Pages

Monday, April 16, 2018

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు తెలుగు రేప్ ఇండస్ట్రీ : తేజస్విని ఫైర్

బడాబాబులు, వారి కొడుకులు, వారి కాళ్లు నాకే నిర్మాతలు, దర్శకులు రాజ్యమేలుతున్న తెలుగు చిత్ర పరిశ్రమ వాస్తవానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదని తెలుగు రేప్ ఇండస్ట్రీ అని తీవ్రాతితీవ్రమైన ఆరోపణలు చేశారు హైదరాబాద్ మహిళా నేత తేజస్విని. టాలీవుడ్‌‌లో కమిట్‌మెంట్, కాంప్రమైజ్ అనే పదాల చాటున సాగుతున్న రేప్‌ల భాగోతంపై మొన్న మాధవీలత, గాయత్రీగుప్తా నిన్న శ్రీరెడ్డితో మొదలైన ఆరోపణల పర్వం గత రెండు మూడు రోజులుగా టాలీవుడ్‌లోని జూనియర్ ఆర్టిస్టుల ఆక్రందనలతో, పొలికేకలతో పరాకాష్టకు చేరినట్లయింది. కోఆర్డినేటర్లు, కో ప్రొడ్యూసర్లు, ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు, నటరాక్షసులు.. ఇలా నానా జాతి ఖంగాళీలంతా జూనియర్ ఆర్టిస్టుల నిస్సహాయతను ఆధారం చేసుకుని టాలీవుడ్‌లో నిత్యం సాగిస్తున్న అత్యాచారాల బీభత్స కాండ హాలీవుడ్‌లో జరిగిన దానికి ఏమాత్రం తీసిపోదని అక్కడికంటే ఇంకా ఎక్కువ దారుణాలు ఇక్కడే తెలుగు సినిమా రాక్షసులు సాగిస్తూ నిర్లజ్జగా, నిర్భీతిగా బతికేస్తున్నారని తేజస్విని మండిపడ్డారు. ఆమె మాటల్లో చెప్పాలంటే..

"జూనియర్ ఆర్టిస్టుల బాధలను మొన్న విన్నాం. నిన్న విన్నాం. ఈరోజు వింటున్నాం. ఇది తెలుగు ఫిలిం ఇండస్టీ కాదు. తెలుగు రేప్ ఇండస్ట్రీ. మీరు ఒక్క సినిమా చేయడానికి ఎన్ని రేప్‌లు చేస్తారో చెప్పండి. ఎన్ని కలెక్షన్లు కాదు.. ఎన్ని రేప్‌లు చేస్తారో చెప్పండి ముందు. ఒక సినిమా కంప్లీట్ కావడానికి ఎన్ని రేప్‌లు అవుతాయో చెప్పండి. రేప్ చేయకుండా ఒక్క సినిమానైనా చేయగలరా చెప్పండి.  క్విడ్ ప్రో కో ప్రకారం వచ్చి పడుకో.. పడుకుంటే సినిమా చాన్స్ ఇస్తా, కమిట్‌మెంట్ ఇస్తే సినిమా ఇస్తా అంటున్నారు కదా. ఇలా కమిట్‌మెంట్ తీసుకునే వాళ్లంతా రేపిస్టులే. తెలుగు సినీ ఇండస్ట్రీ నిండా రేపిస్టులే ఉన్నారు. ఢిల్లీలో నిర్భయ విషయంలో జరిగింది మాత్రమే రేప్ అనుకుంటున్నారా? మీరు చేసేవన్నీ రేప్‌లే. రేప్ చేయకుండా ఒక్క సినిమా తీసి చూపించండి మాకు. మీరు ఇష్టప్రకారం రేప్‌లు చేస్తూ ఉంటే మేం చూస్తూ ఊరుకోవాలా, ఊరుకుంటామా?"

