Pages

Saturday, March 19, 2016

ఇదీ జేఎన్‍యూ అంటే..! ఇదీ చర్చా సంస్కృతి అంటే..!

ఇక్కడ ఇస్తున్న వీడియో లింక్ టైటిల్‌కి దానిలోపల విషయానికి కాస్త వ్యత్యాసం ఉన్నట్లుంది. జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య రాజద్రోహ నేరారోపణపై అరెస్టై మూడు వారాల తదుపరి విడుదలైన సందర్భంగా చేసిన  చారిత్రక ప్రసంగంలో అజాదీ గురించి మాట్లాడిన విషయాలపై జేఎన్‌యూ ప్రొఫెసర్ మకరంద్ పరాంజపే మరొక వీడియోలో విమర్శించారు.

కానీ ఇక్కడ ఈ టైటిల్‌తో రూపొందిన ఈ  వీడియో లింకులో జేఎన్‌యు లోపల అంతర్గతంగా ఎలాంటి చర్చలు  జరుగుతున్నాయో, వంద విరుద్ధ భావాలు అక్కడ ఎంత తీవ్రస్థాయిలో, ప్రజాస్వామికంగానే ఘర్షిస్తున్నాయో. అక్కడి విద్యార్థులు, అధ్యాపకుల మధ్య దేశంలోనే ఎక్కడా లేనంత మనోహర చర్చాసంబంధాలు పాతుకుని ఉన్నాయో ఈ వీడియో తొలినుంచి చివరివరకు చాలామంది కళ్లు తెరిపించేలా చూపిస్తోంది. ఒక్కసంవత్సరమైనా జేఎన్‌యూలో  చర్చావాతావరణంలో గడపాలనే కోరిక యూనివర్శిటీ విద్య ముగించిన ముప్పై ఏళ్ల తర్వాత నాకే మళ్లీ పుడుతోంది.

అక్కడ హిందువు మాట్లాడతాడు. అంబేద్కరిస్తులు మాట్లాడతారు. మనుధర్మ మద్దతుదారులు మాట్లాడుతారు. దాని వ్యతిరేకులు మాట్లాడతారు, సిక్కులు మాట్లాడతారు. ముస్లింలు మాట్లాడతారు. చివరికి చైనీయులు కూడా మాట్లాడతారు. ఒక కమ్యూనిస్టు సవాలు చేస్తే ఒక స్వతంత్ర మేధావి జవాబు చెబుతాడు. విద్యార్థుల మధ్య చర్చలు, ప్రశ్నలు, అధ్యాపకులు జవాబులు, సవాళ్లు ఇంత జరిగినా చర్చలో పాల్గొన్నవారి మధ్య సామరస్య వాతావరణం దెబ్బతినకుండా చూసే విద్యార్థి సంఘం నేతలు.. ఏమి జీవితమది?

'తత్వశాస్త్రాన్ని క్లాసురూముల్లోంచి బయటకు లాగండి. చీకటి గదులనుంచి బయటకు లాగండి' అంటూ చైనా కమ్యూనిస్టు పార్టీ అధినేత మావో సేటుంగ్ చేసిన వ్యాఖ్యానానికి అచ్చు గుద్దినట్లుండే వాతావరణం జేఎన్‌యూలో కనబడుతోందిప్పుడు. అక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు క్లాసురూముల్లో క్లాసులు చెబుతున్నారో, పాఠాలు వింటున్నారో తెలియదు గానీ జేఎన్‌యూ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వద్ద ప్రతి సాయంత్రం జరుగుతున్న చర్చాగోష్టులకు మాత్రం వందలాది మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరవుతున్నారు. దేశంలోనే ఏ యూనివర్సిటీలోనూ లేనంతగా 60 శాతం మంది విద్యార్థినులే ఉంటున్న జేఎన్‌యూలో ప్రతి సభ, ప్రతి చర్చాగోష్టిలో విద్యార్థినులదే ఆధిక్యం. విద్యార్థులపై రాజద్రోహం కేసు మోపడానికి ముందు కూడా సంవత్సరాలుగా జేఎన్‌యూ తన చర్చా సంప్రదాయాన్ని ఏమాత్రం వదులుకోలేదు.

జేఎన్‌యు వెలుపల వున్న మనం. కొన్ని అజ్ఞాత కేకలు, నినాదాలతో భారత ఉనికికే భంగం ఏర్పడిపోయినట్లుగా ఉన్మత్తోన్మాద విభజనతో చీలిపోయి.. దేశభక్తి, దేశద్రోహం గురించి కాట్లాడుకుంటున్న మనం.. కాస్త ఓపిక తెచ్చుకుని జేఎన్‌యు అసలు సంస్కృతి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఎంత బాగుండేదో.. దేశద్రోహ కేసుల సాక్షిగా, మన పిల్లలపైకి ఎక్కుపెట్టిన కండోమ్‌ల సాక్షిగా ఒక్క విషయం మాత్రం నేడు స్పష్టమవుతోంది. జేఎన్‍‌యూ చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఐకమత్యం ఇవ్వాళ అక్కడి విద్యార్థులు, అధ్యాపకుల మధ్య ఏర్పడిపోయింది. జేఎన్‌యూపై అనరాని మాటలను ప్రయోగించి పైశాచికానందాన్ని పొందిన వారెవ్వరూ ఇకపై జేఎన్‌యూ ఈక కూడా పెరగలేనంత దృఢమైన బంధం అక్కడి అణువణువులోనూ పాతుకుపోయింది.

