Pages

Saturday, March 5, 2016

స్వాతంత్ర్యమే అతడి 'ప్రియురాల'ట



గత నెల చివరి వరకు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలోనే చాలామందికి తమ విద్యార్థి నాయకుడు కన్హయ కుమార్ ఎవరో పెద్దగా తెలిసేది కాదు. కానీ దేశద్రోహం ఆరోపణపై మూడువారాలు తీహార్ జైలులో గడిపి గురువారం సాయంత్రం జేఎన్‌యూ క్యాంపస్‌కు బెయిల్‌పై వచ్చిన కన్హయకు స్వాగతం పలకడానికి జేఎన్‌యూ మొత్తంగా తరలివచ్చింది. వాక్ స్వాతంత్రంపై జాతీయస్థాయిలో గ్రేట్ డిబేట్‌కు కారకుడైన కన్హయకు మద్దతు తెలుపుతూ వేలాది మంది జేఎన్‌యూ పరిపాలనా భవనం వద్దకు వచ్చారు.

ఆ తర్వాత.. కాలం స్రవించిన ఒక గంట సమయంలో అక్కడ జరిగిన ఘటనల క్రమాన్ని యావద్దేశం జాతీయ చానెళ్లలో తిలకిస్తూ పోయింది. విద్యార్థులనే కాదు.. స్వేచ్ఛను దాని నిజమైన అర్థంలో పొందగోరుతున్న దేశ ప్రజానీకం 60 నిమిషాల పాటు కన్హయ్య ఉత్తేజభరిత ప్రసంగాన్ని చూస్తూ పోయింది. క్రికెట్, లోక్‌సభ గొడవలు, సినిమా విడుదల వార్తలు ఆ గంట సేపు గాల్లో కలిసిపోయాయి.

మన కళ్ల ముందే ఉత్తుంగ శిఖరంలా ఎగిసి లేచిన ఈ అంగుష్టమాత్రుడి మాటలను జాతీయ చానెల్స్ మొత్తంగా తమ ప్రైమ్ టైమ్ న్యూస్ కింద ప్రసారం చేస్తూ గడిపాయి. ఇక ట్విట్టర్ అయితే కన్హయ్య ప్రసంగ విశేషాలతో హోరెత్తిపోయింది. సానుకూలంగానూ, ప్రతికూలంగానూ కూడా. దేశ రాజధాని అతడి ప్రసంగం గురించి, అతడి వివాదాస్పద అరెస్టు గురించి చర్చిస్తూ పోయింది.



పార్టీలకతీతంగా రాజకీయ నేతలు జలపాతంలా దుముకుతూ వచ్చిన కన్హయ్య ప్రసంగాన్ని వింటూ నివ్వెరపోయారంటే అతిశయోక్తి కాదు. అందరికంటే ముందు వ్యాఖ్య కేజ్రీవాల్‌దే. ఎంత మేథో ప్రసంగం అంటూ ట్వీట్ చేశారు. పార్లమెంటులో కన్హయ్యకు ఒక ఎంపీ సీటు ఇప్పటికే రిజర్వ్ అయిపోయిందంటూ ఈ వివాదానికంతటికీ మూలకారణమైన బీజేపీ తరపున కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రశంసించకుండా ఉండలేకపోయారు.

