Pages

Friday, February 26, 2016

నా పేరు ఉమర్‌ ఖాలిద్‌ నిజమే కానీ నేను టెర్రరిస్టును కాను..!!


ప్రపంచంలో ఎన్నో దేశాల చరిత్రను చదువుకున్నాం. అనేక ఉద్యమాలను వాటి కారణాలను, వాటి పర్యవసానాలను, అంతిమ ఫలితాలను కూడా కొద్దో గొప్పో తెలుసుకున్నాం కానీ చదువుతున్న విద్యార్థులపై దేశద్రోహం ఆరోపణలు మోపి ప్రపంచ వ్యాప్తంగా అభాసు పాలవుతున్న వ్యవస్థను గురించి ఇప్పుడే తెలుసుకుంటున్నాం. 

కానీ లక్షల కోట్లు దిగమింగినవాళ్లు, ఆలా దిగమింగుతున్న వాళ్లకే గత 68 ఏళ్లుగా అడిగినా అడగకున్నా దేశ సంపదలను రుణాల రూపంలో అంటగడుతున్నవారు, మంచుగడ్డల్లో అంగుళంగుళం కాపలా కాస్తున్న సైనికులకు అత్యవసరమైన ప్రాణరక్షక సామగ్రిని సైతం కల్తీ చేసి కమీషన్లను కొల్లగొట్టినవారు.. దేవుళ్ల పేరు చెప్పి పంచలోహ విగ్రహాలను దేశదేశాల్లో అమ్ముకుంటున్న వారు. కొల్లగొట్టిన అక్రమార్జనను నల్లధనంగా మార్చి ఖండాతరాలకు తరలించి దేశ మూలుగులనే పీల్చేసినవారు.., 2014 తర్వాత కూడా ఇలాంటి నల్లధన బకాసురుల కొమ్ము కాస్తున్నవారు...  స్ట్రింగ్ ఆపరేషన్‌తో బెదిరింపులకు దిగి ఒకే ఒక్క కంపెనీ యజమానితోటే వందకోట్లకు బేరసారాలకు దిగి, అదే రివర్స్ స్ట్రింగ్‌కు అడ్డంగా దొరికిపోయి ధర్మపన్నాలు, శోకన్నాలు పెట్టి, ఇప్పుడు ఎవరు దేశద్రోహో తేల్చిపడేస్తున్న మీడియా ముష్కరులు.., ఖనిజ సంపదల తోడివేత పేరుతో ఆదివాసులు అడవులనుంచి తరిమివేసే మహాకుట్రకు పథకరచన చేసినవారు...  వీరెవరూ దేశద్రోహులు కారట. ఈ రకం దేశద్రోహాలు దేశభక్తిపరులకు ఎవరికీ కనిపించవు.

ఒక్కటిమాత్రం నిజం..  కొండను ఢీకొన్న పొట్టేళ్ల గురించి చిన్నప్పుడు చాలా కథలు చదువుకున్నాం కానీ కొండ తనంతట తాను నేరుగా వెళ్లి.. ఆవేశాన్ని, యవ్వనోద్రేకాన్ని నినాదాల రూపంలో, కవిత్వ రూపంలో వ్యక్తీకరించే విద్యార్థులతో ఢీకొంటున్న కథను ఇప్పుడు మాత్రమే వింటున్నాం. కొండ పగపట్టింది. తన స్థాయికి సరిజోదు అయిన మరో కొండతో కాదు. నినాదాలు, చర్చలు తప్ప మరే ప్రత్యక్ష ఆచరణలోనూ పాలు పంచుకోని అర్భక విద్యార్థులపై పగబట్టింది. అలాంటివాళ్లలో రోహిత్ ఒకరైతే... కన్హయ్య, ఉమర్ తదితరులు మరొకరు.

నాకు తెలిసినంత మేరకు బ్రిటిష్ ప్రభుత్వం తనపై యుద్ధాన్ని ప్రకటించడమే కాకుండా ఆచరణలోనే చూపించి తిరగబడిన నూనూగు మీసాలు రాని ఈ దేశ యువకులను వెంటాడి చంపింది. ఉరికొయ్యలపై వేలాడదీసింది. దేశ భక్తి గురించి ఎవరూ ఎవరికీ పాఠాలు చెప్పకున్నా.. దేశాన్ని పరాయి పాలన నుంచి, దాస్యం నుంచి పారదోలాలనే ధర్మాగ్రహంతో తిరగబడిన ఆ మాన్య యువకులు రక్తం పొంగే దివ్యస్మృతులతో ఈ దేశ యువతరానికి, మనకు కూడా నేటికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. కానీ ఇదేమిటి? ఏ సాయుధ పోరాటంతో సంబంధం లేని రోహిత్, కన్హయ్య, తన ముస్లిం మూలాలను కూడా చేరిపేసుకుని తనది పీడిత ప్రజల పక్షమని ప్రకటించిన ఉమర్ ఖాలిద్ తదితరులు తమ ఆలోచనలను నినాదాల రూపంలో వ్యక్తీకరించినందుకే దేశ ద్రోహులైపోతారా?

ఇక్కడ ఒక దేశద్రోహి తాను ఎలాంటి దేశద్రోహో, ఎలాంటి దేశద్రోహి కాడో కూడా వివరిస్తున్నాడు. 'మిత్రులారా నాపేరు ఉమర్ ఖాలిద్‌. నిజమే. కానీ నేను టెర్రరిస్టును కాదు' అంటూ జేఎన్‌యూ విద్యార్థుల సాక్షిగా తన స్వీయ నివేదనను ఈ దేశం ముందు విప్పి చెప్పాడు.

"గత ఏడేండ్లుగా నేనీ క్యాంపస్‌ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నాను. కానీ ఇన్నేండ్లలో నన్ను నేను ఎప్పుడూ ఒక 'ముస్లిం'గా భావించలేదు. నన్ను నేను ఎప్పుడూ ఒక ముస్లింగా ప్రదర్శించుకోలేదు. ఎందుకంటే పీడన కేవలం ముస్లింల పైననే జరగడం లేదు. సమాజంలోని వివిధ పీడిత సెక్షన్లన్నీ బాధిత సమూహాలే. ఆదివాసులపై, దళితులపై పీడన కొనసాగుతోంది. మా లాంటి బాధిత సమూహాల నుంచి వచ్చే వాళ్లం మా తక్షణ గుర్తింపుల పరిధి లోంచి బైటికి వచ్చి సమస్యలను సమగ్ర దృష్టితో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ గత ఏడేండ్లలో నాకు మొదటిసారిగా గత పది రోజుల్లోనే నేను ముస్లింనని తోచింది. రోహిత్‌ వేముల మాటల్లో చెప్పాలంటే, నన్ను నా తక్షణ గుర్తింపుకు కుదించి వేశారు. ఇది చాలా సిగ్గు చేటైన విషయం" అంటూ ఈ దేశం ముందు తన స్వభావం గురించి విప్పి చెప్పుకుంటున్నాడు.

ఇది నవతెలంగాణ వంటి పత్రికలలో, కొన్ని వెబ్‍‌సైట్లలో నిన్ననే అచ్చయిన ఖాలిద్ పూర్తి ప్రసంగ పాఠం. ఇవ్వాళే నాకు మీడియా మిత్రుల ద్వారా అందింది. మనమంతా ఇప్పటికే ఇతడు దేశద్రోహి అని  దృఢంగా ఒక అభిప్రాయానికి వచ్చేశాం కదా. కానీ ఉరి తీసేముందు కూడా ఆ శిక్షకు గురైన వాదనను వినే దొడ్డదేశం మనది కాబట్టి ఇప్పుడు కాస్త ఓపిక, సహనం తెచ్చుకుని ఉమర్ ఖాలిద్ అనే ఈ 'దేశద్రోహి' మాటలను కూడా  కాస్త ఆలకిద్దాం.

'దేశద్రోహి' మాటలు విన్నంతమాత్రాన, చదివినంత మాత్రాన మనం పాకిస్తాన్ మద్దతుదారులుగా, జిహాదీలుగా, ఉగ్రవాదులుగా, దేశద్రోహులుగా మారిపోమనే నేను విశ్వసిస్తున్నా.


(జేఎన్‌యూ వివాదంలో ఉమర్‌ ఖాలిద్‌ గురించి చాలా చర్చ జరిగింది. మీడియాలో ఒక వర్గం అతణ్ని 'టెర్రిరిస్టు'గా చిత్రించడానికి తప్పుడు ఆరోపణలెన్నో చేసింది. 'సంఘ్' భక్తులు అతని కుటుంబాన్ని చాలా దుర్మార్గంగా వేధించారు. పోలీసులు అతని కోసం దేశవ్యాప్తంగా 'వేట' ప్రారంభించామని చెప్పారు. కానీ ఖాలిద్‌ అతని అనుచరులతో పాటు సోమవారం తెల్లవారు జామున జేఎన్‌యూ విద్యార్థుల ముందు ప్రత్యక్షమై ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నింటికీ తనదైన శైలిలో జవాబిచ్చారు. ఇది ఆ ప్రసంగం పూర్తి పాఠం.)