ఈ వీడియో మొత్తం ఇంతవరకు అంటే ఈ రోజు తెల్లవారు జాము వరకు చూశాను. ఇప్పుడు జేఎన్‍యూ మొత్తం మీద మారుమోగుతున్న  నినాదం ఒక్కటే.. అర్భకులమీద రాజద్రోహాన్ని ఆరోపించవద్దనే. చదువుకోసం వచ్చిన విద్యార్థినీ, విద్యార్థులపై కండోమ్ బాణాలను విసరవద్దనే.. కశ్మీర్ విముక్తి, భారత్‌ని ముక్కలు చేస్తాం అంటూ బయటివారు, ముసుగులోని వ్యక్తులు కొద్దిమంది మాట్లాడిన మాటలవల్లే జేఎన్‌యూ ఇంత అపనిందలను ఎదుర్కోవలసి వచ్చిందని.. (నా క్యాంపస్‌ను కొద్దిమంది హైజాక్ చేశారని అందుకే ఇంత సమస్య తలెత్తిందని) మాలో మాకు ఎవ్వరికీ విభేదాలు, తగాదాలు అసలు లేవని.. కమ్యూనిజాన్ని తన కోణంలో మేధోవంతగానే విమర్శించే ప్రొఫెసర్ మకరంద్ పరాంజపే సైతం ఈ వీడియోలో ప్రకటించారంటే జేఎన్‌యూ ఏ విశిష్ట వారసత్వంతో కొనసాగుతోందో అర్థమవుతుంది. జిహాదిజం అనేది సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నిస్తోంది కనుక ఆ కోణంలో జిహాద్‌ని కూడా సపోర్టు చేస్తానని పరాంజపే ప్రకటించారంటే అది జేఎన్‌యూకే సాధ్యం.

ఒకవైపు కమ్యూనిస్టులూ, మరొకవైపు ఆరెస్సెస్ శక్తులూ, మరోవైపు అంబేద్కరిస్టులూ నిత్యం చర్చిస్తున్న, ఘర్షిస్తున్న జేఎన్‌యూలో.. పార్టీలతో సంబంధంలేని స్వతంత్ర మేధావులు, గ్రాంసీ ఏనాడో పేర్కొన్న ఇండిపెండెంట్ ఇంటలెక్చువల్స్ ఉండాలని కోరుతున్న ప్రొఫెసర్ పరాంజపే మాటల్ని అక్కడి విద్యార్థులు తమ భావాలను, పార్టీలతో బంధాలని పక్కనబెట్టి మరీ స్వాగతించడం వింటూంటే రోమాంచిత స్ఫూర్తి కలుగుతోంది.

అలాంటి జేఎన్‌యూపై ఇకనైనా నిందలు మోపడాన్ని మానుకుందాం. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఎఫ్‌ఎస్‌లు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, టీచింగ్ వంటి సకలరంగాల్లో జేఎన్‌యూ ప్రోడక్ట్స్ గత 60 ఏళ్లుగా తమ ప్రభావం చూపుతూనే ఉన్నారు. ఒక ఉత్కృష్ట చర్చా సంస్కృతికి, వారసత్వానికి నిలయమైన జేఎన్‌యూపై మరక చల్లడాన్ని ఇకనైనా ఆపేద్దాం.

జేఎన్‌యూని జేఎన్‌యూలాగే ఉండనిద్దాం. జేఎన్‌యూని దాని మానాన దాన్ని ఉండనిద్దాం. ఈ దేశానికి దానివల్ల ఉపయోగం ఉందో లేదో ఈ జాతి మొత్తానికే తెలుసు కానీ.. జేఎన్‌యూ వల్ల ఎలాంటి అపకారం దేశానికి జరగలేదని, జరగదని, జరగబోదని నా ప్రగాఢ విశ్వాసం. గత నెలరోజుల పైగా ప్రతిరోజూ జెఎన్‌యూ పరిణామాలను నిద్రమేలుకుని మరీ గమనిస్తున్న, చూస్తున్న నాకు ఈ అభిప్రాయం తప్ప మరేదీ కలగలేదంటే నేను దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు కాదు. జేఎన్‌యూని సపోర్ట్ చేసినంత మాత్రాన నేను దేశద్రోహిని అయిపోను.

నాదొక్కటే బాధ. పదవ తరగతి పూర్తయ్యాక ఇక వద్దు బాబో అంటూ హిందీని వదిలేశాను. ఇన్నేళ్ల తర్వాత నేను ఎంత తప్పు చేశానో ఇప్పుడే అర్థమవుతోంది. భాషలను వ్యతిరేకించడం, ఆధిపత్య భాష సాకుతో ఒక నిర్దిష్ట భాషకు దూరమవటం ఎంత అర్థరహితమో ఇప్పడు అర్థమవుతంది.

జేఎన్‌యూలో అంతర్గత చర్చా సంస్కృతి ఎంత దివ్యంగా విరాజిల్లుతోందో అర్థం చేసుకోవడానికి కింది వీడియో లింకును తెరచి చూడగలరు. మరోసారి చెబుతున్నాను. ఈ వీడియో టైటిల్‌కి దాని లోపలి విషయానికి సంబంధం లేదు.

JNU Professor Makarand Paranjape Slams Kanhaiya Kumar on his 'Azadi' Speech (VIDEO)

https://www.youtube.com/watch?v=-V6T_jjiVLw

ప్రొఫెసర్ మకరంద్ పరాంజపే జాతీయవాదంపై చేసిన పూర్తి పాఠం ఇక్కడ చూడగలరు.
Lecture on Nationalism #15th by Makarand Paranjape





8 comments:

Anonymous said...