అన్నిటికంటే మించి ప్రధాని మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్ సభలో పరస్పర విమర్శలతో చేసిన ప్రసంగాల కంటే కన్హయ్య గురువారం రాత్రి జేఎన్‌యూలో చేసిన ప్రసంగానికే సోషల్ మీడియాలో ఎక్కువ స్పందనలు రావడం గమనించవలసిన విశేషం. జేఎన్‌యూ, రోహిత్ అంశాలతో ప్రచారం లోకి వచ్చి దాంట్లో భాగంగానే జైలు కెళ్లిన కన్హయ్య మాత్రం ఒక్క సారిగా దేశాన్ని ఆకర్షించారు. తొణకని స్వరంతో అనుకున్నది కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మరి మోదీ, రాహుల్, కన్హయ్యల్లో ఎవరి స్వరం దేశ గళంగా మారింది అనే ప్రశ్నకు మేధావులు, మీడియా, నెటిజన్లలో అత్యధిక శాతం కన్హయ్యకే ఓటేస్తున్నారు. అతడు ఈ దేశ యువత కాంక్షలకు ప్రతినిధి అంటున్నారు. దేశానికి కన్హయ్య లాంటి నాయకుడు కావాలని scroll.in వంటి ఆన్‌లైన్ పత్రికలు కోరుకుంటున్నాయి. ఎవరు ఔనన్నా, కాదన్నా భారత గళానికి ఈ వారం ప్రతినిధి కన్హయ్యే. 

చరిత్రలో అతి గొప్ప ఘటనలు ఒక చిన్న బిందువునుంచే మొదలవుతాయన్నది చరిత్ర విద్యార్థులందరీకీ తెలిసిన విషయమే. స్వతంత్ర భారత చరిత్రలోనే జాతీయవాదంపై, దేశభక్తిపై, ఎన్నడూ లేనంత విస్తృత చర్చకు తెరతీసిన ఈ 29 సంవత్సరాల అర్భకుడు డిల్లీని, జాతిని కూడా కదిలించివేయగలిగిన ప్రసంగంతో ఉర్రూతలూగించి ఉండవచ్చు కానీ తన పయనం మాత్రం ఢిల్లీకి చాలా దూరంగా అత్యంత సాధారణ జీవితంతో మొదలైంది.

బీహార్ లోని బెగుసరాయ్ ప్రాంతంలోని బేటియా గ్రామంలో కన్హయ్య  జన్మించాడు. మీనాదేవి, జైశంకర్ సింగ్ తన తల్లిదండ్రులు. స్వాతంత్రం తొలినాళ్ల నుంచి బెగుసరాయ్ వామపక్షాల కంటుకోటగా ఉంటూ వచ్చింది. తండ్రి జై శంకర్ సింగ్ 2009 వరకు రోజు కూలీగా పనిచేసేవాడు. పక్షవాతంతో తను మంచం పడ్డాడు. కన్హయ్య తల్లి ప్రభుత్వ అంగన్ వాడీ పథకంలో వలంటీర్‌గా పనిచేస్తూ నెలకు 3 వేల రూపాయలు సంపాదిస్తూ కుటుంబాన్ని నడిపిస్తోంది.

నిజమే. లెక్క తప్పు కాదు. కేవలం 3 వేల రూపాయలతో ఈ దేశంలో ఒక కుటుంబం బతుకుతోంది. అందుకేనేమో తరచుగా ఈ దేశంలో పేదలే చాలా సులభంగా దేశద్రోహులు అయిపోతుంటారు. ఆరోపణలకు చిక్కుతుంటారు. వందల కోట్లు దిగమింగిన విజయ్ మాల్యాలు, అంతకంటే దిగమింగిన రిలయన్స్ వంటి చప్పన్నారుమంది బిలియనీర్లు, వారికి ప్రజల ఆస్తులను అప్పనంగా అందించిన మోసకారి బ్యాంకులు,  వారి సేవలోనే తరిస్తున్న బ్యాంకుల మేనేజర్లు వీళ్లెవరూ దేశద్రోహులు కారు. అసలైన దేశద్రోహం కాలనాగై ప్రతి క్షణం కాటేస్తున్న ఈ దేశంలో కన్హయ్యలు కాక ఇంకెవరు 'దేశద్రోహు'లవుతారు.