My name is Umar Khalid and I am not a terrorist

మిత్రులారా! నా పేరు ఉమర్‌ ఖాలిద్‌ నిజమే కానీ నేను టెర్రిరిస్టును కాను. మొట్టమొదటగా, ఈ ఉద్యమంలో దృఢంగా నిలబడ్డ విద్యార్థులకు, అధ్యాపకులకు నా అభినందనలు. ఈ పోరాటం కేవలం ఐదారుగురు వ్యక్తుల కోసం సాగుతున్నది కాదనేది మనకు తెలుసు. ఇది మనందరి పోరాటం. ఇది ఈ విశ్వవిద్యాలయం పోరాటం. దేశంలోని విశ్వవిద్యాలయాలన్నింటి పోరాటం. ఇది మన సమాజ మార్పునకు సంబంధించిన పోరాటం.

గత పది రోజుల్లో నా గురించి నాకే తెలియని చాలా విషయాలు తెలిశాయి. నేను రెండు సార్లు పాకిస్తాన్‌కు వెళ్లొచ్చానట! నా దగ్గర పాస్‌పోర్టే లేదు కానీ రెండు సార్లు వెళ్లానట! ఈ ఆరోపణ బెడిసికొట్టడంతో మరొకటి పుట్టించారు. నేను 'మాస్టర్‌ మైండ్‌'నట! జేఎన్‌యూ విద్యార్థులందరికీ అద్భుతమైన 'మైండ్‌' ఉంటుందనేది నిజమే కానీ ఈ మొత్తం కార్యక్రమానికి పథకం రచించిన 'మాస్టర్‌ మైండ్‌'గా నన్ను చిత్రించారు! అంతేకాదు, నేను ఈ ప్రోగ్రాంను 17-18 విశ్వవిద్యాలయాల్లో నిర్వహించాలని ప్లాన్‌ చేసినట్టుగా కూడా చెప్పారు. నా ప్రభావం ఇంత విస్తృతంగా ఉందని నాకే తెలియదు! నేను గత 2-3 నెలలుగా ఆ సమావేశం కోసం పథకం రూపొందించానని వారు చెప్పారు. ఇది కూడా కౌంటర్‌ కావడంతో, నేను గత కొద్ది రోజులలో 800 ఫోన్‌కాల్స్‌ చేశానని అన్నారు.. 

ఏ సాక్ష్యం అవసరం లేదు మీడియాకు! 'ఎలెజెడ్లీ' (కథనం) అని చెప్పాల్సిన అవసరం కూడా లేదిప్పుడు! ఎక్కడెక్కడికి కాల్స్‌ చేశానట గల్ఫ్‌కు చేశానట! కాశ్మీర్‌కు చేశానట! మరి సాక్ష్యం తీసుకురావచ్చుగా! ఫోన్‌ చేసినంత మాత్రాన నేరం కాదనేది మొదటి విషయం. ఒకవేళ చేసినా దానికి సాక్ష్యాలైతే ఉండాలి కదా! వీళ్లకు ఇంతలా అబద్ధాలాడేందుకు సిగ్గుగా కూడా అనిపించడం లేదు. జరిగినదంతా 'మీడియా ట్రయలే'. మన నేరాల చిట్టా (ప్రొఫైలింగ్‌) కూడా తయారు చేసింది. ఆఖరుకు ఐబీ, ప్రభుత్వం సైతం జైషేమహ్మద్‌తో వీళ్లకు సంబంధాలు లేవని చెప్పినా, మీడియా మాత్రం క్షమాపణ చెప్పడం గానీ, డిస్‌క్లెయిమర్‌ గానీ ఏదీ ఉండదు.

మొదట ఇవన్నీ వింటుంటే నవ్వొచ్చింది. ఇన్ని అబద్ధాలతో, ఇన్ని ఆరోపణలు ప్రచారంలో పెట్టి తప్పుకోవచ్చని మీడియా వాళ్లు అనుకుంటున్నారేమో కానీ అలా జరగదు. వ్యక్తిగతంగా నేనెప్పుడూ భయపడలేదు. ఎందుకంటే నాకు తెలుసు. మీరంతా వేల సంఖ్యలో నాకు మద్దతుగా నిలబడతారని. కానీ నేను నా చెల్లెండ్ల ప్రకటనలు, మా తండ్రి ప్రకటన చూశాక ఆందోళన చెందాను. నా చెల్లెండ్లను రేప్‌ చేస్తామని, యాసిడ్‌ దాడి చేస్తామని సోషల్‌ మీడియాలో బెదిరింపులు రావడంతో ఆందోళన కలిగింది. నాకప్పుడు కంధమాల్‌ (ఒడిషా) గుర్తుకొచ్చింది. క్రైస్తవ సన్యాసినిపై బజరంగ్‌దళ్‌ గూండాలు సామూహిక అత్యాచారం జరిపినప్పుడు 'భారత్‌ మాతాకీ జై' అంటూ నినాదాలు చేశారు. ఫిబ్రవరి 11న కామ్రేడ్‌ కన్నయ్య అన్నట్టుగా, 'ఇదే మీ భారత్‌ మాత అయితే మాకీ భారత్‌ మాత వద్దు'. దీనికి మేం సిగ్గుపడం కూడా!

మా తండ్రిని టీవీ స్టూడియోల్లో ప్రశ్నలతో వేధించారు. ఎక్కడెక్కడి వివరాలో తవ్వి తీసి వాటిని దీనితో జోడించే ప్రయత్నం చేశారు. జీ న్యూస్‌, టైమ్స్‌ నౌ (దాన్ని నడిపిస్తున్న వ్యక్తి పేరు నేను చెప్పదల్చుకోలేదు) వంటి చానెళ్లకు ఇంత ద్వేషం, ఇంత కోపం ఎక్కడి నుంచి వస్తోంది ఇంత ద్వేషాన్ని ఎలా పెంచుకోగలుగుతారో అర్థం కావడం లేదు.

గత ఏడేండ్లుగా ఈ నేనీ క్యాంపస్‌ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నాను. కానీ ఇన్నేండ్లలో నన్ను నేను ఎప్పుడూ ఒక 'ముస్లిం'గా భావించలేదు. నన్ను నేను ఎప్పుడూ ఒక ముస్లింగా ప్రదర్శించుకోలేదు. ఎందుకంటే పీడన కేవలం ముస్లింల పైననే జరగడం లేదు. సమాజంలోని వివిధ పీడిత సెక్షన్లన్నీ బాధిత సమూహాలే. ఆదివాసులపై, దళితులపై పీడన కొనసాగుతోంది. మా లాంటి బాధిత సమూహాల నుంచి వచ్చే వాళ్లం మా తక్షణ గుర్తింపుల పరిధి లోంచి బైటికి వచ్చి సమస్యలను సమగ్ర దృష్టితో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ గత ఏడేండ్లలో నాకు మొదటిసారిగా గత పది రోజుల్లోనే నేను ముస్లింనని తోచింది. రోహిత్‌ వేముల మాటల్లో చెప్పాలంటే, నన్ను నా తక్షణ గుర్తింపుకు కుదించి వేశారు. ఇది చాలా సిగ్గు చేటైన విషయం.

వీళ్లు నన్ను పాకిస్తాన్‌ ఏజెంట్‌ అంటున్నారు. నేను పాకిస్తాన్‌కు చెందిన ఒక కవి రాసిన రెండు మాటలు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. 'అరే భాయి! హిందూస్తాన్‌ నాదే... పాకిస్తాన్‌ నాదే.. కానీ ఈ రెండింటిపైనా ఉన్నది అమెరికా పెత్తనమే. ఆ అమెరికాకు మీరు దళారులు!' మీ ప్రభుత్వానికి దళారీతనం తప్ప మరొకటి రానే రాదు. మీరే అమెరికా పాదాలు నాకుతున్నారు. ఈ దేశ సంపదలను, వనరులను అమెరికాకు దోచిపెడుతున్నారు. పెద్ద పెద్ద ఎంఎన్‌సీలు ఇక్కడి శ్రమశక్తిని దోచుకుంటున్నాయి. విద్యారంగాన్ని కూడా తాకట్టు పెట్టింది. డబ్ల్యూటీవోలో ప్రభుత్వం ఎలా మోకరిల్లిందో మనం చూశాం. వీళ్లు మాకు దేశభక్తి గురించి చెబుతున్నారు! నా తోటి దేశద్రోహులారా! 'ప్రపంచ దేశద్రోహులారా, ఏకం కండి' అని అనాలిప్పుడు. మేం ప్రజలను ప్రేమిస్తాం. మా పోరాటానికి హద్దులు, సరిహద్దులు లేవు. ప్రపంచవ్యాప్తంగా మనమంతా ఏకమవుతాం. ప్రజలను పీడించే ఏ దేశ ప్రభుత్వానికైనా వ్యతిరేకంగా ఏకమవుతాం.