మీ బ్లాగు లో రాసే కామెంట్లకు మీ నుంచి జవాబే ఉండదు. కనీసం మీ బ్లాగుని మీరు చదువుతున్నారో లేదో కూడా తెలియదు. మీరు చర్చా సంస్కృతి గురించి మాట్లాడితే ఎలా?

Anonymous said...

బావుంది JNU చర్చా సంస్కృతిని పొగడటం. మరి ఇంత ఓపెన్ యూనివర్శిటీ క్రితం ఏడాది బాబా రాందేవ్‍ని ఎందుకు రానీయలేదు, మాట్లాడనీలేదు. ఎవరో బయటివాళ్ళు వచ్చి దర్జాగా దేశద్రోహ నినాదాలు ఇచ్చి చక్కగాపోగలరు, దాంతో మాకు సంబంధంలేదని ఇప్పుడు వీళ్ళు దబాయించగలరు. కానీ వీళ్ళు వ్యతిరేకించే భావజాలానికి చెందినవారు రాకూడదు, మాట్లాడకూడదు. అసలు కమ్యూనిస్టులకి(ఆ మాటకొస్తే ఏ భావజాలానికైనా) ఆటపట్టు అనిపించుకున్న సంస్థ ఓపెన్ మైండెడ్‍నెస్ గురించి మాట్లాడటం అనవసరం.

hari.S.babu said...

Mr. Raja Sekhara Raju,
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఎన్నికల్లో "మేము యాకూబ్ మెమన్ పేల్చిన బాములు చంపీన్ 300 మంది అమాయకుల కన్నా యాకూబ్ మెమన్ ఉరికే ఎక్కువ అల్లాడిపోయాం" అని చెప్తే పాంచ్ పటాకా ఎన్నికల్లో ఓట్లు పడవు గాబట్టి అందరూ గప్ చుప్ అయిపోయారు:-)

కానీ యాకూబ్ మెమన్ నిజంగా వీళ్ళు అంత జాలిపడదగిన వాదేనా!వాదేమీ పాకిస్తాను నుంచి పొట్తచేత అప్ట్టుకుని వాతే ఇక్కడి హిందూ మతోన్మాదులు అతడి మీద కక్షగట్టి ఉరి తియ్యలేదే?
--------------------
కుటుంబగాథ గమనించండి - వీళ్ల తండ్రి సింగిల్‌ రూమ్‌ ఎపార్ట్‌మెంటులో వుండేవాడు. డబ్బు లేదు. అయినా పిల్లల్ని ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చదివించాడు. ఆరుగురు అన్నదమ్ముల్లో మూడోవాడైన యాకూబ్‌ అందరి కంటె తెలివైనవాడు. గబగబా చదువుకుని చకచకా ఎదిగిపోయి చార్టెర్డ్‌ ఎకౌంటెంట్‌ అయిపోయి బోల్డు గడించేసి స్వార్థంతో విడిగా వెళ్లిపోకుండా జాయింటు ఫ్యామిలీలో వుంటూ కుటుంబసభ్యులందరికీ సర్వసౌఖ్యాలు సమకూర్చాడు. పెద్ద బిల్డింగులో ఓ మంచి ఎపార్ట్‌మెంటుకు మారడమే కాదు, దాన్ని కొనేసి, దానితో బాటు ఆ బిల్డింగులో యింకా కొన్ని ఫ్లాట్లు కూడా కొనేశాడు. ట్రావెల్‌ ఏజన్సీ వంటి వేరే వ్యాపారాలు కూడా మొదలుపెట్టించాడు.

బొంబాయి పేలుళ్ల వంటివి ప్లాను చేయడానికి ఎన్నో రోజులు పడుతుంది. మనుష్యులు కావలసి వస్తారు, డబ్బు కావలసి వస్తుంది. ఇవన్నీ సమకూర్చుకునే టైములో మానవసహజమైన ఆవేశం వుంటే చల్లారిపోతుంది. చల్లారలేదంటే అతనిలో రాక్షసత్వం వున్నట్లే!

1993 మార్చిలో వరుస పేలుళ్లు జరిగాయి. 257 మంది పోయారు. 713 మంది గాయపడ్డారు. నవంబరులో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. టాడా కోర్టులో కేసు విచారణ 1995లో ప్రారంభమైంది. సాక్షులు 684 మంది వున్నారు కాబట్టి వారి విచారణకు ఐదేళ్లకు పైగా పట్టింది. ఆ తర్వాత వాదోపవాదాలు మరో మూడేళ్లు. ఆ తర్వాత మూడేళ్లకు తీర్పు. అంటే 2006 సెప్టెంబరుకి తీర్పు వచ్చింది. 23 మందిని నిర్దోషులుగా వదిలేసి 100 మంది నేరం చేశారంది. 2007 జులైలో యాకూబ్‌తో సహా 12 మందికి ఉరిశిక్షలు, 20 మందికి యావజ్జీవ శిక్ష. టాడా కోర్టు వేసిన శిక్షలపై సుప్రీం కోర్టులో అప్పీలుకి వెళ్లారు. 2013 మార్చికి సుప్రీం కోర్టు యాకూబ్‌కు ఉరిని ఖరారు చేసింది. పదిమంది విషయంలో యావజ్జీవశిక్షగా మార్చారు.