29 ఏళ్లకే దేశద్రోహి అయిపోయిన కన్హయ్య ఇంటివద్దే 5వ తరగతివరకూ చదివాడు. గ్రామంలోని సన్ రైజ్ పబ్లిక్ స్కూలులో 1995లో చేరాడు. తర్వాత బరౌనీలోని ప్రభుత్వ హైస్కూల్లో చేరాడు. తర్వాతి చదువుల కోసం పాట్నా కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో చేరాడు. జీవితమంతా ప్రభుత్వ స్కూళ్లలో, కాలేజీల్లోనే చదివిన కన్హయ్యలు దేశద్రోహులవుతుండగా, ప్రైవేట్ చదువులు, కాన్వెంట్ చదువులు, బిజినెస్ స్కూళ్లలో చదివి నాజూగ్గా దేశాన్ని ముంచుతున్న వారు, వారి వారస పుత్రపుత్రికలు మహా దేశభక్తులయిపోతుండటం బహుశా మన దేశానికే చెల్లుతుందేమో..

కన్హయ్య చిన్న తమ్ముడు, ప్రస్తుతం ఎం కామ్ చదువుతున్న ప్రిన్స్ మాటల్లో చెప్పాలంటే. స్వాతంత్ర్యమే కన్హయ్య ప్రియురాలట. "మా అన్నకు కనీసం గర్ల్ ఫ్రెండ్ కూడా లేరు. ఈ విషయమై తనను అల్లరి పట్టిస్తే, మేరే దుల్హన్ తో ఆజాదీ హై (స్వాతంత్ర్యమే నా ప్రియురాలు) అనేవాడు. 2009లో మా నాన్న జబ్బుతో మంచం పట్టాక  అన్న తన చదువుకోసం ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదించుకునేవాడు" అన్నాడు కన్నయ్య తమ్ముడు. కన్హయ్ పెద తమ్ముడు మణికాంత సింగ్ అస్సాంలో ఒక ప్రైవేట్ సంస్థలో సూపర్ వైజరుగా పనిచేస్తున్నాడు. అతడు కూడా తెలివైన విద్యార్థే.

పాట్నాలో కన్హయ్యతోపాటు హాస్టల్ రూమ్‌ పంచుకున్న అమిత్ కుమార్.. కాలేజీ మొత్తంమీద ఉత్తమ వక్తల్లో కన్హయ్య ఒకడని చెప్పాడు. ఎప్పుడు చర్చల పోటీలు జరిగినా అతడే గెలిచేవాడట. రాజకీయాలపై తనకు అపారమైన పరిజ్ఞానం ఉండేదట.

కన్హయ తండ్రి జైశంకర్ సింగ్ చురుకైన వామపక్ష కార్యకర్తగా పనిచేశారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా రెండుసార్లు గెలుపొందిన తోటి గ్రామస్తుడు చంద్రశేఖర్ ప్రసాద్ ప్రభావం కన్హయ్యపై అపారంగా ఉండేది. చంద్రశేఖర్‌ను 1997లో బీహార్‌లో మైనింగ్ మాఫియా కాల్చి చంపింది.

కన్హయ్య 2011లో జేఎన్‌యూలో ఎంఫిల్ కోర్సులో చేరాడు. ఇప్పుడు పీహెచ్‌డీ చేస్తున్నాడు. సెంటర్ ఫర్ ఆఫ్రికన్ స్టడీస్ విభాగంలో వర్ణవివక్షానంతర దక్షిణాప్రికాపై పరిశోధన చేస్తున్నాడు. కన్హయ్య పీహెచ్‌డీని పర్యవేక్షిస్తున్న రీసెర్చ్ గైడ్ సుబోధ్ మాలాకర్ మాటల్లో చెప్పాలంటే అతడొక చురుకైన విద్యార్థి. "తనను చూసి గర్వపడుతుంటానని, పేద రైతాంగ కుటుంబం నుంచి వచ్చాడు కనుకే ఈ దేశంలో క్షేత్ర స్థాయి వాస్తవాలపై అతడికి లోతైన అవగాహన ఉంద"ని  సుబోధ్ ప్రశంసిస్తారు.


