అని అడుగుతున్నాను>>>>

ఖచ్చితంగా నేరస్థులే !
వివాహం జరిగేటపుడే ప్రమాణం చేసి ఉల్లంగించిన వారినేమనాలి ?
శ్యామలీయం గారి శృంగార పురుషుడే ఒక ఉదాహరణ !


Anonymous said...

వాళ్ళు ఎవరితో సినిమా తియ్యాలనేవిషయంపై వాళ్ళను ఎలా శాశించగలం? ఇదేమాట Trump (ఉద్యోగాలివ్వడానికి అమెరికన్లు లేరా?) అంటే మనం నొచ్చుకున్నాంకదా! అదే డిమాండును మనం సినిమారంగంనుండి ఎలా చెయ్యగలం?

ఇక నాలుగు ప్రొడక్షన్ హౌజులూ, చిన్నదర్శకుల సమస్యలూ అవీ.. కేవలం ప్రేక్షకులను చైతన్యపరచడంవల్ల సాధించవలసిందేగానీ, కొత్త రూల్సుండడంవల్ల అవ్వవు. "ఫలానా" నిర్మాత తప్పుడుపనులు చేస్తున్నాడు అన్నప్పుడు అతని సినిమాలను బహిష్కరించవలసింది ప్రేక్షకులే. ప్రేక్షకులకు/ప్రజలకు పట్టనప్పుడు చట్టాలు మాత్రం చేసేది ఏముంటుంది? ప్రజలకు rightful anger లేకుండకపోవడం, కులపిచ్చి ఉండడం దీనికంతటికీ కారణం.


@ నీహారిక: బలవంతపు సంసారం వ్యభిచారంకన్నా నీఛం. కొంతమందైనా చైతన్యంతో దాన్ని గుర్తెరిగి, ధైర్యంతో ముందడుగు వేసినప్పుడు దాన్ని అభినందించాలేగానీ, ఎప్పుడో చేసిన ప్రమాణాలు అంటూ పాతచింతకాయపచ్చళ్ళు నూరడం సరికాదు. గతంలో తీసుకున్న నిర్ణయం తప్పన్న అభిప్రాయానికి వచ్చినప్పుడు, దాన్ని వీలైనంత సరిచేసుకోవాలేగానీ, ప్రమాణం పేరుతో అదే ఊబిలోకి మరింతగా కూరుకుపోవడం నిఖార్సైన మూర్ఖత్వం.

- Ketan

నీహారిక said...

>>>>బలవంతపు సంసారం వ్యభిచారంకన్నా నీఛం>>>>>

బలవంతపు సంసారం వ్యభిచారం అయితే విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్ళిచేసుకోవడాన్ని ఏమనాలి ?

ketan said...

అందులో తప్పేముంది?

Anonymous said...

Divorce theesukuni malli pelli chesukovadam lo yem thappu undi.

నీహారిక said...

వ్యభిచారం అంటే ఏమిటి ?

వ్యభిచారం లేదా పడుపు వృత్తి (Prostitution) అంటే డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకోవడం. ఇలా జీవించేవారిని వేశ్యలు అంటారు. కొంత మంది స్త్రీలు పేదరికం మరియు ఆకలి వల్ల వ్యభిచారిణులుగా మారుతారు. కొంత మంది స్త్రీలు తల్లితండ్రుల నిర్లక్ష్యం ప్రభావం వల్ల వ్యభిచారిణులుగా మారుతారు. కొన్ని ముఠాలు ఉద్యోగాలు పేరుతో అమాయక బలికలని నిర్భందించి ( కిడ్నాప్ చేసి) వ్యభిచార కేంద్రాలకి అమ్మేస్తుంటాయి. జెర్మనీ లాంటి కొన్ని దేశాలలో మాత్రమే వ్యభిచారాన్ని చట్టబద్దం చెయ్యడం జరిగింది. ఇరాన్ వంటి దేశాలలో వ్యభిచారానికి మరణ శిక్ష వేస్తారు. కులట, జారస్త్రీ, వేశ్య,(ఒకరికన్నా ఎక్కువ పురుషులతో లైంగిక సంబంధము కలది) లేదా వెలయాలు అనగా బ్రతుకు తెరువు కోసం వ్యభిచార వృత్తిని అవలంబించే స్త్రీ. చరిత్రలో రాజులు మరియు చక్రవర్తులు తమ భొగవిలాసాల కోసం వేశ్యలను పోషించేవారు.