పదిమంది విషయంలో ఉదారంగా వున్న సుప్రీం కోర్టు యితని విషయంలోనే కఠినంగా ఎందుకు వుంది? ఆ పదిమందీ కూడా తమను టైగర్‌ మెమన్‌ రిక్రూట్‌ చేసుకున్నాక, యాకూబ్‌కు అప్పగించాడనే చెప్పారు. మొత్తం 19 మందిని రిక్రూట్‌ చేసుకుని వాళ్లందరినీ దుబాయి, పాకిస్తాన్‌లకు పంపి మారణాయుధాల్లో ట్రైనింగ్‌ యిప్పించడం, అక్కడి బస, తిండి, ప్రయాణం ఏర్పాట్లు చూడడం, బాంబులు పేల్చి సాధ్యమైనంత ఎక్కువ మందిని చంపడానికై బొంబాయిలో స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు, సినిమా హాలు, బజారు వంటి జనసమ్మర్దం వున్న ప్రాంతాలను నిర్ధారించడం, పేలుడు పదార్థాలు నింపిన బ్యాగులను అవసరమైన చోటికి చేర్చడం, ఈ ఆపరేషన్‌కై హవాలా ద్వారా చేరిన నిధులు ఖర్చు చేయడం - యివన్నీ యాకూబ్‌ చూసుకున్నాడని వాళ్లు చెప్పారు. అంటే తక్కినవాళ్లు పాత్రధారులు కాగా, టైగర్‌, యాకూబ్‌ సుత్రధారులని కోర్టుకి నమ్మకం చిక్కింది. 1993లో జనవరిలో దుబాయిలో జరిగిన ధ్వంసరచన సమావేశంలో అతను పాలుపంచుకున్నాడని కోర్టు నమ్మింది.
వాళ్ళ హృదయవైశాల్యం గురించి మీరు డప్పు కొట్టడం దేనికి గానీ పై మొత్తం యాకూబ్ మెమన్ వాస్తవ గాధ చదివారు కదా!మీరు వీటికి జవాబులు చెప్ప్పండి ఒపెన్ మైండుతో!

1. గట్టిగా ఎవరు నిలదీసినా "మేము యాకూబ్ మెమన్ అమాయకుదని అనట్లేదు,ఉరిశ్క్ష గురించే అల్లాడిపోతున్నాం" అనేఎ ఉరిశిక్షల గణాంకాలన్నిట్నీ ఎత్తి చూపిస్తూ ఎక్కువగా దళితులూ,ముస్లిములే ఉరికి గురయ్యారు అంటూ పిట్టకధలు చెప్తారు కదా, ముంబై బాంబు పేలుళ్ళ కేసులో యాకూబ్ మెమన్ కాక మిగిలిన పదిమంది పేర్లూ చెప్పగలరా మీరు?వాల్లవి ప్రాణాలు కావా? కోర్టు తీర్పు గురించి ఇవ్వాళ వంకలు పెట్టి దాని గురించి చర్చించటం తప్పు కాదుగా అంటున్నారు కదా,అనత లా పరిజ్ఞానమే ఉంటే కేసు నడుస్తున్నప్పుదే వాళ్ళ తరపున వెల్ళి వాదించి వాళ్ళని ఉరి నుంచి తప్పించే అవకాశం ఉంది కదా,ఎందుకు ఉపయోగించుకోలేదు?

2. అగ్గిబరాటా రోహిత్ దగ్గిర్నుంచీ మీతో సహా యాకూబ్ మెమన్ అనేవాణ్ణి హిందూ మతోన్మాదూలంతా కుట్ర చేసి ఉరితీస్తున్నట్టు కలరు పులమతంలోనే మునిగిపోయారు గానీ ఆ పదిమందీ ఎవరో ఆలోచించారా? దబ్బుండి కూడా తన మూలంగా ఉరికి గురయిన వాళ్ల గురించి పట్టించుకోని కటిక స్వార్ధపరుడి గురించి మీరంత ఆందోళన పడడం వెంక అర్ధమేమిటి?

3.ఇలాంటివాళ్లని కూడా వెనకేసుకు రానిస్తేనే దేసంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నట్లా? ఇలాంటివాళ్లని సమర్ధించకండి అనడమే హిందూమతోన్మాదవర్గాలాధిపత్యధోరణి అయిపోయిందా మీ దృష్టిలో?

kanthisena said...

Mr. Haribabu

చాలా ఓపికగా మీరు ప్రచురించిన వ్యాఖ్య చూశాను. కాని ఇంత క్లాస్ నాకెందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు.

"ఎన్నికల్లో "మేము యాకూబ్ మెమన్ పేల్చిన బాములు చంపీన్ 300 మంది అమాయకుల కన్నా యాకూబ్ మెమన్ ఉరికే ఎక్కువ అల్లాడిపోయాం" అని చెప్తే పాంచ్ పటాకా ఎన్నికల్లో ఓట్లు పడవు గాబట్టి అందరూ గప్ చుప్ అయిపోయారు"

నాకు పార్లమెంటరీ ఎన్నికలపై ఎలాంటి ఆసక్తీ లేదు. ఓట్లు దొబ్బించుకోవడానికి ఒక మాట, రెచ్చగొట్టి ప్రజాభిప్రాయాన్ని హైజాక్ చేయడానికి ఒక మాట, లోపలా బయటా ఎజెండాలతో ముసుగు పోరాటాలు చేయడానికి ఒక మాట మాట్లాడటం నాకు అలవాటు లేదు. పైగా ఆ అవసరం నాకు ఇసుమంతయినా లేదు. పాంచ్ పటాకా ఎన్నికల గురించి, వాటిలో పాల్గొనే నానా రంగుల పార్టీల గురించి వాటితో సంబంధం ఉన్నవారితోనే చర్చించండి. ఈ కొత్త పోరాటంలోకి నన్ను లాక్కండి.