తేజస్విని మాటలను అలా పక్కనబెడితే, మరోవైపున జూనియర్ ఆర్టిస్టులయితే తమ వంతుగా, మా శాపం తగిలి తెలుగు సినిమా నిర్మాతలు కాలిపోతున్నారని, అట్టర ప్లాఫ్‌లతో నాశనమైపోతున్నారని శపిస్తున్నారు. మా ఉసురు తగిలి హార్ట్ ఎటాక్ వచ్చి పోతారని, నాశనమైపోతారని శాపాలు పెడుతున్నారు. ఇక గత కొన్నివారాలుగా టాలీవుడ్ క్యాషింగ్ కౌచ్ వ్యవహారాలను టీవీ మీడియా, సోషల్ మీడియా ద్వారా గమనిస్తున్న సగటు వీక్షకులు అయితే ఇంత మంది ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటూ ఒ నలుగురు, ఐదుగురు వ్యక్తులు గొప్పవాళ్లుగా, ధనవంతులుగా మారే ఈ నీచమైన వ్వవస్థను సినీ రంగం, సినీపరిశ్రమ అని అనడానికి వీల్లేదని, ఇది స్త్రీలను వ్యబిచారంలోకి దించే మాఫియా గ్యాంగ్ అనీ ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. 'మా' (MAA) అంటే మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కాదు అదొక 'మాఫియా ఆగడాల అడ్డా' అంటూ మండిపడుతున్నారు.

ఇక హేతువాది  గోగినేని బాబు అయితే 'మా' ని రద్దు చేసిపడేస్తే తప్ప తెలుగు సినీ గిల్డ్ బాగుపడదని తేల్చి పడేస్తున్నారు. టాలీవుడ్ అసలు పరిశ్రమే కాదని, పరిశ్రమకు ఉండాల్సిన పరిస్థితుల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా దాంట్లో అమలు కావడం లేదని, పునాదులతో సహా మళ్లీ కొత్తగా నిర్మిస్తే తప్ప టాలీవుడ్‌లో మహిళల ఆక్రందనలు నిలిచిపోవని గోగినేని ప్రకటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సత్యం ప్రత్యేక హోదాలోనే కాదు... ఆ సత్యం శ్రీరెడ్డి పొలికేకలోనూ ఉంది. తెలుగు సినీరంగంలోని జూనియర్ ఆర్టిస్టుల హాహాకారాల్లో ఉంది. ఒక మహిళా జూనియర్ ఆర్టిస్టును 700 సార్లు పైగా బలవంతంగా అత్యాచారం చేసిన తెలుగు మూవీ మాపియాను, 15-20 ఏళ్ల లోపు అమ్మాయిలను తీసుకువచ్చి తార్చితే సినీ అవకాశాలిస్తామని ప్రకటిస్తున్న కోఆర్డినేటర్లను, వారి పైన ఉన్న ఎగ్జిక్యూటివ్ దర్శకులను బహిరంగంగా ఏకిపడేస్తున్న జూనియర్ ఆర్టిస్టుల ఆకలికేకల్లో సత్యం ఉంది.

ముంబై నుంచి వచ్చి పడుతున్న తెల్ల చర్మాల సుందరాంగులపై పంజా విసురుతున్న తెలుగు హీరోల్లో ఒక్కడంటే ఒక్కడు కూడా టాలీవుడ్‌ని కుదిపేస్తున్న ఈ సెక్స్ కుంభకోణం గురించి నోరు విప్పే సాహసం చేయడం లేదు. తెలుగు సినిమాకు పట్టిన చీడపురుగులు ఇప్పుడు నోరు విప్పితే తమ బాగోతం ఎక్కడ బాగుపడుతుందో అనే చందాన జుట్టుపీక్కుంటున్నారు. నిన్నగాక మొన్న మీడియాకు దొరికిన పవన్ కల్యాణ్ మరోసారి తన తిక్కను ప్రదర్శించి నవ్వులపాలయ్యాడు. మోసపోయిన అమ్మాయిలు టీవీలకు ఎక్కకుండా, రేటింగులకు తోడ్పడకుండా పోలీస్ స్టేషన్లకు వెళ్లి కేసులు పెట్టాలని వాళ్లు న్యాయం చేయకపోతే అప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవలసి వస్తుందని హీరోయిజం ప్రదర్శించిన పవన్ కల్యాణ్ టాలీవుడ్‌లో క్యాషింగ్ కౌచ్ గురించి ఒక్క మాటంటే ఒక్కమాట కూడా ప్రస్తావించకుండా తప్పించుకోవడంపై మహిళా సంఘాలు తూర్పారపడుతున్నాయి. ఇక శ్రీరెడ్డి అయితే బెంగాలీ హీరోయిన్లతో బాడీ మసాజ్‌లకు అలవాటుపడ్డ పవన్‌ కల్యాణ్‌కు తెలుగు నటిల, జూనియర్ ఆర్టిస్టుల బాధలు ఏం తెలుస్తాయంటూ దెప్పి పొడిచింది.