నీహారిక said...

ఒకరికన్నా ఎక్కువ పురుషులతో లైంగిక సంబంధము కలవాళ్ళను వ్యభిచారులంటారు కదా ? ఒకరిని విడిచి మరొకరిని వివాహం చేసుకుంటే కూడా వ్యభిచారమనే అనాలి.తలాక్ చెప్పి ముగ్గురిని పెళ్ళిచేసుకుంటే వ్యభిచారము కాదా ? వివాహం అనే ముసుగేసి చట్టబద్దత కల్పించడం లేదా ? దీనికీ వ్యభిచారానికి చట్టబద్దత కల్పించడానికీ తేడా ఏంటీ ?

ketan said...

"ఒకరికన్నా ఎక్కువ పురుషులతో లైంగిక సంబంధము కలవాళ్ళను వ్యభిచారులంటారు కదా ?"
అనరు.

"ఒకరిని విడిచి మరొకరిని వివాహం చేసుకుంటే కూడా వ్యభిచారమనే అనాలి"
మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్ధం అవుతుందా? అంటే... పొరపాటున ఒకరిని పెళ్ళిచేసుకుంటే... ఆ తరువాత తప్పును తెలుసుకొని, విడిపోయినా.. జీవితాంతం ఒంటరిగా ఉండాలా? ఇదెలా ఉందంటే... ఒకవ్యక్తి ఒక చిన్నతప్పుచేసినందుకుగానూ... అతను మరణించేంతవరకూ జైల్లో ఉంచాలని చెప్పినట్లుగా ఉంది. కొన్నాళ్లక్రితం పవన్ అభిమానులు రేణు దేశాయ్ విషయంలో ఇలాగే మాట్లాడినట్లు గుర్తు.

P.S.: నేను "నీచం" అని వాడినది విలాసాలకోసం పాల్పడే వ్యభిచారం విషయాన్ని దృష్టిలో ఉంచుకొని. నా మాట వెనక్కు తీసుకుంటున్నాను.

నీహారిక said...

>>>>"ఒకరికన్నా ఎక్కువ పురుషులతో లైంగిక సంబంధము కలవాళ్ళను వ్యభిచారులంటారు కదా ?"
అనరు. >>>

ఏమంటారో చెప్పండి. నేనేం వ్రాస్తున్నానో నాకు పూర్తి స్పష్టత ఉంది.మీరు కూడా స్పష్టతతో వ్రాయండి.

నీహారిక said...

పొరపాటున ఒకరిని పెళ్ళిచేసుకుంటే... ఆ తరువాత తప్పును తెలుసుకొని, విడిపోయినా.. జీవితాంతం ఒంటరిగా ఉండాలా?

ఉండాలి....సీతలాగా ఆత్మహత్య చేసుకోకుండా జశోదా బెన్ లాగా జీవితం లో దృఢంగా ధీర వనితలాగా నిలబడాలి.నాకే అవకాశం ఉంటే స్త్రీ శక్తి పురస్కారం ఇచ్చి మరీ గౌరవించుకుంటాను.

నీహారిక said...

ఒకవ్యక్తి ఒక చిన్నతప్పుచేసినందుకుగానూ... అతను మరణించేంతవరకూ జైల్లో ఉంచాలని చెప్పినట్లుగా ఉంది.

ఒక వ్యక్తి అత్యాచారం చేస్తే ఉరిశిక్ష వేయడం చాలా తప్పు.అత్యాచారం చేయబడిన స్త్రీ కి అంగీకారం అయితే వివాహం చేయాలి...ఆ స్త్రీకి ఇష్టం లేకపోతే ఆ వ్యకిని జీవితాంతం మరణించే వరకూ జీవిత ఖైదు చేయాల్సిందే.