కన్హయ్యకు ఒక గర్ల్ ప్రెండ్‌ను సంపాదించుకునే సమయం ఇంతవరకూ లేకపోవచ్చు. పేదరికం అతడిని ప్రేమకు కూడా దూరం చేసి ఉండవచ్చు. కానీ ఈరోజు వందలాది యువతులకు అతడొక ఐకాన్. ఎంతగానంటే వియ్ లవ్ కన్హయ్యా అంటూ ప్లేకార్డులు ప్రదర్శించేంత పెద్ద ఐకాన్. ఆ ప్రేమ అతడి ఆశయాలతో మమేకమవుతామంటూ ఘోషిస్తున్న అమలిన ప్రేమ. బలంగా స్టాంప్ వేయబడిన ఒక దేశద్రోహిని ఎంతమంది దేశద్రోహులు ప్రేమిస్తున్నారో! వీళ్లందరినీ ఏ జైళ్లకు పంపుదాం? రెడీమేడ్ దేశభక్తులే సెలవియ్యాలి మరి.

( ఈ సాయంత్రమే అందిన వార్త. సీపీఐ జాతీయ సమితి సమావేశంలో కన్హయ్య ఉదంతంపై తీవ్రస్థాయి చర్చ జరిగిందని తెలిసింది. ఆ అర్భకుడిని దేశంలోకెల్లా దేశద్రోహిగా ఆరోపిస్తూ,  దాడులు చేస్తూ, అటు పోలీసులు, ఇటు కోర్టుల్లో న్యాయవాద గూండాలు, దేశభక్తియుత ప్రభుత్వం వెంటాడుతూ ఉంటే మీరేం చేస్తున్నారంటూ సీపీఐ అత్యున్నత స్థాయి కమిటీలోని యువ నాయకత్వం తమ వృద్దనాయకత్వాన్ని తీవ్రంగా నిలదీసిందని విశ్వసనీయ వార్త. ఒక రాహుల్ గాంధీ,  సీతారాం ఏచూరి,  అరవింద్ కేజ్రీవాల్ తదితర నేతలు నైతిక మద్దతు నిచ్చి తన వెన్నంటి నిలబడకపోయి ఉంటే ఒక చురుకైన విద్యార్థి జీవితం ధ్వంసమైపోయేది కదా, అతడి రక్షణ కోసం మీరేం చేశారని సీపీఐ జాతీయ సమితిలో యువనాయకత్వం తమ సీనియర్లను ఏకిపడేసిందట. ఏం సమాధానం చెప్పాలో తెలియక సుధాకరరెడ్డి, డి. రాజాతో సహా వృద్ధ నాయకత్వం ఆ సమావేశంలో మాటలు రాక మూగపోయిందని తెలుస్తోంది.

దేశ రాజధానిలో సీపీఐ నాయకత్వం ఇంత నీరుగారిన స్థితిలో ఉందా అని ఈ సమాచారం నాతో పంచుకున్న సీనియర్ జర్నలిస్టు ఒకరు  ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రకంగా చూస్తే వయసుడిగిన నాయకత్వం కనుమరుగవుతూ, కన్హయ్య వంటి వారితో కొత్త నాయకత్వం తెరముందుకు వచ్చేందుకు జేఎన్‌యూ ఘటన ఒక  ఉత్ప్రేరకంగా పని చేయనుందేమో మరి. కన్హయ్యకు పార్లమెంటులో సమీప భవిష్యత్తులో సీటు రిజర్వుగా ఉందో లేదో తెలీదు కానీ,  ఒక గొప్ప వక్త, ప్రజలను కదిలించే  వక్త, దేశ వ్యాప్తంగా తన వాణిని వినిపించే రోజులు మాత్రం సమీప భవిష్యత్తులోనే రానున్నాయేమో! పశ్చిమబెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రసంగాలకు కన్హయ్యను తురుపు ముక్కలా ఉపయోగించుకుంటామని ఇప్పటికే సీతారాం ఏచూరి ప్రకటించేశారు.

