Friday, March 4, 2016

దేశం నుంచి కాదు.. కొల్లగొట్టే వారి నుంచి స్వాతంత్ర్యం కావాలన్న కన్హయ్య


దేశం నుంచి ఆజాదీ -స్వాతంత్ర్యం-ని తానెన్నడూ కోరలేదని, దేశాన్ని కొల్లగొట్టేవారినుంచి స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటున్నానని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ డిమాండ్ చేశారు. తప్పుడు దేశద్రోహ కుట్ర కేసులో ఇరికించబడి 23 రోజుల కస్టడీ తర్వాత గురువారం సాయంత్రం తీహార్ జైలునుంచి బయటకి వచ్చిన కన్హయ్య జేఎన్‌యు మాత్రమే కాదు దేశం మొత్తం విని తీరవలసిన ప్రసంగం చేశారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై తనకు విశ్వాసం ఉందన్న కన్హయ్య తనపై దేశద్రోహ కేసు మోపిన కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

అవి మాటలు కావు.. నిప్పుకణికలు. ఈ దేశ ప్రజానీకం గొంతును తనదిగా చేసుకుని జాతి వాణిని వినిపించిన మాటలవి. ఉద్యమాల్లో భాగంగా జైలు జీవితం గడిపి వచ్చిన వారు నిర్బంధంలో మరెంతగా రాటుదేలతారో మరోసారి.. మరోసారి నిరూపించిన మాటలు. ఇంత జరిగినప్పటికీ తన అరెస్టు ఉదంతానికి కారణమైన ఏబీవీపీపై తనకు శత్రుభావం లేదని, వాళ్లు తన ప్రత్యర్థులు మాత్రమేనని చెప్పిన కన్హయ్య వారిలాగా తాను వెంటాడి వేధించే పనికి పూనుకోనని స్పష్టం చేశారు. పైగా జేఎన్‌యూ క్యాంపస్ లోని ఏబీవీపీ వాళ్లు క్యాంపస్ బయట ఉన్న ఏబీవీపీ వారికన్నా ఎక్కువ జాతీయవాదులుగా, హేతుబద్దంగా ఉన్నారని కితాబు కూడా ఇచ్చారు. ప్రజాస్వామ్యంపై,  రాజ్యాంగంపై తమకు నమ్మకం ఉంది కాబట్టే ఇంత జరిగిన తర్వాత కూడా తమకు ఏబీవీపీపై చెడు భావం లేదన్నారు.

ముక్తకంఠంతో జేఎన్‌యూ ఇలా ఒక్కత్రాటిన నిలబడటంలో ఉన్న మంచి విషయం ఏమిటంటే ఇది సహజాతి సహజంగా పుట్టుకొచ్చిందే కానీ ఎవరో చెబుతున్నట్లు ప్లాన్ ప్రకారం పుట్టుకొచ్చింది కాదంటూ కన్హయ్య ఎద్దేవా చేశారు. భారత రాజ్యాంగం ప్రవచించిన సోషలిజం, సెక్యులరిజం, సమానత్వం కోసంమే తాము నిలబడుతున్నామన్నారు. ప్రధాని మోదీతో తాను అనేక విషయాల్లో విభేదిస్తున్నప్పటికీ సత్యమేవ జయతే అంటూ తాను చేసిన ట్వీట్‌తో మాత్రం తనకు ఏకీభావం ఉందని, సత్యమే జయిస్తుందని చెప్పారు.

మాటలు రాతను అధిగమించే సందర్భాలు అత్యంత అరుదుగా మాత్రమే జరుగుతుంటాయి. కన్హయ్య విద్యార్థుల ముందు మాట్లాడుతూ అణచివేతపై నిప్పురవ్వలు చిమ్ముతూ, నిర్బంధాలను గేలి చేస్తూ, నవ్వుతూ, నవ్విస్తూ చేసిన ప్రసంగం కలిగించిన ప్రభావం దాన్ని పదాల్లోకి మార్చినప్పుడు అంత శక్తివంతంగా ప్రతిబింబించలేదేమో...

విద్యార్థి జీవితం ముగిశాక ఇన్నేళ్ల తర్వాత ఇంత స్పూర్తిదాయకమైన, ప్రసంగాలు వినడం ఇదే మొదటిసారి. 35 ఏళ్ల ముందు నా గతాన్ని, యూనివర్సిటీ జీవితాన్ని, గ్రామాలకు తరలండి పిలుపు కలిగించిన ఉత్తేజాన్ని మరోసారి ఇప్పుడు చూస్తున్నాను.

తనను అన్యాయంగా తప్పుడు వీడియోలో ఇరికించి దేశద్రోహిగా ముద్రించి కోర్టుకీడ్చినప్పటికీ అందుకు కారణమైన విద్యార్థి సంస్థ తన శత్రువు కాదని, తాను వారిలాగా వెంటాడి వేధించబోనని, వారు తమ ప్రత్యర్థులు మాత్రమేనని చెప్పడానికి ఒక మనిషికి ఎంత నిలకడ ఉండాలి? ఎంత సహనం, సంయమనం ఉండాలి? తనను దెబ్బ తీసిన ప్రత్యర్థులను, విరోధులను సైతం తేలిగ్గా తీసుకునే తత్వానికి శిఖరస్థాయి ప్రదర్శన ఇది. ఈ దేశంలో నిరుపేదలకు మాత్రమే సాధ్యమైన క్షమా గుణం ఇది. భావజాలాలకు అతీతంగా, భావాల మధ్య సంఘర్షణకు అతీతంగా వ్యక్తమైన అద్భుతమిది. ఇదీ ప్రజాస్వామ్యం అంటే.