UG SriRam said...

ఉత్తరాది హీరోయిన్ల కైతే ఇక్కడ స్థాన బలం ఉండదు. తెలుగు హీరోయిన్ లు విజయశాంతి,సౌందర్య లా పేరు తెచ్చుకొని, రాజకీయాలలోకి వస్తే, హీరోల ఇమేజ్ డామేజ్ అవుతుందని భయం.

విన్నకోట నరసింహా రావు said...

సౌందర్య (May her soul rest in peace) కూడా తెలుగమ్మాయి కాదండి యుజి శ్రీరామ్ గారు.

ketan said...

@ నీహారిక: జసోధా బెన్‌కు నచ్చిందే అందరికీ నచ్చాలనీ, ఆమె వైరాగ్యమే అందరికీ ఆదర్శమనీ అనుకోవడం సరికాదు.

మీరెలాగూ అడిగారు కాబట్టి చెబుతున్నాను. Swappers/swingersనీ Polyamoryని ప్రదర్శించేవాళ్లనీ (భాగస్వామి అంగీకారంతో వివాహేతర సంబంధాలు కలిగుండడం) వ్యభిచారులు అనరు.

మీదగ్గర ఒకరు దొంగతనం చేస్తే, వారిని క్షమించే ఉదాత్తత మీకుండుండొచ్చు. వారి నేరచింతనను (సంస్కరణార్ధం) శిక్షించాలని చెబుతుంది న్యాయం. "నీపై అత్యాచారం చేసినవాడిని నీవు పెళ్ళిచేసుకుంటావా" అనడగటం అత్యంత కౄరమైన విషయం.

Raja Sekhara Raju said...

నీహారిక గారూ,
గత రెండు రోజులుగా ఆఫీసులోంచి మీ వ్యాఖ్యలపై అభిప్రాయం పెడుతుంటే సిస్టమ్ మొరాయిస్తోంది. పెట్టిన వ్యాఖ్య కూడా తీసుకోలేదు. దీంతో కాస్త ఆలస్యమయింది. ఒక్కమాట. మీరు కాలాన్ని కందుకూరి వీరేశలింగం కంటే వెనక్కు లాగుతున్నారని నేననలేను కానీ, చర్చను వివాదపూరితంగా కొనసాగించాలనుకుంటున్నారేమో.. లేక యశోదా బెన్‌ను అలా గాలికొదిలేసి ఊరేగుతున్న మోదీపై రాళ్లు చల్లుతున్నారా..? లేక ఈ నవీన యుగంలోనూ పెళ్లయిన ఆడది అలా నూరేళ్లూ పడి ఉండాలనుకుంటున్నారా ఏదీ స్పష్టం కాలేదు. ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంలో శ్రీరెడ్డిపైకి ఒంటికాలిపైకి లేస్తున్న మన సైబర్ ఆడ గూండాలూ, మన తెలుగు తెల్ల తోలు హీరోయిన్లూ (ముంబై తెల్ల తోళ్లు కాదు) తాము పతిప్రతలం.. చిత్రసీమ రాక్షసులు తమను పడేయాలని చూసినా తాము పడం అంటూ టీవీలముందు చాటుకుంటూ అసలు సమస్యలను డైవర్ట్ చేసి వెగటు కలిగిస్తున్నారు. మీ కొన్ని వ్యాఖ్యలు వారికి వత్తాసు కలిగిస్తున్నాయేమో చూడండి. ఇది వ్యక్తిగత విమర్శ కాదు.

శ్యామలీయం said...

. . . గత రెండు రోజులుగా ఆఫీసులోంచి మీ వ్యాఖ్యలపై అభిప్రాయం పెడుతుంటే సిస్టమ్ మొరాయిస్తోంది . . .