ఈ తరహా హేయమైన ఎత్తుగడలతో వాళ్లు మనల్ని భయపెట్టలేరు. వాళ్లు మన నోళ్లను మూయించలేరు. మిత్రులారా! మనం వీళ్లకు భయపడాల్సిన అవసరం లేదని మీకు చెప్పాల్సిన పనే లేదు. వీళ్లకు మెజారిటీ ఉండొచ్చు. వీళ్లకు చాలా సీట్లు ఉండొచ్చు. వీళ్ల దగ్గర బలమైన మీడియా ఉండొచ్చు. రాజ్య యంత్రానికి సంబంధించిన చాలా విభాగాలు, పోలీసులు వగైరా ఉండొచ్చు. అయినా వీళ్లు భయపడతున్నారు. మన పోరాటాలకు భయపడుతున్నారు. మనం ఆలోచిస్తున్నందుకు వాళ్లు భయపడుతున్నారు. నా సహచరుడు అనిర్బాన్‌ ఫిబ్రవరి 10న ఒక మాట చెప్పాడు. దేశద్రోహి కావడం చాలా సులువని. ఆలోచించడం మొదలు పెడితే చాలు వెంటనే దేశద్రోహి అయిపోతారు. కాబట్టి మీరు మమ్మల్ని భయపెట్టగలమని అనుకుంటే మీరు చాలా పెద్ద భ్రమలో ఉన్నట్టే. ముందే చెప్పినట్టుగా, మీరీ విశ్వవిద్యాలయంతో తలపడి పొరపాటు చేశారు. చాలా విశ్వవిద్యాలయాలతో ఇదివరకే మీరు తలపడ్డారు. ఎఫ్‌టిఐఐలో జరిగింది గానీ, హెచ్‌సీయూలో రోహిత్‌ వేముల హత్య జరిగిన తీరు గానీ, బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో సందీప్‌ పాండేకు జరిగింది గానీ... ఈ అన్ని పోరాటాలతో మేం భుజం భుజం కలిపి నడిచాం. ప్రతి పోరాటాన్ని మేం ఇక్కడ వీధుల్లోకి తీసుకెళ్లాం. ఇది మా బాధ్యతని మేం భావిస్తాం.

అయితే మీకు జేఎన్‌యూనే పెద్ద అడ్డంకిగా ఉంది కాబట్టి దీనినే అణచివేస్తామని అనుకుంటే మీకు చెప్పేదొకటే. ఈ తరహా విఫల ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి. బహుశా మీరు మర్చిపోవచ్చు గానీ ఎమర్జెన్సీ తర్వాత ఇందిరా గాంధీ ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తే ఆమెను అడ్డుకున్నారు. మునుపటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇక్కడికి వచ్చినప్పుడు యూపీఏ దేశాన్ని తాకట్టు పెడుతున్న విధానాలను వ్యతిరేకిస్తూ అతనికి నల్ల జెండా చూపించాం. చిదంబరం ఇక్కడికి వచ్చినప్పుడు, తనకు ఘన స్వాగతం లభిస్తుందని ఆశించి ఆశాభంగం పొందిన విషయం గుర్తుండాలి. విద్యార్థులు తాము ఈ దేశ పీడిత ప్రజల వైపున్నామని చిదంబరంకు తెలియజెప్పారు. కాబట్టి ఇలాంటి తాటాకు చప్పుళ్లతో బెదిరిపోయే కుందేళ్లం కాదు మేం. ఇవి కేవలం మైండ్‌గేమ్స్‌ మాత్రమే! మనం భయపడతామా లేదా అని వాళ్లు పరీక్ష పెడుతున్నారు. కానీ మనం భయపడమని చాటి చెబుదాం. సవాలును స్వీకరిద్దాం. ప్రతి రంగంలోనూ ఎదురు నిలిచి పోరాడుదాం. ప్రతి అంశంపైనా, క్యాంపస్‌లోని ప్రతి విద్యార్థికీ ఎలాంటి జంకు లేకుండా తన అభిప్రాయాన్ని చర్చించే హక్కుంది.

వీళ్లకో విద్యార్థి విభాగం ఉంది - ఏబీవీపీ. ఇది ఈ క్యాంపస్‌లో వాళ్ల వానర సేన. ఏ అంశం వచ్చినా వీళ్లు అల్లరి మూకలా వ్యవహరిస్తారు. పోలీసులు, క్యాంపస్‌ అడ్మినిస్ట్రేషన్‌, మంత్రులు అందరూ వీళ్లకు అండగా ఉంటారు. రోహిత్‌ను ఇట్లాగే అందరూ కుమ్మక్కై చంపేశారు. కానీ ఇక్కడ ఎవ్వరూ మరో రోహిత్‌ కాబోరని నేను ప్రకటిస్తున్నాను. ఈ క్యాంపస్‌ విలువేమిటో మనకు తెలుసు. దీన్ని మనమే తీర్చిదిద్దుకున్నాం. దీన్ని నాశనం చేయాలనే వీళ్ల ప్రయత్నాలను ఓడిద్దాం. ఇందులో ఒక్క అంగుళం స్థలం కూడా వారికి వదిలెయ్యం. ఏబీవీపీకి అసలు ప్రజల్లో బలం లేదు. ప్రజలను సమీకరించలేరు వీళ్లు. కేవలం ప్రభుత్వ యంత్రాంగాన్ని తోడుగా తెచ్చుకుంటారు. ఈ పది రోజుల్లో ఇంత మీడియా ప్రచారం, ఇన్ని మీడియా ట్రయల్స్‌, దేశభక్తి పేరుతో రెచ్చగొట్టే ప్రకటనలు ఇన్ని జరిగినా వీళ్ల కార్యక్రమాలకు హాజరవుతున్నది కేవలం వేళ్ల మీద లెక్కించేంత మందే. ఇక్కడ మనం 15 వేల మంది దాకా సమీకరించగలిగాం. 

విద్యార్థి ఉద్యమంలో మనం నేర్చుకున్నది ఏమిటంటే, 'అసమ్మతిని అనుమతించని విశ్వవిద్యాలయం జైలుగా మారిపోతుంది'. వారి అజెండా స్పష్టమే! విశ్వవిద్యాలయాలను జైళ్లుగా మార్చాలనేదే వాళ్ల లక్ష్యం. దీన్ని మనం ఓడించాలి. ఐక్యంగా ఉండాలి. చీలి పోవద్దు. మనలో మనకు విభేదాలున్నాయని మనకు తెలుసు. అయితే వాటిని ఎలా చర్చించుకోవాలో కూడా మనకు తెలుసు. చివరగా, గత పదిరోజుల్లో ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా లెక్క లేనన్ని దాడులు జరిగాయి. హౌండా కార్మికులపై దాడి జరిగింది. జగ్దల్‌పూర్‌ (ఛత్తీస్‌గఢ్‌)లో లీగల్‌ ఎయిడ్‌ గ్రూపుపై దాడి జరిగింది. సోని సోరిపై దాడి జరిగింది. ఈ పోరాటాలన్నింటికీ సంఘీభావం తెలపాలి. ఈ పోరాటాలతో అనుసంధానం చేసుకోవాలి. ఎక్కడ, ఏ అన్యాయం జరిగినా వారికి అండగా నిలబడే జేఎన్‌యూ సంప్రదాయాన్ని సజీవంగా నిలుపుకోవాలి. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌!

మీరు దేశ ప్రజలకు వ్యతిరేకంగా... ఆదివాసులైతే వారిపై మావోయిస్టులనే ముద్రవేయడం ద్వారా, ముస్లింలైతే టెర్రరిస్టులుగా ముద్ర వేయడం ద్వారా సాగిస్తున్న విచారణలు ఎన్నో ఉన్నాయి. చాలా మంది నిస్సహాయులు కాబట్టి ఇలాగే సాగిపోతోంది. కానీ మీరిప్పుడు పప్పులో కాలేశారు. జేఎన్‌యూ విద్యార్థులు దీనికి సరైన జవాబు చెబుతారు. ఇలా తప్పుడు రిపోర్టింగ్‌ చేసిన ఒక్కొక్క మీడియా చానెల్‌ ఇందుకు బాధ్యత వహించక తప్పదు....

My name is Umar Khalid, I’m not a terrorist: JNU prodigal returns and how


https://www.youtube.com/watch?v=RBfXNleLApw

(Full speech of Umar Khalid)

ఈ టపా పోస్ట్ చేసిన తర్వాత పై యూట్యూబ్ లింకులో ఖాలిద్ వీడియో ప్రసంగాన్ని విన్నా. ఈ దేశంలో 'దేశభక్తి'పరులంతా మూకుమ్మడిగా ద్వేషిస్తున్న, ఆరోపిస్తున్న ఈ దేశద్రోహి జేఎన్ యూలో మాట్లాడుతున్న ప్రతి మాట, ప్రతి పదం, ప్రతి వ్యక్తీకరణకు అక్కడ హాజరైన విద్యార్ధినీ విద్యార్థులు హర్షద్వానాలతో స్వాగతించారు. తనను దేశద్రోహిగా  ఆరోపిస్తూ ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యనూ, ప్రతి నేరారోపణను ఖండఖండాలుగా చీల్చివేస్తూ ఖాలిద్ చేసిన ప్రసంగం వారిని నవ్వించింది. జేఎన్ యూ నవ్వింది. ఈ దేశ దౌర్భాగ్యాన్ని చూసి నవ్వింది.  