వందలాది జేఎన్‌యూ విద్యార్థుల ముందు కన్హయ్య కుమార్ చేసిన ప్రసంగం తన మాటల్లోనే క్లుప్తంగా చూద్దాం."...మీరు లేచి నిలబడి మాట్లాడారంటే చాలు.. అతికించిన నకిలీ వీడియోలను సైబర్ సెల్ విడుదల చేస్తుంది. మీ డస్ట్‌బిన్‌లో కండోమ్‌లను లెక్కిస్తుంది.  నిరసనలను చట్టవిరుద్ధం చేయడానికి, రోహిత్ వేములకు న్యాయం జరగకుండా నిరోధించడానికి ఇది పథకం ప్రకారం జరిగిన దాడి. కానీ జేఎన్‌యూలో ప్రవేశం పొందడం అంత సులభం కాదు. అలాగే జేఎన్‌యూ నోరు మూయించడం కూడా అంత సులువు కాదు. మా పోరాటాన్ని మీరు పలుచన చేయలేరు.

మన సైనికులు సరిహద్దుల్లో నేలకొరుగుతున్నారని వారంటున్నారు. అలా నేలకొరుగుతున్న  సైనికులకు నేను సెల్యూట్ చేస్తున్నా. కానీ సైనికులు సరిహద్దుల్లో చనిపోతున్నారని పార్లమెంటులో ప్రస్తావించిన బీజేపీ ఎంపీని ఒక ప్రశ్న అడుగుతున్నాను. అలా చనిపోయిన సైనికుడు మీ కుమారుడు కాదు. మీ స్నేహితుడు అంతకంటే కాదు.  కరువు దెబ్బకు కుంగి, కృశించి మరణిస్తున్న రైతు కొడుకులు ఆ సైనికులు. ఈ ఈ వాస్తవాన్ని పక్కన బెట్టి దేశంలో తప్పుడు చర్చను సృష్టించవద్దు. ఇంతకూ ఈ మరణాలన్నింటికీ  ఎవరు కారణం?

సిరిసంపదలను కలిగి ఉండటంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కు లభించేంతవరకు మేము విశ్రాంతి తీసుకోం. మేం భారత్ నుంచి స్వాతంత్ర్యాన్ని కోరుకోవడం లేదు. ఎందుకంటే భారత్ దేన్నీ తన వలసగా చేసుకోలేదు. దేశాన్ని కొల్లగొడుతున్న వారినుంచి మేం స్వాతంత్ర్యం కోరుకుంటున్నాం. సరిహద్దులపై పోరాడుతున్న సైనికుడు బహుశా చదవాలని కోరుకుని ఉంటాడు కానీ తనకు జేఎన్‌యూలో ప్రవేశం లభించి ఉండదు.

రైల్వేస్టేషన్లలో జనాలకు మాయలు, కనికట్టులతో బురిడీ గొట్టే వారిని మనం చూస్తాం, దేశంలో అలాంటి వారు ఉన్నారు. వాళ్లు నల్లధనాన్ని వెనక్కు తీసుకొస్తామన్నారు. ఇంకా వికాసం గురించి, సమానత్వం గురించి చాలా చాలా మాట్లాడుతున్నారు. భారతీయులు విషయాలను సులువుగా మర్చిపోతారు కానీ ఈ సారి మాత్రం తమాషా చాలా పెద్దదిగా కనబడుతోంది. ఓటర్లను మర్చిపోవద్దు.

మీరు ఒక రోహిత్‌ని నోరు మూయించారు. కానీ ఈరోజు ఆ విప్లవం ఎంత పెద్దదిగా మారిందో చూడండి.జైలులో నేను ఒక అంశాన్ని గుర్తించాను. జేఎన్‌యూలో ఉన్న మనం నాగరిక భాషలో మాట్లాడుతున్నాం. కానీ మనం చాలా కఠినమైన పదజాలాలను వాడుతుంటాం. బహుశా అది సగటు మనిషికి చేరకపోవచ్చు కూడా. మనం సామాన్య ప్రజలతో సంబంధాలను నెలకొల్పుకోవాలి. 

ఈరోజు గౌరవనీయ ప్రధాని స్టాలిన్ గురించి మాట్లాడారు. అయితే మోదీజీ కొన్ని సార్లు హిట్లర్ గురించి కూడా మాట్లాడి ఉంటారనుకుంటాను. వీలయితే ముస్సోలినీతో కూడా. మోదీ మన్ కీ బాత్ గురించి మాట్లాడుతుంటారు కానీ ఆయన ఎప్పుడు వినదల్చుకోడు. 