అఫీసునుండి సోషల్ మీడియాలో‌ టపాలూ‌ వ్యాఖ్యలూ‌ పెట్టటం అంతగా క్షేమకరం‌ కాదు. ఇటువంటి కార్యకలాపాలను ఆఫీసులు ప్రోత్సహించవు సరికదా వీలైనంతగా అడ్డుకుంటాయి. ఆ క్రమంలో అలాంటి కార్యక్రమాలను చేసేవారికి ఇబ్బందులు కూడా ఎదురు కావచ్చును. తస్మాత్ జాగ్రత.

నీహారిక said...

కందుకూరి వీరేశలింగం లా మీ మగజాతిని సంస్కరించాలన్న కోరిక నాకు లేదు. గిరీశానికి బుచ్చమ్మ దొరికినట్లు తలకు మాసిన వెధవ నాకెక్కడ దొరుకుతాడు ? కంగారుపడకండి.

విన్నకోట నరసింహా రావు said...

కందుకూరి వీరేశలింగం ..... “మగజాతి” సంస్కరణ ??? !!! 🤔..🤔..🤔

ketan said...

నీహారిక: మీ చేత సంస్కరించబడేంత దైన్య స్థితిలో ఇకాడెవరైనా ఉన్నారని నేననుకోవట్లేదు. మిమ్మల్ని మీరు ఉధ్ధరించుకోండి. మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. ఆమాత్రం చాలును మాకు.

All the best.

నీహారిక said...
This comment has been removed by the author.
నీహారిక said...

>>>>యశోదా బెన్‌ను అలా గాలికొదిలేసి ఊరేగుతున్న మోదీపై రాళ్లు చల్లుతున్నారా..? లేక ఈ నవీన యుగంలోనూ పెళ్లయిన ఆడది అలా నూరేళ్లూ పడి ఉండాలనుకుంటున్నారా ఏదీ స్పష్టం కాలేదు.>>>
పెళ్ళయిన ఆడది లేక మగాడూ అలా నిండు నూరేళ్ళూ సన్యాసం లో గడపగలిగితే ప్రపంచంలో ఉన్న అత్యంత అరుదైన వ్యక్తులుగా కీర్తించాలి. మోదీ పై రాళ్ళు జల్లడం అనేది వేరే అంశం. భర్త అంగీకారంతో వివాహేతర సంబంధాలు కలిగి ఉండడం, భర్త అంగీకరం లేకుండా వివాహ సంబంధం కలిగి ఉండడం కూడా వ్యభిచారాలే అన్న నా అభిప్రాయాన్ని "జుంబారే ...జు జుంబరే" అంటూ ఆటవిక యుగంలోకి తీసుకెళ్ళానని అంటున్నారు.

అసలు విషయం పై స్పష్టతనిస్తున్నాను జాగ్రత్తగా నోట్ చేసుకోండి.

శ్యామలీయంగారి మాట వరసకు ఒక అప్సరస స్వర్గంలో ఒకనికి కామాది సుఖాలను అందిస్తున్నది అనుకుంటే దాని అర్థం ఆమె మానవలోకం నుండి వచ్చిన ఒకడి కోసం మానవస్త్రీలాగూ ఐపోయి మన లోకంలో ఉంటారని చెప్పబడే ఒక వేశ్యలాగా ప్రవర్తిస్తుందని కాదు. కానే‌ కాదు. ఆ భోగాల పట్ల ఆజీవికి మిగిలి ఉన్న ఆసక్తిని తగ్గించి నయంచేసేందుకు ఆవిడ దగ్గర ఉపాయం ఉందని. తేజో‌జీవులైన వారి వద్ద ఉండే ఉపాయం ఏమిటంటే వారి తేజస్సుల ప్రభావం ఆ జీవులను ఆకర్షించి వారి నుండి మోహాదులను తొలగించటం. ఆమె అలా తొలగిస్తున్నది అని అర్థం.