ఆ రాత్రి గడిస్తే చాలు తనను దేశద్రోహ ఆరోపణలపై అరెస్టు చేస్తారని లేదా తానే సరెండర్ కావాల్సి ఉంటుందని ఖాలిద్ కు తెలుసు. కానీ ఒక్క క్షణం కూడా ఖాలిద్ భయపడుతున్నట్లుగానీ, రేపటి తర్వాత తన పరిస్తితి ఏమవుతుందని కానీ కించిత్ ఆందోళన ఈ వీడియోలో కనిపించలేదు. అన్నిరంగాల్లోను అన్యాయంపై పోరాడతామని, అందరితో ఐక్యమవుతామని, విభేదిస్తున్నవారితో కూడా చర్చలు ఎలా జరపాలో తమకు తెలుసుని ఖాలిద్ స్థిరమైన స్వరంతో చెబుతుంటే వింటున్న వారిలో విద్యుత్తేజం. 

యూనివర్శిటీ అసమ్మతిని అనుమతించకపోతే అలాంటి యూనివర్సిటీ జైలుగా మారిపోతుంది అంటూ జేఎన్ యు పునాదిని గుర్తు చేసిన ఖాలిద్  మన ప్రజాస్వామ్య ఉనికిని, పునాదిని, రాజ్య అహంకారాన్ని, నినాదాల్లో, జెండాల్లో దేశద్రోహాన్ని చూస్తున్న వ్యవస్థ దుస్థితిని అపహాస్యం చేస్తున్నాడు. 

మన ముసుగులన్నింటినీ పక్కనబెట్టి చూస్తే... మొన్న కన్హయ్య కానీ, నిన్న ఖాలిద్ కానీ చేసిన ప్రసంగాలు ప్రపంచ విద్యార్థి ఉద్యమాల చరిత్రలో ధిక్కారానికి, న్యాయాన్వేషణకు అచ్చమైన ప్రతిబింబాలుగా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేం వర్సిటీ విద్యార్థులుగా ఉన్న కాలంలో అంటే 35 ఏళ్ల క్రితం ఇలాంటి నినాదాలెన్నో చేశాం. ఆనాడు మా దృష్టికి వచ్చిన ప్రతి అన్యాయంపైనా గళమెత్తాం. గోడలన్నీి నినాదాలతో ముంచెత్తాం. ఎన్నోసార్లు అరెస్ట్యయ్యాం. జైలుకెళ్లాం కానీ ఎన్నడూ ఏ ప్రభుత్వమూ మా నినాదాలకు కానీ, గోడరాతలకు కానీ, ప్రసంగాలకు కానీ మమ్మల్ని దేశద్రోహులుగా ఆరోపించలేదు. 

కానీ ఇదేంటి? కొన్ని నినాదాలు చేసినంత మాత్రానికే దేశద్రోహ ఆరోపణా? 

నాకు ఒకటే ప్రశ్న కేంద్రప్రభుత్వం బలంగా ఉందా, బలహీనంగా ఉందా? నినాదాలకే కదలిపోయేంత బలహీనంగా ఉందా? 

వంద దేశద్రోహాలు మోపినా అన్యాయాన్ని ఎదిరించడంలో ఒక్క అంగుళం కూడా వెనుకంజ వేయం  అంటున్నారు వీళ్లు. ఇలాంటివారిని ఏ ప్రభుత్వాలైనా ఏం చేయగలవు?

కానీ.. విద్యార్థులపై కుట్రకేసులు, దేశద్రోహ ఆరోపణలు మరీ ఇంత అన్యాయంగా, ఇన్ని అబద్దాలతో, వక్రీకరణలతో మోపితే ఇవి నిలబడతాయా లేదా అనేది తర్వాతి విషయం కానీ ప్రపంచ వ్యాప్తంగా విద్యాకేంద్రాలు, మేధో బృందాలు భారతదేశంలో ఇప్పుడు నడుస్తున్న దేశద్రోహ ప్రహసనాన్ని చూసి అపహాస్యం చేస్తున్నాయి. 

ఈ కుట్రకేసులూ, దేశద్రోహ అరోపణలు అంతిమంగా నిలచేవి కావు. బూర్జువా న్యాయ స్థానాల్లో కూడా నిలబడనంత బలహీన కేసులు, ఆరోపణలు ఇవి. 

ఇంతకూ మన రాజ్యవ్యవస్థ ఏం సాధించదలిచినట్లు. ఏ ఎజెండా లక్ష్యంతో పనిచేస్తున్నట్లు?

ఇప్పుడే నేను చూసిన వార్త

Confusing national interest with nationalism helps India's enemies

ప్రభుత్వానికి వ్యతిరేరంగా హింసను ప్రేరేపించేవారు, ప్రభుత్వాన్ని కూలదోయాలని పిలుపునిచ్చేవారిపై దేశద్రోహ చట్టాన్ని ఉపయోగించండి కానీ నినాదాలు చేసే విద్యార్థుల మీద కాదని ఈ లింకులోని వ్యాసం చెబుతోంది. పైగా అలాంటిది వ్యతిరేక ఫలితాలనే తీసుకువస్తుందని, జేఎన్ యూలో కేంద్రం ఇక్కడే తప్పటడుగు చేసిందని ఈ వ్యాసం తెలుపుతోంది. పైగా జాతీయవాదాన్ని పౌరులపై బలవంతంగా రుద్దరాదని, అది స్వచ్చంద వ్యవహారమని చెబుతోంది.

అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే వాడాల్సిన దేశద్రోహ లేదా రాజద్రోహ కేసును విద్యార్థులపై విచక్షణా రహితంగా ప్రయోగించిన క్షణంలోనే ప్రభుత్వానికి భంగపాటు జరిగిపోయింది. ఇక కోర్టుల్లో దాని ముగింపు మాత్రమే మిగిలివుంది. 


26 comments:

Anonymous said...

ముస్లిం మైనారిటి కార్డ్ ను కోట్లు సంపాదించుకొన్న అజారుద్దిన్ నుంచి ఉమర్ వరకు ఉపయోగించుకొంట్టున్నారు. అదే అర్రెస్త్ అయిన కన్నయ ఎక్కడ మత కార్డ్ ను ఉపయోగించు కోలేదు. ఇది చాలు ముస్లిం ఎవరు మత రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు గ్రహించటానికి

Anonymous said...

రాజశేఖర్ మీ వీరావేశం తగ్గించండి. హై సౌండేడ్ పదాలు వాడటం తగ్గించండి. వీళ్ల ఉపన్యాసాలు పక్క దేశం వాళ్లు పట్టించుకోరు కాని మీరు "ప్రపంచ విద్యార్థి ఉద్యమాల చరిత్రలో " రాగాలు పోతున్నారు.

Anonymous said...

ఇంతకూ మన రాజ్యవ్యవస్థ ఏం సాధించదలిచినట్లు. ఏ ఎజెండా లక్ష్యంతో పనిచేస్తున్నట్లు?


మన రాజ్య వ్యవస్థ సంగతి కొద్దిసేపు పక్కన పెడదాము. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల రాజ్య వ్యవస్థలు ఎమి సాధిస్తున్నాయి? ఒక్కొక్క దేశానికి ఒక ఎజెండా లక్ష్యం ఉందిగదా. మీరు చెప్పండి.

Anonymous said...

ఇదీ ఉగ్రవాద నైజం!

http://www.andhrajyothy.com/Artical?SID=211109

పామ్‌పోర్‌ సంఘటన, జేఎన్‌యూలో ఇటీవల సంభవించిన ఘటనలకు భిన్నమైనదేనా? జేఎన్‌యూలో సంభవించిన సంఘటన మొదటి ఘట్టం - ఉగ్రవాదులను ‘హీరో’లుగా కొనియాడడం. పామ్‌పోర్‌లో సైనిక దాడి రెండో ఘట్టం- తమ ‘హీరో’లను కాపాడడానికి మూకలు ఉద్దేశపూర్వకంగా, ప్రాణాలకు తెగించి గుమిగూడడం-ను దృష్టాంతీకరించాయి. ఇక మూడవ, తుది చర్య- నిజమైన విశ్వాసులలో కొంతమంది తమ ‘హీరో’లను స్ఫూర్తిగా తీసుకొని ఉగ్రవాదులు లేదా ఆత్మాహుతి దళ సభ్యులుగా అంతమొందడం! ఇది ప్రపంచంలో ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో సంభవిస్తూనే వుంటుంది.