నేనొక వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చాను. మాది పేద కుటుంబం. పోలీసుల్లో కూడా చాలామంది పేద వర్గాల నుంచి వచ్చిన వారే.  పేద వర్గాలనుంచి వచ్చినవారు పీహెచ్ డీలను పొందకూడదనే ప్రభుత్వం జేఎన్‌యూని అణిచివేయాలనుకుంటోంది. నేను మీడియాకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాలాంటి పేదవర్గాల నుంచి వచ్చిన వారెందరో ఉన్నారు. కానీ వీరికి జేఎన్‌యూలోనూ సీట్లు దొరకవు. సైన్యం లోనూ స్థానం లభించదు.  అందుకో పొలాల్లో పనిచేస్తున్నావారి కోసం, సైన్యంలో ఉండి మనకోసం పోరాడుతున్నవారి కోసం, జేఎన్‌యూలో స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారి కోసం మా పోరాటాన్ని మేం నిలిపివేయం. 

అదేసమయంలో మేం సమానత్వంకోసం పోరాడతాం. అప్పుడే ఒక ప్యూన్ కొడుకు, రాష్ట్రపతి కొడుకు ఇద్దరూ సమాన వాతావరణంలో చదువుకోగలరు. దారిద్ర్యం నుంచి, సామాజిక అణచివేత నుంచి మేము స్వాతంత్ర్యం కోరుకుంటున్నాం. ఈ యూనివర్శిటీ ద్వారా మేం ఆ స్వాతంత్ర్యాన్ని పొందగలం. ఇదే రోహిత్ వేముల కన్న స్వప్నం కూడా. 

నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. కానీ నాకోసం నిలబడుతున్న వారిని కూడా జాతి ద్రోహులుగా పిలుస్తున్నారు. సీతారాం ఏచూరి, రాహుల్ గాందీలను కూడా జాతి ద్రోహులంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే్జ్రీవాల్‌ గురించి చాలా చాలా మాట్లాడారు. కానీ వీరెవరూ జేఎన్‌యూ కోసం మాట్లాడలేదు. మంచికి, చెడ్డకు వ్యత్యాసాన్ని మాత్రమే వీరు ప్రదర్శించారు. 

బీజేపీ హర హర్ అని పిలవడం ద్వారా ప్రజలను గెల్చుకోవడానికి ప్రయత్నించింది. కానీ 'అరహర్' (కందిపప్పు) ధర విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇప్పుడు తీవ్ర ఆగ్రహంతో ఉంటున్నారు. సమస్యలను సృష్టిస్తున్నది మేం కాదు. మీరే సమస్యలను సృష్టించుకుంటున్నారు. 

కేంద్రప్రభుత్వం ఇప్పుడు ఎదుర్కొంటున్న నిరసలకు ప్రభుత్వమే కారణం.  తమ స్వంత చర్యలే అందుకు కారణం. మీరు సంపాదించుకున్నదే మీరిప్పుడు ఆరగిస్తున్నారు. జేఎన్‌‍యూ వివాదం ఇప్పుడు టీవీ చానళ్ల ప్రైమ్ టైమ్‌లో చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే మీరు చేసిన 15 లక్షల రూపాయల వాగ్దానాన్ని జాతి మర్చిపోవాలని మీరు కోరుకుంటున్నారు. (నల్లధనం వెనక్కు రప్పిస్తే ప్రతి భారతీయుడికి 15 లక్షల రూపాయలను ఇవ్వవచ్చు అని మోదీ గతంలో వాగ్దానం చేశారు)

ఈ దేశంలో నిత్యం చస్తున్న రైతుల బాధలను మీరెందుకు పట్టించుకోరు? జేఎన్‌యూలో సీటు పొందడం సులభం కాదు. అలాగే జేఎన్‌యూలోని విద్యార్థులను మర్చిపోవడం కూడా అంత సులభం కాదు. దేశంలో అధికారం వెలగబెడుతున్న వారు ప్రజలను ఎప్పుడు అణిచివేసినా ప్రజలు తమ గొంతు విప్పారు. మేం కూడా మీకు వ్యతిరేకంగా గొంతు విప్పుతాం. 

లోక్‌సభలో ఒక బీజేపీ నేత సరిహద్దుల్లో చనిపోతున్న సైనికులను గురించి మాట్లాడారు. నేను అతడిని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఆ చనిపోతున్నది మీ సోదరుడా? ఈ దేశంలో పిట్టల్లా రాలిపోతున్న రైతుల గురించి మీరేం చెబుతారు? చనిపోతున్న సైనికుల పేర్లను వెల్లడించడం ద్వారా దేశంలో మరొక తప్పుడు సమస్యను సృషించవద్దు. (కన్నయ్య మాట్లాడుతున్న ప్రతి సందర్భం చివర్లో వందలాది జేఎన్‌యూ విద్యార్థులు హర్షద్వానాలతో స్వాగతించారు. షేమ్ షేమ్ అంటూ కేంద్ర ప్రభుత్వ నిర్వాకాన్ని గేలి చేశారు.)