ఈ నేపథ్యంలో ఇన్నాళ్లుగా వాయిస్ అనేది లేకుండా ఎవరికి తమ బాధలు చెప్పుకోవాలో అర్థం కాకుండా దశాబ్దాలుగా తెలుగు సినిమా రాక్షసుల దమన కాండను మౌనంగా భరించిన పేద అమ్మాయిలను, జూనియర్ ఆర్టిస్టులను మహిళా సంఘాలే ఒక స్పష్టమైన మార్గం గుండా నడిపించి వారి సమస్యలకు సరైన పరిష్కారం చూపిస్తారని, చివరికంటా వారిని వదలకుండా ముందుకు నడిపిస్తారని ఆశించడం తప్ప ఇంకేమీ చేయలేం. దశాబ్దాలుగా మహిళల సమస్యలపై ముందుండి పోరాడుతున్న మహిళా సంఘాల నేతలు సైతం జూనియర్ ఆర్టిస్టుల ఆర్తనాదాలను వింటూ నిద్రలేని వేదనను అనుభవిస్తున్నారంటే తెలుగు సినీ కీచకాధకములు ఎంత స్థాయిలో పతనమయ్యారో తెలుస్తుంది.

ఏసీ కారవాన్‌లలో సేదతీరే ముదనష్టపు హీరోలు, ముంబై, బెంగాలీ హీరోయిన్లు ఒకవైపు..  మంచినీళ్లకు గతిలేకుండా, బట్టలు మార్చుకోవడానికి కూడా చోటు లేకుండా నట్టెండలో మగ్గుతున్న జూనియర్ ఆర్టిస్టులు. మరొవైపు.. తెలుగు సమాజంలోని వర్గ దోపిడీ మొత్తం ఇక్కడే కనిపిస్తోంది. ఇది సినిమారంగ సమస్య కాదు. ఇది జూనియర్ ఆర్టిస్టుల సమస్య అంతకంటే కాదు. పేదలపై ధనవంతులు, ధనమదాంధుల అడ్డాగా మారిన క్రూర దోపిడీ వ్యవస్థ సమస్యగానే దీన్ని అర్థం చేసుకోవాలి.  ఈ వర్గ పీడనపై మహిళా సంఘాలు చివరిదాకా పోరాడతాయని, జూనియర్ ఆర్టిస్టులకు ఇకనైనా మనుషులకు ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలను సమకూర్చే వ్యవస్థను టాలీవుడ్‌లో నిర్మించే ప్రయత్నం చేస్తాయని ఆశిద్దాం.

జూనియర్ ఆర్టిస్టుల ఆవేదనను, తేజస్విని ఆగ్రహాన్ని కింది లింకులో పూర్తిగా చూడవచ్చు.

They Can't Do One Movie Without Using Women: Feminist Tejaswini 

10 comments:

నీహారిక said...

సినిమాల్లో చాన్సుల కోసం అమ్మాయిలనైతే కమిట్మెంట్ అడిగారంటున్నారు. అబ్బాయిలను ఏమడుగుతారో తెలుసుకోవాలనుంది. మీకేమయినా తెలుసా ?

kanthisena said...

అయ్యో. మీకు తెలిసి అడుగుతున్నారా లేక తెలియక అడుగుతున్నారా.. అబ్బాయిలను కూడా కమిట్‌మెంట్ బాషతోనే కొడుతున్నారట. వాళ్లు కూడా ఈ విషయాలను చెబుతున్నాీరు కానీ ముందుకు రావడం లేదు. అదే సమస్య.

బుచికి said...

హాలీవుడ్ లో కూడా మంచపు వేషాలు సమస్య ఉంది. దెయ్యపు గాడిదలు అంతటా ఉన్నారు.

kanthisena said...

దెయ్యపు గాడిదలు... పదం చాలా కొత్తగా ఉంది కానీ సరిగ్గా ఉందండీ.. 2015లో హాలీవుడ్‌ను తాకిన కాస్టింగ్ కౌచ్ ముూడేళ్ల తర్వాత టాలీవుడ్‌ను తాకింది. అలా ఇలా కాదు. టాలీవుడ్ దున్నపోతులు వణికిపోయే స్థాయిలో.. తాకింది కదా..

ketan said...

"ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా ఏ అమ్మాయినీ ఇబ్బంది పెట్టలేదు" అని ఒక కార్డువేయించడం తప్పని సరి చేయించాలి ప్రతి సినిమాకూ. అప్పుడుగానీ వాళ్లకు అవమానంగా ఉండదు.


సినీహీరోలనని ఉపయోగంలేదండీ. వాళ్ళ సినిమాలు చూస్తున్నదీ, అభిమానంపేరుతో చొక్కాలు చించుకుంటున్నదీ మనమేగా! మనకు బుధ్ధిరావాలి ముందు. మనం వెలేస్తే, అడుక్కు తినడానిక్కూడా పనికిరారు వెధవలు. కులాలకొద్దీ మనమైతే ఈ దరిద్రపు మొహాలు చూస్తున్నాంగానీ, తియ్యమనండి ఇంకోరాస్ట్రంలో. ఈ దేభ్యమ్మొహాలను ఎవరుచూస్తారో నేనూ చూస్తాను.

kanthisena said...

కేతన్ గారూ,
"ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా ఏ అమ్మాయినీ ఇబ్బంది పెట్టలేదు"
మీ ప్రతిపాదన అద్భుతంగా ఉంది. తప్పనిసరిగా మహిళా సంఘాల నేతలకు మీ వ్యాఖ్యను పంపించాలి. ఇది భవిష్యత్తులో రాబోయే సినిమాలకు ఒక బెంచ్ మార్క్ గా ఉండాలి.

"కులాలకొద్దీ మనమైతే ఈ దరిద్రపు మొహాలు చూస్తున్నాంగానీ, తియ్యమనండి ఇంకోరాస్ట్రంలో. ఈ దేభ్యమ్మొహాలను ఎవరుచూస్తారో నేనూ చూస్తాను"

దేభ్యమ్మోహాలు.. నూటికి నూట యాభై శాతం కరెక్ట్ ఈ పేడ ముఖాలకు తెల్లతోలు హీరోయిన్లు ముంబై నుంచి దిగి రావాలట. వీళ్లూ వీళ్ల దొంగకోళ్లు పట్టే ముఖాలూ..

నీహారిక said...

అబ్బాయిలను కూడా కమిట్మెంట్ అడుగుతున్నారు.అది ఏ రకమైన కమిట్మెంటో మీకు తెలుసా ?

హీరోయిన్ లు బికినీ వేసుకుని పుష్కర స్నానం చేస్తుంటే గుడ్లప్పగించి చూడాలే కానీ రేప్ చేయకూడదు.

హ్రితిక్ రోషన్ లా ముద్దులు పెట్టేసుకుని కూడా అబద్దాలాడకూడదు.

సన్నీలియోన్ తో నటించినా పవిత్రం గా శీలవంతుడిగా నిలబడాలి.

మొత్తంగా మోడీలాగా సన్యాసి జీవితం గడపడానికి ఇష్టపడితేనే సినిమాల్లోకి రావాలి.

నీహారిక said...

ఫక్క రాష్ట్రం దాకా ఎందుకులెండి !
రాజుగారు చూపించిన వీడియోలో ఉన్న దేభ్యం మొఖాలను టీవీ లోనే చూడలేక చస్తున్నాం. తెలుగు సినిమా ప్రేక్షకులంటే మీకు మరీ కామెడీగా ఉంది.

Anonymous said...

గుడ్లప్పగించి చూడాలే కానీ రేప్ చేయకూడదు.

నిహారిక గారు, గుడ్లప్పగించి చూడాలే కానీ తాకకుడదు. ఈ రోజుల్లో అనుమతి లేకుండా తాకటం కూడా నేరం క్రిందకు వస్తుంది. రేప్ అంటే ఎప్పుడో 1980 పరుచూరి బ్రదర్ సినేమాలలో, హీరో చెల్లెలుగా వరలక్ష్మి అనే నటి నటించిన సినేమాలు గుర్తుకు వస్తాయి.

Anonymous said...

Like Kathi Mahesh, gouravangaa mee kanksha ni vyakthaparachaali. its mutual benefit as he told. anthe kaani ilaa street fights cheyakudadu.
:venkat

Post a Comment