పాతనీరు కొత్త నీరుకు స్థానమిచ్చి ఇక తప్పుకోక తప్పదేమో.. మంచిదే కదా..)

"నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా.  ఒక జేఎన్‌యు విద్యార్థి ఎప్పటికీ జాతి వ్యతిరేకిగా ఉండబోడని ఈ దేశంలో పన్ను చెల్లింపుదార్లకు మాటిస్తున్నా" అని కూడా కన్హయ్య శుక్రవారం మీడియా సమావేశంలో ప్రకటించాడు. బ్రిటిష్ వారు భారతీయులను అణచివేసేందుకు రాజద్రోహ చట్టం తీసుకువస్తే, ప్రస్తుత భారత ప్రభుత్వం విద్యార్థులను అణచివేయడానికి ఆ పాత చట్టాన్ని వాడుతోందని వ్యాఖ్యానించాడు. విద్యార్థులు జీవితాలను ధ్వసం చేయడానికి దేశద్రోహ చట్టం వంటి నల్లచట్టాలను ఉపయోగించవద్దని ఈ ప్రభుత్వాన్ని కోరండి అంటూ డిమాండ్ చేశాడు.

అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక సందేశం కూడా పంపాడు. "భారత రాజ్యాంగం అనేది ఇష్టమొచ్చినట్లు మార్చివేయడానికి వీడియో కాదు." ఇదీ కన్హయ్య విడుదలానంతర సందేశం.

జేఎన్‌యూలోనే చదివి ఇంటెలిజెన్స్ సంస్థలో పనిచేస్తున్న ఒక అధికారి మరోలా చెబుతున్నారు. "కన్హయ్య మమ్మల్మందరినీ గర్వించేలా చేశాడు. మేము జేఎన్‌యూ నుంచే వచ్చాం అని  చెప్పుకున్నప్పుడు ప్రజలు మాపట్ల అపనమ్మకంగా చూసేవారు. కాని జవహర్ లాల్ యూనివర్సిటీ దేనికోసం నిలబడుతోందో కన్హయ్య జాతి మొత్తానికే చూపించాడు."

శుక్రవారం యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వద్ద కన్హయ్యతో భేటీ కావడానికి పోటీలు పడుతూ వచ్చిన మీడియా బృందాలను చూసి జేఎన్‌యూ ప్యాకల్టీ సభ్యులు ఒకరు ఇలా అన్నారు. "చివరకు జేఎన్‌యూ శక్తి సామర్థ్యాలను మార్కెట్  గుర్తించినట్లుంది."

ఈ పూటకు సెలవు......

గురువారం రాత్రి జేఎన్‌యూలో కన్హయ్య చేసిన ప్రసంగం పూర్తి పాఠం ఇక్కడ చూడవచ్చు

We will win this fight Full text of Kanhaiya’s JNU speech



15 comments:

Anonymous said...

సి.పి.ఐ. కి పార్లమెంట్ లో ఉండేవి రెండు సీట్లు. ఒకటి రాజ్యసభలో జయలలిత మద్దతుతో గెలిచింది. రెండు లోక్ సభలో కేరళా నుంచి ఒక సీటు. మీ వ్యాసం చదివితే కన్నయ్య వల్ల దేశవ్యాప్తంగా రెండొందల సీటు కమ్యునిస్ట్ ల కు వస్తాయనుకొంటారు.

kanthisena said...