ఈరోజు దేశంలో జరుగుతున్నది చాలా ప్రమాదకరమైనది.  ఒక పార్టీ గురించో, ఒక ఛానల్ గురించో నేను చెప్పడం లేదు.  నా కుటుంబం 3 వేల రూపాయలు సంపాదిస్తోందని నేనింతవరకు ఎవరికీ చెప్పి ఉండలేదు. నావంటి వారు మరే ఇతర కాలేజీలో అయినా పీహెచ్‌డీ చేసి చేస్తూ ఉంటారని మీరు ఊహించగలరా? న్యాయం కోసం నిలబడే ఎవరినైనా వారు ద్రోహి అంటున్నారు. ఎలాంటి స్వయం ప్రకటిత జాతీయ వాదం ఇది?

మన ప్రభుత్వానికి ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నా. దేశంలో 69 శాతం మంది మీకు వ్యతిరేకంగా ఓటేశారు. కేవలం 31 శాతం మంది మాత్రమే మీకు ఓటేశారు. వారిలో కొద్దిమంది మీ మాయలో చిక్కుకున్నారు. ఈరోజు వాళ్లు దేశమంతటా విధ్వసంకరమైన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు నిజమైన సమస్యలను అడగకూడదన్నదే వారి లక్ష్యం. 

ఆర్ఎస్ఎస్ అధికార వాణి ది ఆర్గనైజర్ జేఎన్‌యూపై ఒక ముఖచిత్ర కథనం ప్రచురించింది. జేఎన్‌యూని నాలుగు నెలలపాటు మూసివేయడానికి తగిన కారణాలను వారు చర్చలో హేతుపూర్వకంగా చెప్పగలిగితే, నేను వారి మాటలను సమ్మతిస్తాను. కానీ వారు అసమ్మతిని అణచివేయాలనుకుంటున్నారు. కానీ నేను వారికి ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా. అది మీవల్ల కాదు. 

మరోసారి స్వాతంత్ర్యం కోసం నినాదాలు ఇద్దాం. భారత్ నుంచి కాదు. భారత్‌లో స్వాతంత్ర్యం. ఆకలి నుంచి స్వాతంత్ర్యం, దారిద్ర్యం నుంచి స్వాతంత్ర్యం, కుల వ్యవస్థ నుంచి స్వాతంత్ర్యం. దేశాన్ని కొల్లగొడుతున్న వారినుంచి స్వాతంత్ర్యం. ఇదే మనం కోరుకుంటున్న స్వాతంత్రం...."

తీహార్ జైలు నుంచి విడుదలయ్యాక జేఎన్‌యూలో గురువారం సాయంత్రం విద్యార్ధి నాయకుడు కన్హయ్య కుమార్ చేసిన మహోధృత ప్రసంగం వీడియో లింక్ ఇక్కడ చూడండి. 

ఈ వీడియో ప్రసంగం కొత్త లింక్ ను తాజాగా ఇప్పుడే జత చేయడమైంది. ఇది ఇంగ్లీష్ స్ర్కోలింగ్ తో మరింత స్పష్టంగా ఉంది.

JNUSU president Kanhaiya Kumar Fiery Speech after getting out of jail 3/3/2016
https://www.youtube.com/watch?v=yS9AX8rvYhg


23 comments:

Anonymous said...

నాలుగు దెబ్బలు పడేటప్పటికి మనిషి దారికొచ్చాడు. దేశం నుంచి కాదు కొల్లగొట్టే వారినుంచి పాట అందుకొన్నాడు. కన్నయ్య కి బైల్ ఇచ్చింది కోర్స్ పూర్తి చేసుకోవటానికి, వాడు తోక జాడిస్తే కోర్ట్ బైల్ కెన్సల్ చేసి బొక్కలో తోస్తుంది.

ఉద్యమాల్లో భాగంగా జైలు జీవితం గడిపి వచ్చిన వారిని రిసీవ్ చేసుకోవటానికి కార్పోరేట్ నీరా రాడియా ఏజెంట్, పాకిస్థాన్ ప్రియురాలు, నేను దేశద్రోహినే అని అంగీకరించిన భర్ఖాదత్ వచ్చింది. భర్ఖాదత్ ఎంత కన్నింగ్ అంటే యన్.డి.టి.వి. పై అవినితి ఆరోపణలపై విచారణ వచ్చే సమయానికి వేరే కంపెని పెట్టుకొని, ఆ కంపెని ద్వారా ఆ టివి లోనే పని చేస్తున్నాది. ట్విట్టర్ లో యన్.డి.టి.వి. లో పెట్టుబడి పెట్టిన 5,500 కోట్లు బ్లాక్ మని అవినితి పై ప్రశ్నిస్తే దానితో నాకు సంబంధం లేదు. అని తప్పించుకొంది. ఇంత అవినితి పెరిగిపోతుంది గందా, ఆమే టివిలో దొంగ ధనం పెట్టుబడులు పెట్టిన వారి పై ఒక కార్యక్రమం చేయకుడదా! ఈ దేశ భక్తులు మోడిని విమర్సించే వారే! ఆ చనల్ అవినితిని గురించి మాట్లాడిన రాంజెత్మలాని ని వదలి ప్రెస్ మీట్ లో పక్కన కూర్చున్న వారికి కోర్ట్ నోటిసులు పంపారు. ఈ దేశద్రోహులు అందరు కలసి ఇప్పుడు సరికొత్త దేశభక్తుడిని తయారు చేయటంలో మునిగిపోయారు.