దీనిని బట్టి మీకు ఏమర్ధం అయింది ? ఒకరు,ఇద్దరు లేదా పది వేలమందితో మీరు సంసారిక సుఖాలను పొందినా ఆఖరికి అన్నిటినీ త్యజించి సన్యాసం స్వీకరించవలసిందే అని అర్ధం. జశోదా బెన్ బలవంతంగా సన్యాసం స్వీకరిస్తే అది మోడీ చేసిన మోసం కాబట్టి తిడుతున్నాను, తిడతాను కూడా ....ఆవిడ నిజంగా సన్యాసం స్వీకరిస్తే పురస్కారం ఇవ్వవచ్చు అని నేను అభిప్రాయపడుతున్నాను.

నీహారిక said...

@కేతన్,

నన్ను నేను ఉద్ధరించుకునే ప్రయత్నమే ఇదంతా ...మీ సలహా కి ధన్యవాదాలు.

నీహారిక said...

@ కేతన్,

>>>>మీదగ్గర ఒకరు దొంగతనం చేస్తే, వారిని క్షమించే ఉదాత్తత మీకుండుండొచ్చు. వారి నేరచింతనను (సంస్కరణార్ధం) శిక్షించాలని చెబుతుంది న్యాయం. >>>>

మీరు చెప్పిన నాయస్థానమే వ్యభిచారాన్ని అరికట్టటం సాధ్యం కానప్పుడు చట్టబద్ధం చేయరెందుకని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. వ్యభిచారం ప్రపంచంలోనే అత్యంత పురాతన వృత్తి అని సోలిసిటర్‌ జనరల్‌ చేసిన వాదనపై కోర్టు స్పందిస్తూ.. చట్టప్రకారం అరికట్టలేకపోతున్నప్పుడు మీరెందుకు వ్యభిచారాన్ని చట్టబద్ధంగా గుర్తించరు? అలా గుర్తిస్తే ఆ వ్యాపారాన్ని పర్యవేక్షించవచ్చు, పునరావాసం కల్పించవచ్చు, బాధితులకు వైద్యసాయం అందించవచ్చు అని ధర్మాసనం పేర్కొంది.(ఈనాడు10.12.2009)

నా దృష్టిలో వ్యభిచారం, అత్యాచారం రెండూ ఒకటే ! మీరంతా వేరు అంటున్నారు కాబట్టే చర్చ జరుగుతోంది. డబ్బిస్తే, వేషం ఇస్తే అంతా సవ్యంగా జరిగినట్లు, ఇవ్వకపోతే సవ్యంగా లేనట్లూనా ? వ్యభిచారానికి చట్టబద్దత కల్పిస్తే అత్యాచారాలకీ చట్టబద్దత కల్పించినట్లే ! వ్యభిచారాన్ని అరికడితే అత్యాచారాలూ పోతాయి. అది సాధ్యమా ? జర్మనీలో అత్యాచారాలే జరగడం లేదా ? నాకు తెలియదు. తెలిస్తే చెప్పండి.

"నీపై అత్యాచారం చేసినవాడిని నీవు పెళ్ళిచేసుకుంటావా" అనడగటం అత్యంత కౄరమైన విషయం."
నాపై ఎంత ఇష్టం లేకపోతే అత్యాచారం చేస్తాడు ?
అభిరాం శ్రీ రెడ్డి ని ఎలా ముద్దుపెట్టుకున్నాడా అని ఎంతగా ఆలోచించినా సమాధానం దొరకడం లేదు. ప్రేమ గుడ్డిది.

విన్నకోట నరసింహా రావు said...

నీహారిక గారూ, నా ఇంటి పేరు సరిగ్గా వ్రాయమని మీకు ఇటీవలొకసారి మనవి చేశాను. నా ఇంటి పేరు “విన్నకోట” ఒకే మాట ... మధ్యకు తెగ్గొట్టి “వి కో” అని ఎందుకు అంటున్నారో అర్థం కావడంలేదు. అయినా మీరు కృష్ణాజిల్లా వారయ్యుండి కూడా కృష్ణాజిల్లాలోని ఊరు పేరు విషయంలో తికమక ఏమిటి?
పైగా “వి కో న” ఏమిటి - తలకోన, పెంచలకోన లాగా ?

ketan said...