(యాకూబ్ మెమన్) ..." కుటుంబగాథ గమనించండి - వీళ్ల తండ్రి సింగిల్‌ రూమ్‌ ఎపార్ట్‌మెంటులో వుండేవాడు. డబ్బు లేదు. అయినా పిల్లల్ని ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చదివించాడు."

అంటే సింగిల్ రూమ్ ఎపార్ట్‌మెంట్లో ఉండేవాళ్లు, డబ్బులేని వాళ్లు పిల్లల్ని ఇంగ్లీషు స్కూళ్లలో చదివించకూడదన్నమాట. ఇంగ్లిషు రాకపోతే బతుకే లేదు అనే భయాలను నరనరాన ప్రవేశపెట్టిన తర్వాత మన దేశంలో సింగిల్ అపార్ట్‌మెంటులో ఉండేవాళ్లే కాదు.. పూరి గుడిసెల్లో ఉండేవారు కూడా గత రెండు దశాబ్దాలుగా కాన్వెంట్లలోనే చదివిస్తున్నారని ఎన్నో సందర్భాల్లో పత్రికలు రాశాయి. మీ ఉద్దేశంలో మీలాంటి భద్రలోగ్ జీవులు తప్ప ఇంకెవరూ ఇంగ్లీష్ చదువులు కోరుకూకూడదన్నమాట. మాల్యాలు, అంబానీలు, వారి పుత్ర పుత్రికలు, వారి దోపిడీ విజయగాధలను వింటూ తరిస్తూ ఉండేవారు తప్ప మరెవ్వరికీ ఈ దేశంలో బలవంతంగా రుద్దుతున్న ఇంగ్లీషు చదువులను చదివే యోగ్యత, అర్హత లేదన్నమాయ. చాలా తెలివిగా మనువాదానికి చేస్తున్న కొత్త వ్యాఖ్యానమే ఇది.

"వాళ్ళ హృదయవైశాల్యం గురించి మీరు డప్పు కొట్టడం దేనికి గానీ పై మొత్తం యాకూబ్ మెమన్ వాస్తవ గాధ చదివారు కదా!మీరు వీటికి జవాబులు చెప్ప్పండి ఒపెన్ మైండుతో!"

యాకూబ్ మెమన్ వాస్తవ గాధ చదివారు కదా మీరు వీటికి జవాబులు చెప్పండి ఓపెన్ మైండ్‌తో అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మీలా వ్యంగ్యంగా డామినేట్ చేయాలంటే నాకూ సవాలక్ష మార్గాలున్నాయి. కాని మీ మార్గం నాకు అవసరం లేదు.

జేఎన్‌యూ విద్యార్థుల, అధ్యాపకుల హృదయ వైశాల్యం గురించి డప్పు కొట్టడం దేనికి అంటూ ఘనమైన వ్యాఖ్య చేశారు. నేను అక్కడి తాజా పరిస్థితిని వీడియోల్లో చూసి నా అభిప్రాయాన్ని చెప్పాను. దాన్ని డప్పు కొట్టడంలాగా మీకు కనిపిస్తే అది మీ ఖర్మే కానీ నా ఖర్మ కాదు.

యాకుబ్ మెమన్ వాస్తవ గాథ ఇంత సుదీర్ఘంగా చెప్పి మీరు నన్ను భయపెట్టలేరు. ఇంకో వందమంది యాకుబ్ మెమన్‌లను అప్జల్ గురులను, చివరికి మాయా కొద్నాని వంటి గుజరాత్ నరహంతకిలకు రాజ్య యంత్రాంగం ఉరి వేసినా సరే.. అప్పటికీ ఉరిశిక్షకు వ్యతిరేకంగానే మాట్లాడతాను. ప్రపంచంలో ఉరిశిక్షను రద్దు చేసిన వందకుపైగా దేశాల వాణిని నేను ఎన్నటికీ ఎత్తిపడతాను.

kanthisena said...

వ్యాఖ్య బాక్సులో అక్షరాల పరిమితి దాటడంతో మిగతాది ఇక్కడ ప్రచురిస్తున్నాను

"అగ్గిబరాటా రోహిత్ దగ్గిర్నుంచీ మీతో సహా యాకూబ్ మెమన్ అనేవాణ్ణి హిందూ మతోన్మాదూలంతా కుట్ర చేసి ఉరితీస్తున్నట్టు కలరు పులమతంలోనే మునిగిపోయారు గానీ ఆ పదిమందీ ఎవరో ఆలోచించారా? దబ్బుండి కూడా తన మూలంగా ఉరికి గురయిన వాళ్ల గురించి పట్టించుకోని కటిక స్వార్ధపరుడి గురించి మీరంత ఆందోళన పడడం వెంక అర్ధమేమిటి?"

పై వ్యాఖ్య నన్నడుగుతున్నారా లేదా జేఎన్‌యూ వాళ్లను అడుగుతున్నారా నాకర్థం కావడం లేదు.