సామాన్య ప్రజలను హంతకులుగా మార్చేందుకు ఉగ్రవాద హింసాకాండ సూత్రధారులు, ఉపయోగించే వివిధ చిట్కాలలో ఇది ఒకటి సుమా! ఒక క్రమపద్ధతిలో అమలుపరిచే ఈ ప్రక్రియ జిహాదీ మనస్తత్వాన్ని వెల్లడిస్తుంది. వర్గ పోరాటం లేదా మతం లేదా రెండిటినీ ప్రజలను ప్రభావితం చేయడానికి ఉపయోగించుకోవడం జరుగుతోంది. భావ ప్రకటనా స్వేచ్ఛను, ఆ ఉత్తమ విలువను నిర్మూలించే మనస్తత్వాన్ని పెంపొందించడానికి ఉపయోగించుకొంటున్నారు. ఇస్లామిక్‌ సమాజం గానీ, కమ్యూనిస్టు వ్యవస్థగానీ తమ పౌరులకు భావ ప్రకటనా స్వేచ్ఛను అంగీకరించవు గదా.

Anonymous said...

Pitched battle over 'people's war' at JNU

The NSUI national general secretary, Shaikh Shahnawaz, recalled: "Members of Democratic Students Union (DSU) and All India Students Association (AISA) organized a meeting to celebrate the killing of 76 CRPF personnel in Chhattisgarh. They were even shouting slogans like 'India murdabad, Maovad zindabad'. How can this be allowed inside a Central university?"


http://timesofindia.indiatimes.com/india/Pitched-battle-over-peoples-war-at-JNU/articleshow/5783093.cms

kanthisena said...

ఈ టపాలో కానీ, నా గత టపాల్లో కానీ వ్యాఖ్యలు చేస్తున్న 'అజ్ఞాత' మిత్రులు ఈ టపాలకు సంబంధంలేని అంశాలపై వ్యాఖ్యలు పంపుతున్నారు. అభిప్రాయాలు చెప్పేహక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నట్లే రాసిన సందర్భానికి మాత్రమే పరిమితమైతే కూడా బాగుంటుందనుకుంటున్నాను. దేశభక్తిపై ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. వాటిని ఇక్కడ యుద్ధం ద్వారా పరిష్కరించుకోవడం అసాధ్యం.

పైగా ఈ అజ్ఞాత వ్యాఖ్యలు ఏంటో నాకు ఏమాత్రం అర్థం కావటం లేదు. ఒక రకం దేశభక్తి పరులకు ముసుగు తీసి తమ నిజమైన గుర్తింపుతో వ్యాఖ్యలు పంపే ధైర్యం లేదా అని నేను ప్రశ్నించను. కానీ అజ్ఞాతలుగానైనా సరే.. చర్చించిన విషయానికే పరిమితమైతే బాగుంటుందని నా సూచన.

ఖాలిద్ ముస్లిం కార్టును ఉపయోగించుకున్నాడు, కన్హయ్య ఉపయోగించుకోలేదు అని ఒకరు వ్యాఖ్యానించారు. ఇంతకు మించిన వక్రీకరణ మరొకటి లేదు. ఏడేళ్ల వర్సిటీ జీవితంలో ఏనాడూ ముస్లిం అనే స్పృహ తనకు లేదు కానీ ఈ పదిరోజుల్లో నన్ను ముస్లిం ఐడెంటిటీకి కుదించివేశారు అని మాత్రమే ఖాలిద్ అన్నాడు. వీళ్లిద్దరూ కూడా తమ కమ్యూనిస్టు కార్డునే ప్రదర్శిస్తున్నారు. ఆ గుర్తింపును వారేమాత్రం దాచుకోవడం లేదు.

మరొక అజ్ఞాత వ్యాఖ్యాత నన్ను వీరావేశం మాని, హై సౌండెడ్ పదాలు తగ్గించమన్నారు. మీ అభిప్రాయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాను. తప్పేమీ లేదు. కానీ ఆ వాఖ్యలోని తర్వాతి వ్యాక్యం మాత్రం స్వీకరించలేను.

ఎందుకంటే కన్హయ్య, ఖాలిద్ ఉపన్యాసాలు పక్క దేశం వాళ్లు పట్టించుకోలేదా? ప్రపంచవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లోని వందలాదిమంది విద్యార్థులు, పరిశోధకులు, ప్రముఖ విద్యావేత్తలు, మేధావులు కూడా విద్యార్ధులపై దేశద్రోహ ఆరోపణలు తగవని సూచిస్తూ ఇప్పటికే భారత ప్రభుత్వానికి తన ఖండన లేఖలు పంపి ఉన్నారు. కానీ వీళ్లలో ముప్పావు శాతం మంది కమ్యూనిస్టులు.. దేశద్రోహిస్టులు కారు.

ఈ పోస్టుకు వచ్చిన రెండు వ్యాఖ్యలను తప్పనిసరై తొలగించాల్సి వచ్చింది. ఎర్రి లాజిక్కులు, ఎర్ర లాజిక్కులు అనడం, హిందూ మతాన్ని అసందర్భంగా ఇక్కడ ప్రస్తావించడం సరైంది కాదన్న భావనతోనే రెండు అజ్ఞాత వ్యాఖ్యలను తీసివేయడమైనది.

పైగా మేం పనిచేస్తున్న పత్రికలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కేంపెయిన్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఆ పని మీరు చేయదల్చుకుంటే మీ ఇష్టం.. సంతోషంగా చేయండి ఎవరు కాదన్నారు? కానీ ఒక్క మాట. కన్హయ్య ప్రసంగం వీడియోను నీచాతినీచంగా ఎడిట్ చేసి జర్నలిజానికే కళంకం తెచ్చిన జీన్యూస్ చానల్ పైనా, దాని వెబ్‌సైట్ పైనా ముందుగా కేంపెయిన్ మొదలుపెట్టి తర్వాత వేరేవాటిపైకి వెళ్లండి.

దేశద్రోహులుగా మీరు ముద్రవేస్తున్నవారిని జైళ్లలోకి తోయడానికి వీడియో మార్ఫింగ్ చేయడంలో తప్పులేదంటారా? అయితే మీకూ, మీ దేశభక్తికీ, మీ హిందూమత సంస్కృతికి ఒక దండం. నేను హిందువుగానే పుట్టాను కానీ ఇలాంటి వీడియో మార్ఫింగ్‌లు కూడా హిందూ సంస్కృతిలో భాగమేనని నేనయితే అనుకోవడం లేదు.

అయినా నాకు తెలీకడుగుతాను. మీ అభిప్రాయాలను మీరు మీ పేర్లతో ముసుగులు లేకుండా చెప్పడానికి, వ్యాఖ్యలు పంపడానికి ఎందుకంత భయపడుతున్నారు? నా అభిప్రాయాలను లేదా నేను విశ్వసిస్తున్న వాటిని నిర్భయంగా మీముందు ఉంచుతున్నప్పుడు మీరెందుకు మీ ఉనికిని దాచి ఉంచుతున్నారు? ఈ అజ్ఞాత వ్యవహారాలు కూడా దేశభక్తిలో భాగమేనా?

మీ దేశభక్తి భావనను కించపర్చడం నా ఉద్దేశం కాదు కానీ గత వారం రోజులుగా దేశం మొత్తంగా జీన్యూస్ చేసిన నిర్వాకాన్ని దుయ్యబడుతుంటే మీకు నోరు రాదు. జీన్యూస్ అలా చేసి ఉండకూడదు అనే మాట కూడా మీనుంచి రావడం లేదు. ఒక విద్యార్థి జీవితాన్ని అబద్ధపు ఆరోపణలతో ధ్వంసం చేయడం మంచిది కాదనడానికి కూడా మీకెందుకు నోరు పెగలడం లేదు?

బస్సీనుంచి స్మృతి ఇరానీ వరకు అబద్దాలమీద అబద్దాలు చెబుతారు. రెండు రోజుల కోసారి మాట మారుస్తారు. శవాలమీద పేలాలు ఏరుకుంటున్నారంటూనే రోహిత్‌ వేముల ఆత్మహత్యోదంతంపై ఇప్పటికీ పచ్చి అబద్దాలు చెబుతూనే ఉన్నారు. పార్లమెంటు సాక్షిగా అబద్దాలు. పచ్చి అబద్దాలు. రోహిత్ ఆత్మహత్య వార్త వినగానే పదినిమిషాల్లో అక్కడికి వెళ్లానని హెచ్ సీయూ డాక్టర్ ప్రకటించిన తర్వాత కూడా పాపం స్మృతి ఇరానీగారికి తానెంత తప్పు మాట అన్నానో గుర్తు రావటం లేదు.

ఒక్కమాట చెప్పండి. మిత్రులారా! జీన్యూస్ నుంచీ సాక్షాత్తూ పార్లమెంటు వరకు నడుస్తున్న ఇలాంటి అసత్య వ్యవహారాలు కూడా దేశభక్తిలో భాగమేనా? అవునన్నదే మీ సమాధానం అయితే నేను నాలాంటివాళ్లం దేశభక్తిపరులుగా మాత్రం ఉండలేం. ఇలాంటి 'దేశభక్తి' మాకు వద్దేవద్దు.

kanthisena said...

"మా టాక్స్ డబ్బు తింట్టూ, పక్కోడికి (పాకిస్థాన్)జిందాబాద్ కొట్టి, మేము కూడా దేశ భక్తులమే అని మీకు మీరే కితాబులిచ్చుకొంట్టారా?"