అదుపులోపెట్టలేనంత మాత్రానికి చట్టబధ్ధత కల్పించేటట్టైతే... ఇండియాలో ప్రతిదాన్నీ లీగలైజ్ చేసితీరాలి. జేబుదొంగతనాల్నుంచీ, వోట్లను సారాయితో కొనడంనుంచీ, మతకలహాలవరకూ అన్నింటినీ లీగలైజ్ చేసి పారెయ్యండి ఓ పనైపోతుంది.

"నా దృష్టిలో వ్యభిచారం, అత్యాచారం రెండూ ఒకటే ! మీరంతా వేరు అంటున్నారు కాబట్టే చర్చ జరుగుతోంది. డబ్బిస్తే, వేషం ఇస్తే అంతా సవ్యంగా జరిగినట్లు, ఇవ్వకపోతే సవ్యంగా లేనట్లూనా ? వ్యభిచారానికి చట్టబద్దత కల్పిస్తే అత్యాచారాలకీ చట్టబద్దత కల్పించినట్లే ! వ్యభిచారాన్ని అరికడితే అత్యాచారాలూ పోతాయి. అది సాధ్యమా ? జర్మనీలో అత్యాచారాలే జరగడం లేదా ? నాకు తెలియదు. తెలిస్తే చెప్పండి."

మీ దృష్టికోణం అద్భుతం సుమండీ! అప్పుతీసుకోవడం, ఇంటికి కన్నంవెయ్యడం ఒకటే అన్నట్లుగా ఉంది మీవాదన. ఒకటి consensual రెండొది crime. మ్యూనిక్ (జర్మనీ) నుంచే రాస్తున్నానండీ.... ఇక్కడ రేపులుచేసేవాళ్ళు ఘనమైన సంస్కృతికలిగిన ఇండియనులూ, పాకీలూ, అఫ్ఘనులూ. సిరియనులూ, అరబ్బులూ మాత్రమే.

thinker said...

తాడుకి బొంగరానికి ముడి పెట్టినంత సేపు నిజం ఇతిమిత్థంగా తేలదు

thinker said...

నెలవంక గారు శ్రీ రెడ్డి గారి తరపున సంధ్య గారి తరపున పుచ్చుకున్న వకల్తా క్లియర్ గా తెలిసిపోతోంది, ఒక వేల అభీష్టమే అదైతే మీరు సఫలీకృతులయ్యారు, ఒక వేళ కాకపోతే కొంచెం బ్యాలన్సుడు గా రాయండి

నీహారిక said...

అప్పు చేయడం,ఇంటికి కన్నం వేయడం కూడా ఒకటే అని నా నిశ్చితాభిప్రాయం.నీరవ్ మోదీ, మాల్యా లను చూడలేదా ?
రాబోయే రోజుల్లో జియో తో వచ్చిన నష్టాలను రిలయన్స్ లో చూపించి కుచ్చు టోపీ పెట్టినా ఆశ్చర్యం లేదు.

మీ దృష్టి కోణం కూడా అలాగే ఉంది.భర్త ఒప్పుకుంటే వ్యభిచారం కాదు అని అంటున్నారు కదా ?

SURYAA said...

dear sir very good blog and very good content
Tollywood Cinema News

ketan said...

నీహారిక... ఒకటి గమనించారా? మీతో చర్చ ఎప్పుడూ converge అవ్వదు. నేను మీతో చర్చని ఇంకో నాలుగురోజులు కొనసాగించాననుకోండి, అప్పుడు మీరు గ్రహాంతరవాసుల్నీ, చెక్ దేశపు గనిపనిమనిషినీకూడా ఇందులోకి పట్టుకొచ్చేస్తారు. Classic case of ADHD అండీ.

నీహారిక said...

యుద్ధంలో గెలిస్తే శూరుడూ,వీరుడూ అంటారు.యుద్ధాన్నే నివారిస్తే దేవుడంటారంటా....మీరు దేవుడు సామీ !

Post a Comment