యాకూబ్ మెమన్‌ని చంపడం తప్పా రైటా అనే అంశంపై చర్చ అంత సులభంగా ముగియదు కానీ, తాను అప్రూవర్‌గా మారతానని, ప్రాణ బిక్ష పెట్టాలన్న హామీ పొందాకే యాకుబ్ భారత నిఘా అధికారుల ముందు లొంగిపోయాడని వాగ్ధాన భంగం చేయడం ద్వారా భారత్ భవిష్యత్తులో ఏ ఒక్కరూ అప్రూవర్‌గా రావడానికి సాహసించరని స్వయాన సీనియర్ మోస్ట్ భారతీయ నిఘా అధికారి వ్యాఖ్యానించిన మాటలు మీ చెవినబడ్డాయో లేదో మరి. కానీ ఇచ్చిన మాటను తప్పకుండటం అనే గొప్ప భారతీయ సంప్రదాయాన్ని భారత రాజ్యమే ఉల్లంఘించిన కళంకాన్ని సంపాదించుకుంది. తాను అప్రూవర్‌గా ఇండియాకు వెళతానని తమ్ముడు చెబితే వద్దని, వారు నిన్ను ప్రాణాలతో వదలిపెట్టరని చెప్పిన దావూద్ మాటనే మన గొప్ప భారత్ నిజం చేసింది. యూకూబ్ భారత్‌ను దాని నిఘా అధికారులను నమ్మాడు. దావూద్ నమ్మలేదు. ఇక్కడ నమ్మకం ఓడిపోయింది. అపనమ్మకమే గెలిచింది. ఇదీ మన ఘనమైన సంప్రదాయం సాధించిన ఘనత. మీరు ఎద్దేవా చేసిన ఆ హృదయ వైశాల్యపు మనుషులు దీన్నే ప్రశ్నిస్తున్నారు.

"ఉరిశిక్షల గణాంకాలన్నిట్నీ ఎత్తి చూపిస్తూ ఎక్కువగా దళితులూ,ముస్లిములే ఉరికి గురయ్యారు అంటూ పిట్టకధలు చెప్తారు కదా"

ఇది మీ మరొక వ్యంగ్యాస్త్రం. పచ్చి నిజాలే కానీ ఇవి పిట్ట కథలెందుకవుతాయి? ముస్లింలను, దళితులను ఉరితీయడానికి మహా క్రియాశీలంగా వ్యవహరిస్తున్న న్యాయ, పాలనా వ్యవస్థలు మాయా కొద్నానిని ఎందుకు వదిలేశాయి. పంజాబ్ ముఖ్యమంత్రిని చంపిన హిందూ హంతకులను ఎందుకు వదిలేశాయి. సాక్షాత్తూ అకాలీదళ్ ముఖ్యమంత్రే వారికి శిక్ష తగ్గించమని ఎందుకు పిటిషన్ పెట్టాడు. వారు హిందువులనేనా? రాజీవ్‌గాంధీనే హతమార్చిన ఘటనలో చిక్కిన మన దేశ హిందువులకు విధించిన మరణ శిక్షను యావజ్జీవంగా మార్చడంతో చాలక పాతికేళ్లు జైలు శిక్ష అనుభవించారు కనుక వారిని విడుదల చేయమంటూ జయలలిత ప్రభుత్వమే ఎందుకు కేంద్రంతో రాయబారాలూ, బేరసారాలూ సాగిస్తోంది. వారు హిందువులు కనుకేనా? మాలెగావ్ బాంబు పేలుళ్లకు కారకులైన భారత సైన్యంలో పనిచేసే అధికారికి, సహకరించిన సాధ్వికి ఏ శిక్షలూ ఉండవు.

పిట్టకథలు ఎవరు చెబుతున్నారా ఇప్పుడయినా మీకు అర్థమయిందా?

ఇక్కడ నాదొక వివరణ. ముఖ్యమంత్రిని చంపిన, రాజీవ్ గాంధీని చంపిన, మాలెగావ్‌లో పేలుళ్లకు బరితెగించిన హిందూ నేరస్తులను కూడా ఉరితీయవద్దన్నదే మావంటి వారి అభిప్రాయం. మతం, పేదరికం ప్రాతిపదికన ఈ దేశంలో కొందరిని ఉరితీస్తున్న న్యాయవ్యవస్థ అన్యాయం ఉండకూడదనే మా కోరిక. ఉరిని ఎందుకు వ్యతిరేకిస్తున్నామో మీవంటివారికి ఎన్నిసార్లు చెప్పినా మీరు వినడానికి సిద్ధం కారు. పదే పదే అవే మొండివాదాలు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం?

"ఇలాంటివాళ్లని కూడా వెనకేసుకు రానిస్తేనే దేసంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నట్లా? ఇలాంటివాళ్లని సమర్ధించకండి అనడమే హిందూమతోన్మాదవర్గాలాధిపత్యధోరణి అయిపోయిందా మీ దృష్టిలో?"

లౌకికవాదాన్ని జీవిత పర్యంతం పాటించిన, మూఢ విశ్వాసాలను చివరివరకు ప్రతిఘటించిన కల్బుర్గిని, దభోల్కర్‌ని నడిరోడ్డుపై కాల్చి చంపిన ముష్కరులను కూడా మీరు సమర్థించకండి. మాకిష్టం కానిది తింటే, మేం వ్యతిరేకించే పనులు చేస్తే నరికిపారేస్తామంటున్న బరితెగింపు నరుకుడు గాళ్లను సమర్థించకండి. ఈ దేశం కాస్త శాంతిగా బతకడానికి కనీసం ఈ పని చేయండి చాలు. హిందూమతం పేరిట, హిందూ సంస్కృతి పేరిట సాగిస్తున్న ఈ ఉన్మాద చర్యలే ప్రజాస్వామ్యానికి ప్రమాదం. వీటి మీద మీలాంటి వాళ్లు ఒక్క మాట కూడా మాట్లాడరు కాని కొందరిని మాత్రం సమర్థించకండి అంటూ ధర్మపన్నాలు చెప్పడానికి మాత్రం సిద్ధమైపోతారు. ఏం ప్రజాస్వామ్యం, సంస్కృతి అండీ మీది?