Anonymous said...

దేశంలో 69 శాతం మంది మీకు వ్యతిరేకంగా ఓటేశారు. కేవలం 31 శాతం మంది

చంద్ర శేఖర్ కి, ఐ.కె.గుజ్రాల్ కి,దేవ గౌడకి,వి.పి.సింగ్ కి, మొన్న మన్ మోహన్ సింగ్ కి ఎంత శాతం ప్రజలు ఓటు వేశారు? అప్పుడు ఎవరు ఆ ప్రధానుల ఓట్ల శాతం గురించి ప్రశ్నించలేదే? పిచ్చి విశ్లేషణలు చేస్తూంటారే కమ్యునిస్ట్ పార్టికి ఎంతమంది ప్రజలు ఓట్లు వేశారు.

దేశప్రజలు హిందూ వ్యతిరేక శత్రువులకు ఈ ఎన్నికలలో ఒక హెచ్చరిక జారి చేశారు. ఆ శక్తులు హెచ్చరిక పట్టించుకోవటం మాని హిందువులను దేశ ద్రోహుల తో చేరి అవహేళన చేస్తున్నారు. దీనికి హిందువులు తగిన గుణపాఠం మీడీయా వారికి చెపుతారు.

Anonymous said...

చిదంబర ‘విద్రోహం..

http://andhrabhoomi.net/content/editorial-235

నీహారిక said...

ప్రజాస్వామ్యం అంటే తనను దెబ్బ తీసిన ప్రత్యర్థులను, విరోధులను సైతం తేలిగ్గా తీసుకునే తత్వానికి శిఖరస్థాయి ప్రదర్శన. ఈ దేశంలో సామాన్యులకు సైతం సాధ్యమైన క్షమాగుణం. భావజాలాలకు అతీతంగా, భావాల మధ్య సంఘర్షణకు అతీతంగా వ్యక్తం కావాల్సిన తరుణం.

Anonymous said...

NDTV’s money laundering scam of over Rs. 5,500 crores

http://pcwedsndtv.blogspot.in/


NDTV, founded in 1988 by Prannoy and Radhika Roy, has over its lifetime, been accused of being too cozy with the Congress, hit by a credibility crisis in 2010 after one of its chief anchors turned up in the Radia tapes, withstood questions about its ownership and faced inquiries from the Income Tax Department.

http://scroll.in/article/772870/with-probe-into-its-finances-ndtv-complains-about-concerted-campaign-against-it

Anonymous said...

ఈ దేశంలో నిత్యం చస్తున్న రైతుల బాధలను మీరెందుకు పట్టించుకోరు?

https://twitter.com/BDUTT/status/705408873230790656

ఆ ప్రశ్న భర్ఖా దత్ ను కూడా అడగవచ్చు, మరి అడిగాడా? గత దశాబ్ద కాలంగా రైతులు చనిపోతూంటే భర్ఖా దత్ వాళ్ల గురించి ఎన్నిoTini టివి షోలలో చర్చించింది. స్రీ, గే, లెస్బియన్ హక్కుల పై లెక్కలేనన్ని ప్రొగ్రం లు నిర్వహించిన విదేశి ఎజెంట్ కి, స్వదేశం లో ఉండే రైతులు ఎందుకు గుర్తుకు రాలేదు అని అడిగాడా? కన్నయ.

Anonymous said...

Newspapers spreading Doctored Video theory didn't print a word on StatusReport saying video is NOT doctored

https://twitter.com/sudhirchaudhary/status/702727635227406336

Read the slogans mentioned in Delhi High Court order on #KanhaiyaKumar #JNURow .U still need more for the awakening?

https://twitter.com/sudhirchaudhary/status/705324521436291072

Anonymous said...

"దేశప్రజలు హిందూ వ్యతిరేక శత్రువులకు ఈ ఎన్నికలలో ఒక హెచ్చరిక జారి చేశారు."

దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మతమురోయ్!

ఇదీ మన దేశభక్తి అసలు రూపు. అధికారంలో ఎలాంటి వారున్నారనేది అనవసరం వారిదే మతమన్నదే అవసరం. ఒకవేళ సోనియా, రాహుల్ మతమ్మారి ఆవిషయాన్ని రకరకాల విధాలుగా advertise చేసుకొని, దాన్ని నిరూపించుకోడానికి మతఘర్షణలను వాడుకుంటే అప్పుడు మనం కాంగ్రెస్సూ ఓకేనంటాం. మనకూ ఎడారిదేశలవారికీ పెద్ద లేదబ్బాయ్! మనల్ని మనం సహనశీలురం అని పొగుడుకుంటాం. వాళ్ళలాంటి స్వకుచమర్దనాలు చేసుకోరు. అంతే!

Anonymous said...