అదేం కాదండి. నా ఉద్దేశం ఒక విద్యార్థి నాయకుడు సమీప భవిష్యత్తులోనే రాజకీయరంగంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయన్నదే ఇక్కడ పాయింట్. వారికి రెండు సీట్లే ఉన్నా, భవిష్యత్తులో అవీ పోయినా ఆ పార్టీలోనే అతడు పనిచేయాలనుకుంటే మనం అపలేం కూాడా. వాస్తవం చెప్పుకోవాలంటే కన్హయ్య తన వామపక్ష దృక్పథాన్ని వదులుకుని (అది ప్రస్తుతానికి అయితే అసంభవమే) రేపు బీజేపీలో చేరాలనుకుంటే బీజేపీ అయినా సరే ఆ అవకాశం వదులుకోదనే నా ఉద్దేశం. మాటలతో మంత్రముగ్ధులను చేయగలగిన వక్తలు ఏ పార్టీకయినా వరం వంటివారే. కానీ కన్హయ్య తలకు ఇప్పటికే ఢిల్లీ వీధుల్లో ౧౧ లక్షల రూపాయలకు వెల కట్టి ప్రకటించారు కాబట్టి ఇలాంటి వారు బతకడం కష్టమే. దురదృష్టవశాత్తూ అలాంటి సంఘటన జరిగితే కన్హయ్య మరో భగత్ సింగ్ వారసుడిగా 'దేశద్రోహుల' సరసన చేరిపోవడం ఖాయం. ఆశయాన్ని చంపే క్షిపణి ఈ భూమ్మీద ఎక్కడా పుట్టలేదు అనే వాక్యాన్ని ఒక దళారీ పశ్చాత్తాపం అనే పుస్తుకంలో చదివినట్లు గుర్తు. కన్నయ్య జీవితం ఆ కోవలోనే ముగుస్తుందా? కానీ అతడు బతకాలన్నదే నా కోరిక.

Anonymous said...

ఈ ఎన్నికల తరవాత అర్ధవంతమైన చర్చల ద్వారా కాంగ్రెస్ లో చేరే సావకాశాలే కనపడుతున్నాయి.

నీహారిక said...

"సి.పి.ఐ. కి పార్లమెంట్ లో ఉండేవి రెండు సీట్లు.

ఒకప్పుడు తెరాస కి పార్లమెంట్లో ఉన్నవి రెండు సీట్లు. మరి ఇపుడో ? ఓటు అనేది పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉన్నంతకాలం ఎవరికి తగులుతుందో ఏమో చెప్పలేం.ఎవరి ప్రయత్నాలు వారివి.

kanthisena said...

"ఈ ఎన్నికల తరవాత అర్ధవంతమైన చర్చల ద్వారా కాంగ్రెస్ లో చేరే సావకాశాలే కనపడుతున్నాయి."

మీ అభిప్రాయం వాస్తవరూపం దాల్చదనే అనుకుంటున్నాను. అలా ఉంటేనే బాగుంటుంది కూడా.

kanthisena said...

తాజా వార్త...

"భారతీయ జనతా యువమోర్చా బదౌన్ జిల్లా నేత కులదీప్ వార్ష్నే.. కన్హయ్య కుమార్ నాలుక కోస్తే 5లక్షల రూపాయలు కానుకగా ఇస్తానని ప్రకటించి వివాదంలో ఇరుక్కున్నారు. దీనిపై సీరియస్ గా స్పందించిన పార్టీ అతణ్ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది."

గత రెండు నెలల కాలంలో బీజేపీ తీసుకున్న గొప్ప కాదు కానీ మంచి నిర్ణయం ఇది. ఉన్మాదం శిఖరస్థాయికి చేరిన ఇలాంటి ప్రకటన కర్తలను ఏ పార్టీ అయినా ఎంత దూరం పెడితే అంత మంచిది. బీజేపీ విషయంలో అయితే ఇంకా మంచిది.

Anonymous said...

ఏ పార్టీలోనూ యువతని ఎదగనివ్వరు, అతను నమ్ముకున్న పార్టీ అందుకు మినహాయింపేం కాదు.

Anonymous said...

తాజా వార్త...