వ్యక్తిగతంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి, గాయపర్చడానికి నేను ఇలా వ్యాఖ్యానించడం లేదు. మీరనుకుంటున్న సత్యం లాగే మే మనుకుంటున్న సత్యం కూడా అంతే సూటిగా, అంతే నిష్కర్షగా ఉంటుందని మీరు గ్రహిస్తే చాలు.

నేను మీ వ్యాఖ్యకు సకాలంలో స్పందించలేదు కాబట్టి మీరు దీన్ని చూస్తారో లేదో తెలియదు. అదొక్కటే నేను విచారించవలసిన విషయం.

hari.S.babu said...

పిట్టకధలు అనే మాట కంటపడగానే నేను ఏదో బూతుమాట వాడినట్టు ఖోపం తెచ్చేసుకుని ఇంతఘా వెఖ్ఖ్కిరిస్థాడా దళితుల్నీ ముస్లిముల్నీ అని దొరికిపోయిన హరిబాబు మీద ఖారాలూ మిరియాలూ నూరడంలో యాకూబ్ మెమన్ ఇరికించిన పదిమంది పేర్లు అడిగానని మర్చిపోయినట్టున్నారు!

మీడియా హఠాత్తుగా రోహిత్ గురించి గానీ కనయ్య గురించి గానీ వార్తలు రాయడం మానేసి గుప్ చుప్ అయిపోయింది,గమనించారా?నేను దాని గురించి అన్నాను అలా చల్లబడటం ఎందుకో మీకూ తెలుస్తుంది తొందర్లోనే!ఎన్నికల ప్రచార సభల్లో రోహిత్ పేరు ఎత్తితే అప్పుడు చూద్దాం దాని రిజల్టు ఎలా ఉంటుందో?!

ఇంతకీ నాకొకటి చెప్పండి,రోహిత్ ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసిపెట్టి పోయినా దాన్ని హత్యగా భావించి హంతకుణ్ణి పట్టుకుని శిక్షించాలంటున్నారు కదా - అంత స్పష్తంగా "నా చావుకి ఎవరూ బాధ్యులు కారు" అని రాసి మరీ చనిపోయిన సందర్భంలో ఎవరినయినా హంతకుడిగా గుర్తించాలంటే అతను ఉత్త్రంలో ప్రస్తావించాలి,అవునా కాదా!చదవగలిగే భాగమంతా కవిత్వంతో నిండి ఉంది కానీ,రాసి కొట్టేసిన భాగంలో చాలా సూటిగా SFI,ASA రెంటిని గురించీ అంత తీవ్రంగా వ్యాఖ్యానించాడు గదా,హంతకులుగా వాళ్లని తప్ప ఇంకెవర్ని నిలబెటగలరు?

కోర్టు తీర్పు వచ్చాక లా పాయింట్లు పట్టే బదులు అంతటి పాండిత్యం ఉన్నవాళ్ళు కేసులో వాదించి గెలిపించి అమాయకుల్ని విడిపించితే ఎవరు కాదంటారు!ఆ ప్రశ్నకీ జవాబు లేదు.

పైగా పెదర్ధాలు!వాడు దబ్బు సంపాదించుకున్నందుకు నేను ఏదవట్లేదు,చార్టర్డ్ అకవుంటెంట్ ఎవరు చెయ్యగలిగినా సంపాదన అట్లాగే ఉంటుందని నాకు తెలుసు,అట్లా సంపాదించాడం గురించి నేనెక్కడా వీమ్ర్శించలేదు కదా!అంత అడబ్బున్నవాడు తను ఇతికించిన వాళ్ళకి కూడా లాయర్లని పెట్టేపాటి అదార్యం లేదు,తన ఒక్కడి ప్రాణం కోసమే పేరు మోసిన లాయర్లందర్నీ ఉపయోగించుకున్నాడు,నాకు ఆ జబ్బుంది,ఈ జబుంది అని వంకలు పెట్టాడు.

ఇక్కడ బాంబులు పెట్టే సమయానికి ఎలిబీ కోసం దేశం దాటిపోవడం తమకి గుర్తురావదం లేదు గానీ అప్రూవరుగా మారుతాననడం,అదీ ఎప్పుడు,అట్లా మారితే శిక్ష తగ్గుతుందని తెలిసి అతితెలివి చూపిస్తూ బేరం పెట్టడం మీకు వాడి ఆదర్శపూరితమైన ప్రవర్తనగా కనిపిస్తున్నది.అట్లయితే నిర్భయ హంతకుడి దగ్గిరుంచీ సల్మాన్ ఖాన్ వరకూ ప్రతివాళ్ళూ ఉపయోగించుకోవచ్చుగా ఈ విధానాన్ని!అంత ప్లాను వేసి నేరం చేసి 300 మందిని చమొఇన అస్రేఅ అప్రూవరౌగా మారితే చాలునా,అతన్ని అరెస్టు చెయ్యడం మోసం చేసినట్టా?నా తెలివి గురించి నాకు ఉబోసలు ఇచ్చేముందు మీరు ఇలాంటి విషయాల్ని గురించి కొంచెం ఆలోచించండి!పైగా మీ వాదనే కాదు,మా వాదనా సూటిగా స్పష్టంగా ఉంటుంది అని బడాయిలు!
చార్టర్డ్ అకవుంటెంట్ అంటే, రాబడి బాగా ఉంటుందని - ఎవరయినా చదివి బాగుపడొచ్చు,దానికేం!బాగుపడొద్దంటారా నై న్నడిగితే ఎట్లా?నేను బాగుపడొద్దని అనలేదే!