ఈ దేశంలో కుహనా సెక్యులరిజం బాధితులు హిందూవులు. వేయ్యేళ్ల పైగా అణచివేత, ఆ తరువాత కాంగ్రెస్ గాంధిల పాలనలో వారిని పూర్తిగా తొక్కేశారు.
ఈసారి ఎన్నికలలో హిందూ నాయకుడిగాఅవతరించిన మోడిని దుర్మార్గుడిగా ప్రచారాం చేస్తూ, ప్రధానిగా కాకుండా అడ్డుకోవటానికి దేశ,విదేశ శక్తులు చేయని ప్రచారం లేదు. ఈ కుట్రలను ఎదుర్కొంట్టూ మోడి అధికారంలోకి వచ్చాడు.

వాళ్ళలాంటి స్వకుచమర్దనాలు చేసుకోరు.
_____________________________________
స్వకుచమర్దనాలు ఎందుకు వాళ్లకి ఆడవాళ్ల కరువా? 9ఏళ్లనుంచి 60ఏళ్లవరకు వేలంపాడుకొని కొనుకొంట్టుంటే!


మమ్మల్ని మే పొగుడుకుంటే నీకొచ్చిన్న బాధ ఎమిటి?

Anonymous said...

దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మతమురోయ్!


ఒరేయ్ ఎర్రి పప్పా! ఈ దేశం ఏర్పడిందే మత ప్రాతిపదికపైన రోయ్! ఈ వెర్రి వాదనలు ఎక్కడైనా చెప్పుకోరోయ్! హిందువులు కళ్లు తెరిచారు రోయ్! మీ దొంగా ఆటలు ఇక కట్టురోయ్!

Anonymous said...

"ఒరేయ్ ఎర్రి పప్పా! ఈ దేశం ఏర్పడిందే మత ప్రాతిపదికపైన రోయ్! ఈ వెర్రి వాదనలు ఎక్కడైనా చెప్పుకోరోయ్! హిందువులు కళ్లు తెరిచారు రోయ్! మీ దొంగా ఆటలు ఇక కట్టురోయ్!"

ఆహా... ఇది మీతల్లిగారు చదివితే ఎంతగా తరిస్తారో కదా.. ఇదీ సగటు హిందువు సంస్కారం. ఇలాంటి సంస్కారుల కోసం మత ప్రాతిపదికన ఏర్పడిదంట భారత దేశం. అయ్యవారు చరిత్ర సెలవిచ్చారు.

అప్పుడు ఇండియాకీ పాకిస్థానుకీ తేడా ఏంటిసార్?

Anonymous said...

జేఎన్‌యూలో శ్రీరామచంద్రుడి బొమ్మను దగ్ధంచేయడాన్ని, దుర్గామాతను వ్యభిచారిగా అభిర్ణించిన కరపత్రాన్ని పంపిణీ చేయడాన్ని, మహిషాసురుడు, అఫ్జల్‌గురుల సంస్మరణ సభలు జరపడాన్ని ఎలా సమర్థిస్తారు? వాస్తవాలను తెలియజేయడానికే నేనీ విషయాలన్నిటిని ప్రస్తావించాను. హెచ్‌ సీయూ, జేఎన్‌యూలలో ‘కిత్నే యాకూబ్‌ మరోగే హర్‌ ఘర్‌ సే యాకూబ్‌ నికిలేగా ’ అనీ, ‘కిత్నే అప్జల్‌ మరోగే హర్‌ ఘర్‌ సే మక్బూల్‌ నికలేగా’అన్న నినాదాలు ఇవ్వడాన్ని ఎవరూ ఉపేక్షించ కూడదు. వాటి పర్యవ్యవసానాల ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరుతున్నాను. జాతి వ్యతిరేక శక్తులు విద్యార్థులను ప్రభావితం చేయడాన్ని సహించే ప్రసక్తే లేదు. అటువంటి శక్తులకు వ్యతరేకంగా నిరంతర నిఘా ద్వారా మాత్రమే మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కాపాడుకోలుగుతాము.

సామాజిక సంఘర్షణలు సృష్టించడడానికి , సంకుచిత రాజకీయాలకు పాల్పడడానికి విశ్వవిద్యాలయాలను ఉపయోగించుకోవడాన్ని ఎటువంటి పరిస్థితులలోనూఅనుమతించకూడదని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది.http://www.andhrajyothy.com/Artical?SID=213753

Anonymous said...

బుద్ది, జ్ణానం ఉన్న వారు ఎవ్వరు పాకిస్థాన్ తో భారత్ దేశాన్ని పోల్చరు. అలా పోల్చారంటే హిందువులను ఎగతాళి చేయటానికే! హిందూ దేవి దేవతలను తిడుతూ,వాళ పురాణాలను వక్రీకరిస్తూ రాసి ప్రజల లో చిచ్చుపెట్టే వాళ్లని క్షమించరు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వాళ్లకి ఇచ్చిన సమాధానం అది.

భారతదేశాన్ని పాకిస్థాన్ తో పోలిస్తే మర్యాద దక్కదు. పాకిస్థాన్ లో సంస్కారవంతులు ఉన్నరు, అక్కడ సంస్కారం వెల్లి విరుస్తున్నాదను కొంటే అక్కడికే పో!