దేశ ద్రోహులను దుమ్ముదులిపిన అనుపం ఖేర్


https://www.youtube.com/watch?v=9-K1_FAvXaw

Anonymous said...

తాజా వార్త...

దేశ ద్రోహులను దుమ్ముదులిపిన అనుపం ఖేర్


https://www.youtube.com/watch?v=deGBj_enhAg

Anonymous said...

రాజు గారు,

సోషల్ మీడీయా ప్రభావం వలన ఇంగ్లీష్ మీడీయాలో ఉండే దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడే గాంగ్ అంత యక్స్ పోస్ అయిపోయారు. నదిలో కొట్టుకొని పోయేవాళ్లకి కట్టె పుల్లను ఆసారా చేసుకొన్నట్లు, ఈ పాకిస్థాన్ అనుకూల మీడీయా గాంగ్ సెక్యులరిజం, ఫ్రీ స్పీచ్, హుమన్ రైట్స్ పదాలను కవరప్ కొరకు వల్లె వేస్తూన్నారు.

మీడీయాల్లో వారికి రోజులు దగ్గర పడ్డాయి. భర్ఖా షో లకు రేటింగ్స్ లేవు. ఆమే యజమాని ఇషరత్ జహాన్ కేసులో అడ్డంగా దొరికాడు. కాష్మీర్ అంశం పై సభా నక్వి పాకిస్థాన్ స్టాండ్ ను అల్ జజీరా టివిలో వినిపిస్తు అడ్డంగా బుక్ అయ్యింది. మీడీయా దేశ ద్రోహులు నెత్తికెక్కిచుకొనంత మాత్రాన కన్నయ్య జాతీయ హీరో అయిపోడు. కన్నయ్య చెప్పే నేషనలిజం కొత్త దేమిగాదు. మీరంతా ఎందుకు చంకలు గుద్దుకొంట్టున్నారో! అర్థం కావటం లేడు.

ఇంగ్లిష్ మీడీయా లోని సెక్యులర్ గాంగ్ పై సగటు భారతీయుడి ఆక్రోశాన్ని వివేక్ అగ్నిహొత్రి అద్భుత్వం గా రాశాడు.

http://www.opindia.com/2016/02/an-open-letter-to-rajdeep-iamantinational-sardesai/

hari.S.babu said...

కన్నయ్య కుమార్ ఇచ్చిన రీసెంట్ స్టేట్మెంటు ఏమిటి?సుప్రీం కోర్టు అఫ్జల్ గురుకి గానీ మెమన్ కి గానీ వేసిన శిక్షలు కరెక్టేనంటాడు,కోర్టు తీర్పుల్ని వ్యతిరేకించటం లేదంటాడు.మళ్ళీ వాటిని చర్చించటానికి స్వేచ్చ కావాలంటాడు - తీర్పు కరేక్టే అన్నాక ఇంక చర్చించటానికి ఏముంటుందీ?తాను మెమన్ అభిమాని కాదట,కేవలం రోహిత్ అభిమానియే నట!మరి ఆ రోహిత్ ఏమి చేశాడు?ఇంటికో మెమన్ లాంటి ఉగ్రవాదిని పుట్టించమని ఈ దేశపు తలిదండ్రులకి సలహా ఇచ్చాడు,అవునా కాదా?రాజ్ దీప్ సర్దేశాయి స్మృతి ఇరానీ గురించి కూడా తెగ పొగిడేశాడు,ఆవిడ వక్తృత్వ నైపుణ్యం గురించీ,విషయంలో ప్రస్తావించినవన్నీ కరెక్టే కావచ్చు -ట,కానీ అంత దూకుడు పనికిరాదని శరద్ పవార్ ఇచ్చిన అసళా పాటించితే బావుంట్టుంది -ట!