కోర్టులు దోషి అన్న అద్వానీకీ శిక్ష పడాల్సినదె,కాదనడం లేదు.అట్లా లింకులు తెస్తే,ఇంగ్లీషు వాళ్ళ పాలనతో పోల్చి అసలు స్వతంత్రాన్నే వెక్కిరిస్తున్నవాళ్ళూ ఉన్నారు.యాకూబ్ మెమన్ అనేవాడు నేరస్తుడా,అమరవీరుడా?

Jai Gottimukkala said...

ప్రస్తుత చర్చలో నాకు అగుపడుతున్న ముఖ్యాంశాలు ప్రస్తావిస్తాను.

1. వామ (కమ్యూనిజం) & దక్షిణ (ఉ. హిందూత్వవాదం) పందాలకు రెంటికీ ఒక్క విషయంలో మాత్రం చాలా దగ్గర పోలిక ఉంది. ఇరువురూ విషయాన్ని తమతమ అభిప్రాయ ధోరణి అనే భూతద్దంలో నుండే చూస్తారు. అస్తిత్వవాద పందాలకు ideology కంటే identity ముఖ్యం. ఇవి ఆలోచనాసరళి చుట్టూ కాక ప్రయోజనాల చుట్టూ తిరుగుతాయి. ఈ ప్రాధమిక తేడాను ideologists on both left & right గుర్తిచలేకపోతున్నారు.

2. పార్టీలు, ఎన్నికలు & ప్రభుత్వాలు ఇవి మాత్రమె రాజకీయం అనుకోవడం అన్ని పార్టీలు & వారి మద్దతుదారులు అనుకుంటున్నారు. ఇది చాలా తప్పుడు అవగాహన & హ్రస్వదృష్టి. దీర్ఘకాలిక ప్రయోజనాలు సాదించాలంటే ఎన్నికలను దాటి ఆలోచించాలి. ఈ విషవలయంలో నుండి బయటకు రాలేని శక్తులు ఆట్టే కాలం ఉండజాలవు.

hari.S.babu said...

నేను జై గారి అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.నా ఉద్దేశం రాజుగార్ని,అంటే ఈ బ్లాగర్ని ఏకిపారెయ్యటం కాదు.వారి గత కాలపు పోష్టులాలో నేను కొన్నింటిని చూశాను.స్టీవ్ జాబ్స్,స్పార్తకస్ లాంటి వాళ్ల గురించి పరిచయం చేశారు.ముఖ్యంగా వీరి గురించి మొదట తెలిసింది "చందమామ" పత్రిక గురించిన వ్యాసాలతో.

కానీ చాలామందికి లాగే హఠాత్తుగా మోదీ ప్రధాని అవగానే దేశమంతటా హిందూమతఓన్మాదం వీపరీతంగా పెరిగిపోయిందనీ,రోహిత్ అనే స్టూడెంటుని స్మృతి ఇరానీ దగ్గిర్నుంచీ బండారు దత్తాత్రేఅయ వరకొ వాళ్ళకున్న హిందూ మతోన్మాదపు భావజాలం ప్రభావంతో కుట్రపన్ని చంపేశారనీ కొంత ఆవేఅసపడిపోతున్నట్టుగా అనిపిస్తున్నది.రాజద్రోహ చట్టం గురించి ఎంత ఆవేశంతో వూగిపోయారో!మరి,కన్నయని కలవడానికి వెళ్ళినా ఓక తెలుగు మేధావియే తను కూడా ఇదివరలో రాజద్రోహ చట్టం ప్రకారం అరెస్టయిన వాణ్ణేనని చెప్పుకున్నాడే - అదెప్పుడు జరిగింది?.

కాంగ్రెసూ,భాజపా - ఈ రెంటిలోనూ ప్రభుత్వనిర్వహణలో ఏమాత్రం తేడా లేదు.కాంగ్రెసుకి బదులుగా భాజపా అధికారంలోకి రావటమే మతతత్వం పెరిగిపోయినద్నటానికి గుర్తు అని వాదిస్తే అది భాజపాకి వోటు వేసిన సామాన్యుల విచక్షనని అవమానించహ్డమే!అప్పటి పరిస్థ్తితి ఏమిటో తెలియని దెవరికి?2జీ,4జీ,5జీ అని సమర్ధించుకోవడానికి కూడా వీల్లేనంత అవినీతిని మూటగట్టుకోవటం వల్లనే కదా అట్లా జరిగింది.

సారు కంచెం రీసెర్చ్ చేసి రాయాలని గనక ఆలోచిస్తే అలాంటి విషయాలు ఆయనకే తెలుస్తాయి!తప్పులు కానివాట్ని తప్పులని విమర్శించే హడావిడిలో భాజపా చహేస్తున్న అసలు తప్పుల్ని పట్టించుకోవడం లేదు,అదీ నా బాధ!

Post a Comment