ఈ మధ్య టాక్స్ దేశభక్తుల గోల కూడా శృతిమించిపోయింది. మాట మాట్లాడితే చాలు మా టాక్సు డబ్బులు తింటూ పక్కోడికి జిందాబాద్ కొడతారా అంటూ చచ్చు ప్రశ్నలేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. దేశంలో మూడుశాతం మంది మాత్రమే టాక్సు చెల్లిస్తున్నారు. అది కూడా ఆదాయంపై ప్రత్యక్ష పన్ను. మిగిలిన 97 శాతం మంది ఆదాయ పన్ను పరిధిలోకి రాకున్నా నిద్రలేచింది మొదలు నిద్రపోయేవరకు ఏదో ఒక రూపంలో వస్తువుల కొనుగోళ్లతో, వినియోగంతో పరోక్షంగా పన్నులు చెల్లిస్తూనే ఉన్నారు.

ప్రభుత్వ సొమ్ము లేదా టాక్స్ చెల్లింపుదారుల సొమ్ము తేరగా తిని ఊరేగుతున్నారని ఆరోపణలకు గురవుతున్న విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రులు పంపిన డబ్బులు వినియోగించడం ద్వారా అనివార్యంగా టాక్సు పరిధిలోకి వస్తున్నారు. ప్రత్యక్ష పన్నులు చెల్లించేది మన దేశంలో ఉడ్డా ముగ్గురు మాత్రమే. కానీ తాము మాత్రమే పన్నులు చెల్లిస్తూ పెద్ద దేశ సేవ చేస్తున్నట్లు వీరఫోజులు కొట్టడం, తాము చెల్లించే పన్నులతోటే దేశం మొత్తంగా ఉద్ధరించబడుతున్నట్లు మాట్లాడటం అన్ని వయస్కుల వారికి అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలా టాక్సు దేశభక్తి గురించి లెక్చర్లు దంచటం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. బ్లాగుల్లో కూడా ఇదే తంతే.

ఆదాయ పన్ను చెల్లింపుదారులు, పరోక్ష పన్ను చెల్లింపుదారులు చెల్లిస్తున్న వేలాది కోట్లను అప్పనంగా దిగమింగుతున్నది విద్యార్థులు లేదా ఆదాయ మార్గం లేని వారు కాదు. ప్రజల సొమ్మును కొల్లగొడుతోంది దేశీయ కార్పొరేట్ వర్గాలు, వారికి వత్తాసుగా నిలుస్తున్న దద్దమ్మ బ్యాంకులు, వీటి బాబు లాంటి విదేశీ బహుళ జాతి సంస్థలూ మాత్రమే.

మీ కోపాన్ని, చిరాకునూ, ఈ దోపిడీదారులపైకి మళ్లించి మీ టాక్స్ దేశభక్తిని సార్థకం చేసుకుంచే మీకూ, మనకూ, దేశానికీ కూడా మంచిది. చేయవలసిన పని చేయకుండా అర్భకుల మీద పడి ఊరేగడం కూడా దేశభక్తేనా?

Anonymous said...

ఏడేళ్ల వర్సిటీ జీవితంలో ఏనాడూ ముస్లిం అనే స్పృహ తనకు లేదు

ఆ యునివర్సిటినే మిని పాకిస్థాన్, అందువలన ఆయనకు ఆ స్ప్రుహ కలగలేదు. ఏడేళ్లు యునివర్సిటిలో ఏ కోర్స్ ఉంది. ప్రభుత్వ సొమ్ము భోంచేస్తూ అతను అక్కడే విద్యార్ధిగా, జీవితాంతం గడపాలనుకొన్నాడేమో!


Anonymous said...

ప్రపంచవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లోని వందలాదిమంది విద్యార్థులు, పరిశోధకులు.....ఇప్పటికే భారత ప్రభుత్వానికి తన ఖండన లేఖలు పంపి ఉన్నారు.

భారత ప్రభుత్వం అవి తీసి చెత్త బుట్టలో పడేయ్యాలి. ఆతారువాత వాటిని పోటో తీసి అందరికి పంపాలి. వారి సలహాల విలువ ఎంతో తెలిసివచ్చేటట్లు చేయాలి. ఎమనుకొంట్టున్నరు ఈ మేధావులు? భారతదేశం ఎమైనా వీళ్ల వలస వాద దేశమా? ఎవరు అడిగారు వీరి సలహాలను? వాళ్ళే మైనా సలహాలు ఇవ్వాలనుకొంటే వారి దేశాలకి ఇచ్చుకొమనండి. భారత దేశాం అంతరంగిక విషయాలలో వేలు పెడితే, భారత ప్రజలు వేలు కొసి చేతిలో పెడతారు.


రాజు గారు, ప్రపంచ మేధావులు అని గోల చేసేవారి లిస్త్ తీసుకొని చూడండి. ఒకప్పుడు మోడి వీసా పై గోల చేసిన అదే గాంగ్ సభ్యులు 75% ఉంటారు. వీళ్లెప్పుడు ఇండియా అంతరంగిక విషయాలపై గగ్గోలు పెడతారు. పాకిస్థాన్,గల్ఫ్ దేశాల విషయానికి వస్తే నోరెత్తరు. వీళ్లను ఎవరండి ఈ రోజుల్లో పంట్టించుకొనేది? మీరు గొప్పగా భావించే కె. రామచంద్రమూర్తి, ఉషా డాని లు తప్ప.

kanthisena said...

"ఏడేళ్లు యునివర్సిటిలో ఏ కోర్స్ ఉంది. ప్రభుత్వ సొమ్ము భోంచేస్తూ అతను అక్కడే విద్యార్ధిగా, జీవితాంతం గడపాలనుకొన్నాడేమో!"
యూనివర్సిటీల గురించి ఓనమాలు కూడా తెలియకుండా ఇలా వ్యాఖ్యలు చే్స్తే ఎలా? ముందు పీజీ, తర్వాత ఎంఫిల్, తర్వాత పీహెచ్ డీ కోర్సులు పూర్తి చేయడానికి అన్ని యూనివర్శిటీల్లోనూ అవకాశాలున్నాయి వీటిని పూర్తి చేయడానికి వరుసగా 2, 3, 5 ఏళ్ల వ్యవధి ఉంటుంది. ఇన్నేళ్లు చదువుతూనే ఉండాలా ఎవరిని ఉద్ధరించడానికి అంటారా? మీ బాస్ లకు చెప్పి ఒక్క కలంపోటుతో యూనివర్సిటీలను రద్దు చేసేయండి. అప్పుడు స్మృతి అమ్మగారికి కూడా పదవి లేకుండా పోతుంది.

Anonymous said...

రోహిత్ దళితుడు కాడు

http://andhrabhoomi.net/content/r-79

Anonymous said...

Must read

http://www.mediacrooks.com/2016/02/poisoning-kids.html

Anonymous said...

దళితుడే గాని రోహిత్ అంశాన్న్ని రాజకీయానికి ఉపయోగించుకొంట్టు యెంతపెద్ద ఇస్స్యును చేశారు.చివరికి బొక్క బోర్ల పడ్డారు. అడ్డంగా దొరికి పోయారు. స్మృతి ఇరాని అబద్దం చెప్పిందంట. కాంగ్రెస్ పార్టి తో దేశద్రోహ భర్ఖాదత్,రాజ్దీప్ సర్దేశాయ్,సాగరికా గోష్ ల మీడీయా మానిపులేషన్ తో చేసిన ప్రాపగండా ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలకు తెలిసింది. దేశంలో శాంతిభద్రతలు చెడగొట్టాటానికి పాకిస్థాన్ ప్రియురాలు భర్ఖా దత్ చేయని ప్రయత్నం లేదు. పూర్తిగా యక్స్ పోజ్ అయిపోయింది.

Anonymous said...


విద్యార్దులంటా, చాలా అమాయకులంటా. రాజకీయ ప్రత్యర్ధులమని వాళ్లు సవాలు విసురుతూంటే, వారు విద్యార్దులు ఎట్లవుతారు? యునివర్సిటిలలో కూచొని చదువులేకుండా ముదిరిపోయిన అంకుల్ విద్యార్దులకు మద్దతునిచ్చే వారు, వాళ్ళకి చెప్పండి యునివర్సిటిని వదలి ఎన్నికలలో నిలబడమని.


I'm not your child but political opponent: JNU student pens open letter to Smriti Irani

http://www.thenewsminute.com/article/im-not-your-child-political-opponent-jnu-student-pens-open-letter-smriti-irani-39550

Anonymous said...

జీ టివిని విమర్శిస్తారే, ఈ వార్తని ఏ ఇంగ్లిష్ ఛానల్ అయినా చూపించిందా? నీరా రాడియా మీడీయా బ్రోకర్ భర్ఖాదత్ మాజి మoత్రి గారిని ఎన్ని ఇంటర్వ్యులు చేసి ఉంట్టది. ఒక్కసారైనా ఈ విషయం పై ప్రశ్నించిందా? ఒక్కరు చనిపోతే లక్ష మంది చనిపోయినట్లు, లక్షల కోట్లు తిన్నవారిని అమాయకులు లా వదిలివేయటం.
దేశ ప్రజలకు నయాపైసా లాభం లేని బీఫ్ ఫెస్తివల్, శని దేవాలయ ప్రవేశం, జె.యన్.యు. పై పార్లమెంట్ లో, టివి షోలలొ రోజులు తరబడి గోల చేస్తారు.

https://www.youtube.com/watch?v=iY8Tg6lB3m0

ఇప్పటికి ఇరాని పార్లమెంట్ స్పీచ్ ని యుట్యుబ్ లో 60 లక్షలకు పైగా చూశారు. దేశ ప్రజలకు మేసేజ్ చేరిపోయింది.

kanthisena said...