వీళ్ళంతా ఎందుకు స్మూత్ అయ్యారో తెలుసా!పాంచ పటాకా ఎన్నికల్లో జనం ముందు మేము మెమన్ అనె ఉగ్రవాదిని పొగిడాం అని చెప్తే వోట్లకి బదులు చెప్పులు పడతాయని తెలుసు గనక.

Anonymous said...

@ Haribabu
No use, the mesg had gone to the people already. It is difficult now 4 CPM in Benagal

Jai Gottimukkala said...

@Haribabu Suranenii:

"సుప్రీం కోర్టు అఫ్జల్ గురుకి గానీ మెమన్ కి గానీ వేసిన శిక్షలు కరెక్టేనంటాడు,కోర్టు తీర్పుల్ని వ్యతిరేకించటం లేదంటాడు"

ఆయన ఏమన్నాడు?

"We have unstinting faith in the constitution of this country, the laws of this country and the judicial process of this country"

అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పును ఆమోదించడం భారతీయులందరికీ తప్పని సరి. విమర్శించడం సమర్తించడం అనేది ఎవరి ఇష్టం వారిది. Accepting the verdict does not mean agreement much less an intoto endorsement of every line of the judgment.


"మళ్ళీ వాటిని చర్చించటానికి స్వేచ్చ కావాలంటాడు - తీర్పు కరేక్టే అన్నాక ఇంక చర్చించటానికి ఏముంటుందీ?"

తీర్పును సమర్తించిన వ్యక్తులు కూడా అందుట్లో ప్రతి వాక్యాన్నీ అంగీకరించాలని లేదు. కన్నయ్య తాను తీర్పును సమర్తిస్తున్నానని అన్నట్టు నాకెక్కడా అగుపించలేదు.

ఇకపోతే కన్నయ్య ఉపన్యాసంలో నాకు నచ్చిన అంశాలు:

"I want to ask that leader – is that youth a brother to you? The thousands of farmers who are committing suicide, who grow grain for us and our youth on the border; farmers who are fathers to these youths – do you have anything at all to say about that, about them? I want to tell that leader the farmer who works in the field is my father, and it is my brother who joins the army. By erecting this binary don’t you go creating a false debate in the country – because those who die for the country die within the country and also on the borders of this country"

"Those who fight are not responsible; the ones who make them fight are the ones who are accountable.… Who takes responsibility for this war, who makes people fight? See how my father is dying, how my brother is dying. I put this question to the two-bit primetime anchors who create this binary all the time"

"Can you wield your lathi at will, I asked.

No, he admitted. On being asked who has the most power his answer was, ‘the ones issuing fake tweets’!"

మండల వ్యతిరేక పోరాట యోధుడు రాజీవ్ గోస్వామి & తెలంగాణా అమరవీరుడు శ్రీకాంతాచారి తరువాత ఇంతగా దేశాన్ని ప్రభావితం చేసిన కన్నయ్యను మెచ్చుకోకుండా ఉండలేము. The nation can benefit from his obvious energy, integrity & industry if these can be channeled well.

Anonymous said...

భర్ఖా దత్ ఒక ఇస్యును తీసుకొని మొదట ప్రచారం ప్రారంభిస్తే, రాజ్దీప్,సాగరిక దాని పై మాట్లాడారంటే, ఐటేం గర్ల్ శోభ డే ట్వీట్ చేసిందంటే, వాళ్లకి పాకిస్థాన్ నుంచి అసైన్ మెంట్ వచ్చిందని అర్థం.

Anonymous said...

తెలంగాణా అమరవీరుడు శ్రీకాంతాచారి

@ జై, గున్న ఏనుగులా దిట్టంగా శ్రీకాంతా చారి ఉన్నాడు. వాడిని అమరవీరుడంటావేమిటి భయ్యా? వరూధిని బ్లాగు లో హరిబాబు తో చెప్పాలె, చెప్పాలి అనేదాని పై వారం క్రితమే కొట్టుకొన్నారు.

Post a Comment