హిందూ ముస్లిం ల అస్థిత్వ పైచర్చ ఎప్పుడో ముగిసింది. వాళ్ల కోరిక మేరకు ఒక దేశం ఇచ్చి సమస్యను పరిష్కరించుకొన్నాం. ఇష్టం ఉన్నవాళ్లు ఉండవచ్చు, లేకపోతే ఇష్టమైన దేశం కి వెళ్ళి ఉండవచ్చు. ఆప్షన్ మీ చేతిలో పెట్టుకొని హిందువుల మీద ఏడిస్తే లాభం ఎమిటి?


అప్పుడు ఇండియాకీ పాకిస్థానుకీ తేడా ఏంటిసార్?

Leadership. దేశ స్వాతంత్రం కోసం భారత జాతిపిత ఎన్నోమార్లు జైలుకి వెళ్ళాడు,ఎంతో త్యాగం చేశాడు. పాకిస్థాన్ జాతి పిత ఒక్కసారికి జైలుకి పోలేదు. చేసిన త్యాగం ఎమి లేదు. ఆయన సాధించిన దేశానికి ఆయన కుటుంబ సభ్యులు కూడా పోలేదు. బాంబే లోనే స్థిరపడ్డారు. అది తేడ.

Anonymous said...

ఈ పాచి ముండలు చదువుకోవటం వదిలేసి రాజకీయాలెందుకు.

Anonymous said...

"@ నీహారిక
ప్రజాస్వామ్యం అంటే తనను దెబ్బ తీసిన ప్రత్యర్థులను, విరోధులను సైతం తేలిగ్గా తీసుకునే తత్వానికి శిఖరస్థాయి ప్రదర్శన. ఈ దేశంలో సామాన్యులకు సైతం సాధ్యమైన క్షమాగుణం. భావజాలాలకు అతీతంగా, భావాల మధ్య సంఘర్షణకు అతీతంగా వ్యక్తం కావాల్సిన తరుణం"

అబ్బ చా ఏం చిలక పలుకులండి బాబు.

నీహారిక said...

నీలాంటి అనామకులను తేలిగ్గా తీసుకోవడానికి మించిన శిఖరస్థాయి ప్రదర్శన ఇంకొకటి ఉందా ? ఆ ప్రజాస్వామ్యంలోనే నీలాంటివాళ్ళు వ్రాస్తున్నారు,ప్రచురించగలుగుతున్నారు.

నీహారిక said...

బుద్ది, జ్ణానం ఉన్న వారు ఎవ్వరు పాకిస్థాన్ తో భారత్ దేశాన్ని పోల్చరు.

రెండుదేశాలూ ఒకప్పుడు కలిసి ఉన్న దేశాలేగా పోల్చుకుంటే తప్పేమిటి ? ఆంధ్రా తెలంగాణా ప్రభుత్వాధినేతలే ఒకరినొకరు పోల్చుకుంటున్నారు కదా ?

భారతదేశాన్ని పాకిస్థాన్ తో పోలిస్తే మర్యాద దక్కదు. పాకిస్థాన్ లో సంస్కారవంతులు ఉన్నరు, అక్కడ సంస్కారం వెల్లి విరుస్తున్నాదను కొంటే అక్కడికే పో!

పాకిస్థాన్ వీసా త్వరగా రాదు కదా ?


Leadership. దేశ స్వాతంత్రం కోసం భారత జాతిపిత ఎన్నోమార్లు జైలుకి వెళ్ళాడు,ఎంతో త్యాగం చేశాడు. పాకిస్థాన్ జాతి పిత ఒక్కసారికి జైలుకి పోలేదు. చేసిన త్యాగం ఎమి లేదు. ఆయన సాధించిన దేశానికి ఆయన కుటుంబ సభ్యులు కూడా పోలేదు. బాంబే లోనే స్థిరపడ్డారు. అది తేడ."

కేసీఆర్ కూడా జైలుకి వెళ్ళకుండానే రాష్ట్రాన్ని సాధించుకున్నారు. బోలెడంత త్యాగం చేసాడని తెలంగాణాపిత ని చేసారు కదా ?

నీహారిక said...


హిందూ ముస్లిం ల అస్థిత్వ పైచర్చ ఎప్పుడో ముగిసింది. వాళ్ల కోరిక మేరకు ఒక దేశం ఇచ్చి సమస్యను పరిష్కరించుకొన్నాం.

అస్థిత్వ చర్చ ముగించలేదు.వాళ్ళ కోరిక ప్రకారం కాశ్మీర్ ఇవ్వవలసి ఉంది లేదా స్వతంత్ర కాశ్మీర్ ఏర్పాటుచేయవలసి ఉంది.

నీహారిక said...