"ఇప్పటికి ఇరాని పార్లమెంట్ స్పీచ్ ని యుట్యుబ్ లో 60 లక్షలకు పైగా చూశారు. దేశ ప్రజలకు మేసేజ్ చేరిపోయింది."

ఆహా.. 60 లక్షలమందికి మెసేజ్ చేరిపోయిందా. అయితే ఏంటటా? భూమి బద్దలవలా.. మిన్ను విరిగి మీదపడలా.. సముద్రాలు ఇంకిపోలా.. జేఎన్ యూ గోడ ఇటుక కూడా రాలి కింద పడలా..

రాజద్రోహం కేసు పెట్టారు. అరెస్టు చేశారు. ప్రశ్నించారు. కస్టడీలో కూడా కన్హయ్య, ఖాలిద్ తదితరుల నుంచి మార్స్సిస్టు పాఠాలు చెప్పించుకుని తలలు పట్టుకున్నారు. పనిలో పనిగా న్యాయస్థానం వారి చేత కూడా ఇప్పటికే కాస్త గడ్డి తిన్నారు. ఇంకేం జరిగిందటా.. పచ్చి అబద్దాల మంత్రి ప్రసంగం 60 లక్షల మందికి చేరితే ఏంటటా... పైగా పార్లమెంటులో రోహిత్ పేరు కూడా ఎత్తడానికి ఇష్టం లేని స్మతి అమ్మ నోటినుంచి చైల్డ్ రాగాలు..

ఒక దత్తాత్రేయ. ఒక అప్పారావు.. ఒక మానవ వనరుల.. కాదు కాదు.. మానవ విధ్వంసక మంత్రి కలిసి వెలివేసి అన్యాయంగా హత్య చేసింది చాలకుండా మళ్లీ పిల్లాడట.. పైగా 12 గంటలపాటు రోహిత్ వద్దకు వైద్యులను, పోలీసులను అనుమతించలేదట. పార్లమెంటు ఒక దేవాలయమట.. ఆ గుడిలో ఒక సీతమ్మవారట. ఆమె నోరు తెరిస్తే పచ్చి అబద్దాలట.

దేశాన్ని ఇలాగే ఉధ్ధరించండి మరి.

Anonymous said...

మీరు చెప్పె అబద్దాలను ప్రజలు తిప్పికొడుతున్నారు. ఆయన దళితుడే కాదు అని ప్రభుత్వం నివేదిక ఇస్తే దాని మరచ పోతున్నారు. ఒక అభివృద్ది లో కి రావలసిన వ్యక్తి చనిపోవటం భాదాకరం. ఐతే ఇది ఈ రోజు బిజెపి వలన వచ్చిన సమస్య కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. ఎంత మంది చనిపోలేదు? అప్పుడు జాతీయ స్థాయిలో చేయని గొడవ ఇప్పుడే ఎందుకు చేస్తున్నట్లు? దీనిని తీసుకొచ్చి మంత్రుల రాజీనామా అడిగితే ఎలా? విద్య కాషాయికరణ అని గగ్గోలు చేసే హరగోపాల్, కమ్యునిస్ట్ మేధావులు టెక్స్ట్ బుక్ లో రాహుల్ గాంధి పై పెద్ద పాఠం పెడితే నోరు మెదపలేదే!

దేశాన్ని మీరనుకొన్న దానికన్నా బాగా అభివృద్ది చేస్తాము. నిన్న బడ్జేట్ చూశారు కదా! గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పునరుజ్జివింప చేయటానికి ఎలాంటి చర్యలు మోడీ తీసుకొన్నారో!

Anonymous said...

రాజద్రోహం కేసు పెట్టారు. అరెస్టు చేశారు. ప్రశ్నించారు.


సార్, కాంగ్రెస్ పాలనలో ఎన్ని రాజద్రోహ కేసులు పెట్టిందో చూడండి. రోహిత్ లో పదో శాతం మీడీయా ఎమైనా గోల చేశారా? అప్పుడు భర్ఖా దత్,సాగరిక ఘోష్, రాజ్దీప్,రాణ అయూబ్, సబా నక్వి ఎమి చేస్తున్నారు?

మీలాంటివార్రు పాకి ఏజెంట్ల అడుగుజాడలలో నడుస్తూ, ఫూల్స్ అవుతున్నారు. ఇక నైనా కళ్లు తెరవండి.


1 Democratic protest. 8,000 Sedition cases. Is this a free country?

http://archive.tehelka.com/story_main53.asp?filename=Ne080912Democratic.asp

hari.S.babu said...

ఆర్యా,
ఇప్పటివరకు రోహిత్ గురించి చర్చించిన వారిలో ఏ ఒక్కరికీ రోహిత్ స్టైపండ్ ఎందుకు ఆగిపోయింది అనే అనుమానం రాలేదు,ఎందుకని?మీడియా యూనివర్సిటీ అధికార్లని అడిగీతె “పేపరు వర్కు వల్ల జాప్యం” అనే ఒక ముక్క మాత్రమే బైటికి వచ్చింది.అధికార్లు విషయం వివరంగానే చెప్పే ఉంటారు,కానీ మొత్తం చెబితే రోహిత్ మీద సానుభూతీ తమ MRTP కొసెం సెన్సేషనూ పుట్టవని కాబోలు మీడియాలో ఎవరూ దానిగురించి ఎక్కువగా కవర్ చెయ్యలేదు.
రోహిత్ అక్కడ రీసెర్చ్ వర్కుకి ఎన్రోల్ అయ్యాడు. రీసెర్చ్ వర్కు అంటే ఎన్రోల్ అవటం ఒక్కటేనా ముఖ్యం.వర్క్ చెయ్యాలిగా,చెసినట్టు రిపోర్ట్స్ ఇవ్వాలిగా.నెలవారీ ప్రోగ్రెస్ మదింపు చెయ్యాలని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏమిటో ఇక్కడ వివరంగా చదవవచ్చు.6వ సెక్షనులో అటెండెన్సుతో కలిపి రీసెర్చ్ వర్కుకి సంబంధించిన వివరాలు చూదొచ్చు,7వ సెక్షనులో స్కాలర్షిప్పులకి స్మబంధించిన నెలవారీ మదింపు గురించిన నియమాలు చూడొచ్చు.
స్కాలర్ షిప్ కూడా ఎన్రోల్ అయితే చాలు వర్క్ చేస్తున్నాడా లేదా అని చూడకుండా నెలనెలా ఇస్తూనే ఉంటారా తేరగా?వాళ్ళకి స్కాలర్షిప్ పేరుతో ఇచ్చేది ప్రజాధనం,కూర్చోబెట్టి మేపడానికి స్మృతి ఇరానీ గానీ జైట్లీ గానీ వాళ్ళ జేబులోనుంచి తీసి ఇవ్వరు కదా!అధికారంలో రాహుల్ గాంధీ ఉన్నా, హరగోపాల్ ఉన్నా,కంచె ఐలయ్య ఉన్నా తన జేబులోనుంచి ఇస్తాడా?
ఆ రీసెర్చ్ వర్కుకి అటెండెన్సు ఉంటుంది,ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఉంటాయి. కార్ల్ సేగన్ కొటేషన్లు చెప్తూ ప్రకృతిని గురించి చెప్పిన కబుర్లన్నీ గాలికొదిలేసి 24 గంటలూ ల్యాబులో ఉంటే ఉద్యమానికి టైము సరిపోవట లేదని సైన్సు గూపు నుంచి ఆర్ట్స్ గ్రూపుకి మారాడు.
ఇక్కడ కూడా ఈ ఉద్యమాల కోసం తిరుగుతూ అటెండెన్సు బొక్క పడి ఉందవచ్చు,ప్రోగ్ర్స్ రిపోర్టులు సబ్మిట్ చెయ్యటం తనవైపునుంచే డిలయ్ ఐ ఉండవచ్చు! ఇతను పేపర్లు స్బ్మిట్ చెయ్యడం అంటూ జరిగితే స్టైపండ్ ఆపటానికి వాళ్ళకీ దమ్ములు ఉండవు – కోర్టుకీడ్చి ముక్కుపిండి రెట్టింపు వసూలు చేసుకోవచ్చు,అవున అకాదా?
బతుకులో బాధ్యత లేనివాడు చావుతో వీరాధివీరుడిగా కొనియాడబడుతున్నాడు?
స్వస్తి!

hari.S.babu said...