కేసీఆర్ తో గొడవ ఎందుకు అని చంద్రబాబు నాయుడుగారు నాలుగు ముంపు గ్రామాలను తెలంగాణాలో కలిపేసారు అలాగే కాశ్మీర్ ని పాకిస్థాన్ కి ఇచ్చేయాలి. కాశ్మీర్ కన్నా గాంగ్‌టాక్ అందంగా పరిశుభ్రంగా ఉంటుంది.భారత దేశంతో కలిసి ఉండాలనుకుంటే ఎలా ఉంటుందో సిక్కిం ని చూసి నేర్చుకోవచ్చు,బలవంతంగా భారతదేశం లో కలుపుకుంటే కాశ్మీర్ లాగా ఎదుగూబొదుగూ లేకుండా ఉంటుంది.

Anonymous said...

కె.సి.ఆర్. పోరాటాన్ని గాంధి మహాత్ముడితో పోలుచగలిగే తెలివితేటలు గల వారితో చర్చించటం ఎంతో కష్టసాధ్యం. మీ అంత తెలివితేటలు గల వారితో మాట్లాడే సాహసం చేయలేము. అయినా ప్రయత్నిస్తాను. మీ వేవ్ లెంగ్త్ పాకిస్థాన్ వారికి సరిపోతుంది.

ఆ హిందువులది ఎముందిలే వారిని యుద్దం లో అవలీలగా ఓడిచగలం. భారతదేశాన్ని వెయ్యేళ్లుగా పాలించాము గదా! ఒక పాకిస్థాని పది మంది భారతీయలకు సమానం అని కాష్మీర్ దూరారు. దూరనైతే దూరారు. కాని ఇప్పుడు బయటపడటం తెలియదు. భారత సైన్యం చేతిలో చితగొట్టించుకొన్నారు.

వీరిని నమ్మి వీరికి అండగా నిలచిన కాష్మీరీలకు ప్రపంచంలో పాకిస్థాన్ బలం,వారి ధైర్యసాహసాలు అన్ని అర్థమయ్యాయి. ఇంతమంది పోరాడి చనిపోయి కూడ భారత దేశ వెంట్రుక కూడా పీకలేకపోయామని తెలుసుకొన్నారు. హిందువులను కాష్మీర్ తరమగొట్టటం ద్వారా కాష్మీరులది ఎంత నీచ కేరక్టరో ప్రపంచానికి తెలిసింది. మీ భార్యలను, కూతుళ్లను వదలి వెళ్ళండ్. మీరు పోకపోతే చంపుతాము అని పండితులను బెదిరించారు. nEDu ఈ కాందిశీక కాష్మీరి పండితులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. అంతర్జాతీయ వేదికలలో జరిగే చర్చలలో పండితులను కూడా కాష్మీరులుగా గుర్తించి వారిని చర్చలకు ఆహ్వానిస్తారు. వారు అంతర్జాతీయ వేదికలపై వాళ్లకు జరిగిన అన్యాయాలను ఏకరువు పెడతారు. పాపం! కాష్మీరి muslim లు చేసిన తప్పులకు జవాబిచ్చుకొలేని డిఫెన్స్ లో పడిపోయారు. భారత పై ఆరోపణలు చేసే అవకాశాన్ని కాందిశీక పండితులు దెబ్బతీశారు.

చట్ట ప్రకారం కాష్మీర్ భారత భూభాగం. ఏ అంతర్జాతీయ న్యాయస్థానలను ఆశ్ర ఇస్తారో ఆశ్రయించమను. అక్కడ గెలవరు. గెలవగలిగే పనైతే ఇంతకాలం వాళ్లు ఊరుకొని ఉంటారా? ఒక ఇంచ భూభాగం కూడా వారికి ఇచ్చేది లేదు. పోరాటం చేస్తే చేసుకోమను. భారత దేశానికి పోయేది ఎమిలేదు.

కాష్మీర్ ముగిసిన అంశం.

Anonymous said...

పాకిస్థాన్ వీసా త్వరగా రాదు కదా ?

పాకిస్థాన్ వారు భారత వీసా, పౌరసత్వం కోరుకొంటారు గాని, పాకిస్థాన్ వీసా అడిగే వాళ్లు ఉంటారని తెలియదు. పాక్ పౌరులే కరాచి నుండి కంటైనార్లలో దాక్కొని దేశం విడిచి పోతూంటారని వార్తలు వస్తూంటాయి. భారత్ లో మీ వంటి వారు పాకిస్థాన్ వీసా కొరకు ఎదురు చూస్తున్నారని, వారి దృష్టికి తీసుకెళితే పాక్ వారు షాక్ లోనౌతారేమో!

Anonymous said...

@ నిహారిక,విదేశంలో నివసించే ఈ పాకిస్థాన్ పౌరుడు తన దేశస్థులను తలచుకొని ఎలా ఏడుస్తున్నాడో చూడండి.

https://www.youtube.com/watch?v=VhoT1lcGOSA

Anonymous said...

జనతన సర్కార్ ప్రధాన సలహదారు ప్రొఫెసర్ హరగోపాల్ ,ఆరుంధతి రాయ్ తప్పించి, కాష్మీర్ పై పాకిస్తాన్ కు అంతర్జాతీయం గా మద్దతు ఇచ్చేం వారు ఎవ్వరు లేదు.

UK snubs Pakistan, says it shouldn't make Kashmir pre-condition for talks

https://www.youtube.com/watch?v=o80-pkO22eQ

Post a Comment