Raja Sekhara Raju
దేశాన్ని ఇలాగే ఉధ్ధరించండి మరి.

haribau
బాధ్యత లేనివాళ్ళని సమర్ధిస్తూ మీలాగ మాత్రం ఉద్ధరించం లెండి.

నీహారిక said...
This comment has been removed by the author.
hari.S.babu said...

ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు దళిత స్కాలర్లు,వాళ్ళ మీద హారాస్మెంటు జరగటం వల్ల అని అంటున్నారు.అక్కడ అతన్ని బతుకుమీద విరక్తి పుట్టేటంతగా డైరెక్టుగా హరాస్ చెయ్యహలిగిన వాళ్ళు ఎవరు?మొదటి ముద్దాయి అతని గైడు!

స్టైపండ్ కొట్టేసే ప్రొఫెసర్లు ఉంటారు,పెత్తనం చేసే మెంటాలిటీ ఉన్న ప్రొఫెసర్లు ఉంటారు - చాలా యవ్వారాలు ఉంటాయి లెండి:-)ఏ కొంచెం తేడాగా బిహేవ్ చేసినా నీ బతుకు బస్టాండే అని బెదిరించే సాడిస్టులూ ఉంటారు.ఎవడికి వాడు ఇట్టాంటివి బయటికి చెప్పకుండా పోజులు కొడుతున్నారు గానీ అంతా ఇంతే.కొందరు ఆతమహత్యలు చహెస్కున్నవాళ్ళ గైడుల్లో మార్కిష్తు భావక్జాలం ఉన్నవళ్ళు కూడా ఉన్నారని మీకూ తెలుసు!మరి,తన స్టూదెంటు మీఅద్ వేరేవాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనిపించేటంతగా హారాస్ చేస్తుంటే అతనికి తెలియకుండా ఉంటుందా?టెక్నికల్ యాంగిల్లో చూస్తే ప్రొఫెసర్ అన్నితికీ జవాబుదారీగా ఉందలేడు,కానీ తాన్ స్టూడెంటుని ఎవరైనా హరాస్ చేస్తున్నరని తెలిస్తే అధికారులని ఎలర్ట్ చేసే కనీసపు అధికారం అతనికి ఉంటుంది,అవునా కాదా?హరాస్మెంటుకి గురయిన స్టూడెంటు వాలకం చూసయినా తెలుసుకోవచ్చు,వయస్సుతో వచ్చిన పెద్దరికం వల్ల కష్తసుఖాలు కనుక్కుంటూ మంచిగా మాట్లాడి మరీ నిరాశలో కూరుకుపోకుండా మానవసహజమైన ఓదార్పుని ఇవ్వొచ్చు.మరి వీతన్నంటిలో ఇప్పుడు వేముల రోహొత్ అనే కుర్రాంంఓ స్మృతి ఇరానేఎ చంపీంట్టు ఆవేశపడిపోవటం ఎంతవరకు సబబు?

ఒక రీసెర్చి స్టూడెంటుకి చచ్చిపోవాలని ఎప్పుడనిపిస్తుంది?తన వర్కు సాగదేమో,తన ఫ్యూచర్ దెబ్బతింటుందేమో అన్నప్పుడు కాదా!ఇవన్నీ ఆలోచించలుండా ఆవెశపడిపోతున్నారు మీరు.

కొంచెం ముందూ వెనకా చూసుకుంటే బాగుంటుంది కదా, ఇదే మొదటి రాజద్రోహం కేసయినట్టు బొత్తిగా R&D లేకుండా రాస్తే అవి అబద్ధాలని తేలిపోతున్నాయి. ఆ యూనివర్సిటీ వైస్ చాన్సలరూ,స్మృతి ఇరానీ అబద్ధాలు చెప్తున్నారని ఆవేశపడిపోతూ మీరూ అబద్ధాలు చెప్తే ఎట్లా?

Anonymous said...

స్మృతి ఇరానిని చంపటమేమిటండి? ఆమేను కక్ష కొద్ది ఇరికించారు. ముక్కు మొహం చూడని రోహిత్ పై వ్యక్తిగత కక్ష ఆమెకు ఎందుకొంట్టుంది? ఐలయ్య పుస్తకాలు చదివి పిల్లలు అన్యాయం అయిపోతునారు. అడ్డుగోలు హిందూ వ్యతిరేక వాదం చేసే ఐలయ్య విదేశి ఏజెంట్ అని సాక్షాల తో సహా బ్రేకింగ్ ఇండియా బుక్ లో నిరూపిస్తే,దానిని పక్కన పెట్టి తెలుగు మీడీయాలో ఆయనకి పెద్దపీఠ వేస్తారు. ఈ మీడీయా వారిని ఏమనాలి? హిందువుల మనోభావాలు దెబ్బతింట్టునయని చెప్తుంటే కూడా బీఫ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తారా? పిల్లలను రెచ్చ గొట్టి వీడీయోలు తీసి సర్క్యులేట్ చేసి అర్రెస్త్ అయ్యారు కదా! ఆ విద్యార్దులకు కోర్ట్, చట్టం అంటే ఇప్పుడు అర్థమై ఉంట్టుంది. పోలిసు కేసు వల్ల ఉద్యోగాలు రావు. కోర్ట్ కేసు ఎన్ని రోజులు జరుగుతుందో ఈ దేశంలో ఎవరికి తెలియదు. విద్యార్దుల జీవితాలను నాశనం చేసి, ఐలయ్య రెబెల్ హీరోలా భావిస్తాడు. విదేశి ఎజెండా కనుగుణంగా ఐలయ్య క్రైస్తవ వర్గాల మద్దతుగా హిందువులలో చిచ్చుపెటే కార్యక్రమం ఎందరో విద్యార్దులను తప్పుదోవపట్టించి,వారి నాశనానికి కారణమౌతున్నాది.

hari.S.babu said...

sorry,Typos,
you have to raed
ఇప్పుడు వేముల రోహొత్ అనే కుర్రాంంఓ స్మృతి ఇరానేఎ చంపీంట్టు ఆవేశపడిపోవటం ఎంతవరకు సబబు?
as
ఇప్పుడు వేముల రోహిత్ అనే కుర్రాణ్ణి స్మృతి ఇరానీ స్వయంగా కక్షగట్టి చంపినట్టు ఆవేశపడిపోవటం దేనికి?

Anonymous said...

Meeku ide panemo, andarikee peru pettukuni profile create chesukuni maree rayalanna opika teerika undavu. gillinappudu evadaina spandistadu. Aina agnata comments vaddanukunnappudu spandinchadam maneyyali. aa phalana student ki entha bhava prakatana svecha undo ikkada agnatalaku kuda anthe untundanna chinna paati vishayanni grahinchalekunda ededo rayatam only people like u are trained to do that.

By the way ..sayudhaporatam cheyyaka pothe vyatirekulu kadantaranamata ..ane daniki matuku samadhanam ledu

Anonymous said...

// మేం పనిచేస్తున్న పత్రికలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కేంపెయిన్ చేస్తామని

మీరు పొరబడ్డారు, పత్రికలకు కాదు పత్రికలలో పనిచేసే విలేఖరులనే టార్గెట్ చేసేది. వాళ్ల పైన కేంపైన్ చేస్తాము. అది కూడా వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టటమే ధ్యేయంగా ఉంట్టుంది. పత్రికలు ఉంటాయి. దాని యజమానులకు ఉండేది లాభాపేక్ష. ఐడియాలజి తో దానిని భ్రష్టు పట్టించేది విలేఖరులే.

ఆంధ్రజ్యోతి లో సోమ వారం వచ్చే సాహిత్య వ్యాసాలలో అభ్యుదయ,దళిత,మైనారిటి, స్రీ వాద కవులు,రచయితలు రాసే వాటితో నింపి హిందూ విదేవేషాన్ని వెదజల్లుతారు. ఒక మేధావి వాటిని ఖండిస్తూ వ్యాసం రాసి పంపితే ప్రచూరించలేదు. విచారిస్తే తెలిసింది ఆ సంచికకు ఏడిటర్ గా ఒక మైనారిటి ఉన్నాడు. అతను మధ్య తరగతి హిందువుల భావాలను ప్రచూరించకుండా అడ్డుపడతాడని తెలిసింది.ఇదే ట్రెండ్ సాక్షి లో కూడా గమనించాం.

మీపేపర్ చదివేది మధ్య తరగతి హిందువులు. ప్రతి దినం వాళ్ల విశ్వాసాలని అవహేళన చేస్తూ వాళ్లని దేశద్రోహులు అయినట్లు విలన్ లు గా చూపుతారా? మీరు మద్దతిచ్చేది ఇస్లామిస్ట్ లకు, నక్సలైట్ లకు, సంస్కృతిని ద్వేషించే ఫెమినిస్ట్ లకు. మీకు తెలిసిన సీనియర్ జర్నలిస్ట్ మిత్రులకు చెప్పు, హిందువులను తీసుకొచ్చి అబ్రహమిక్ మతాలతో పోలిస్తే మర్యాద దక్కదని. వాళ్లకు వీరి పై ఎక్కువ ప్రేమ పొంగి పొరలితే వారికి ఈ దేశం లో పని ఎమి ఉంది?

Post a Comment