Pages

Sunday, January 22, 2017

ఐక్యత కాదు ట్రంప్... ముందు నీ యవ్వారం తేల్చు: తిరగబడ్డ అమెరికన్ భద్రకాళులు


అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి కొన్ని గంటలైనా కాక ముందే లక్షలాదిమంది అమెరికన్ మహిళలు వాషింగ్టన్ వీధుల్లో భద్రకాళులై తిరగబడ్డారు. ట్రంప్ పురుషాధిక్య భావాలకు వ్యతిరేకంగా లేచినిలబడ్డ అమెరికన్ మహిళలకు ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో వేలాది మంది మహిళలు శనివారం మార్చ్ చేస్తూ సంఘీభావం ప్రకటించారు. శుక్రవారం వాషింగ్టన్ డీసీలో ట్రంప్ ప్రమాణ స్వీకారాన్ని వ్యతిరేకిస్తూ బీభత్సం సృష్టించిన గుంపులతో పోలిస్తే శనివారం ట్రంప్ వ్యతిరేక మహిళా నిరసనకారులు భారీ ఎత్తున గుమికూడినప్పటికీ శాంతియుత ప్రదర్శనలకే పరిమితం అయ్యారు.

అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ వైట్ హౌస్‌లో నేషనల్ ప్రేయర్ సర్వీసుకు హాజరువుతుండగా వాషింగ్టన్ నగరం మహిళా జన సంద్రాన్ని తలపించింది. అంచనాలకు మించి అయిదు లక్షల మందికి పైగా మహిళలు నేషనల్ మాల్ చేరుకున్నారు.  ఈ ఆందోళనలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళా డొనాల్డ్ ట్రంప్‌పై దుమ్మెత్తిపోయడం గమనార్హం. "ఈ దేశ నైతిక మూల సూత్రాల కోసం మేం ఈరోజు ఇక్కడ మార్చ్ చేస్తున్నాం. మహిళలపై యుద్ధాన్ని ప్రకటించిన ప్రెసిడెంట్‌కు వ్యతిరేకంగా గళమెత్తుతున్నాం. మా గౌరవ మర్యాదలు, మా హక్కులు, మా శీలం సమస్తంపై దాడులు జరుగతున్నాయి. విద్వేష, విభజన రాజకీయాల ప్లాట్‌ఫాం నిన్న అధికారాన్ని స్వీకరించిందం"టూ హాలీవుడ్ నటి అమెరికా ఫెరీరా శనివారం ఉదయం నేషనల్ మాల్‌లో గుమికూడిన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించింది. అయితే "అధికారాన్ని స్వీకరించిన ప్రెసిడెంట్ అమెరికా కాదని, మనమే అమెరికా అని, ఆ విషయాన్ని ఎలుగెత్తి చాటడానికే ఇక్కడ నిలబడ్డామం"టూ ఆమె ట్రంప్‌పై ధ్వజమెత్తారు. ఇక మడోనా, మైఖేల్ మూర్ వంటి ఇతర సెలబ్రిటీలు పాల్గొన్న ఈ ఆందోళనలు పురుషులను, మహిళలను, చిన్న పిల్లలను కూడా పెద్ద ఎత్తున ఆకర్షించాయి. ఒక మహిళ అయితే ట్రంప్‌ను పరమ భీకర అధ్యక్షుడిగా వర్ణించింది.

ఇక చికాగో నగరంలో ట్రంప్ వ్యతిరేక మార్చ్‌ నిర్వహించడానికి ప్రయత్నించిన ఆర్గనైజర్లు ఆ మార్చ్‌కు లక్షా యాభై వేలమందిపైగా హాజరు కావడంతో భద్రతా కారణాలపై మార్చ్‌ని రద్దుచేశారు.

అయితే అధ్యక్షుడిగా చేసిన తొలి ప్రసంగంలో ట్రంప్ దేశంలోని విభజనలను తొలగించడానికి సరికొత్త జాతీయాభిమానం పెంపొందాలని పిలుపిచ్చారు. ట్రంప్ చెప్పినట్లుగానే శనివారం నిరసనకారులు ఐక్యత పాటించారు  కానీ కొత్త అధ్యక్షునికి సామూహిక వ్యతిరేకత తెలిపిన ఐక్యత అది. 24 గంటల ముందు లక్షలాది ట్రంప్ మద్దతుదారులు హర్షధ్వానాలు చేసిన చోటే వేలాది మహిళలు తిరుగుబాటుకు సంకేతంగా వైవిధ్యపూరితమైన దుస్తులు ధరించి కదం తొక్కారు.

వాషింగ్టన్‌లో మహిళాలోకం పుస్సీ హ్యాట్‌లను ధరించి అధ్యక్షుడికి వ్యతిరేకంగా అసభ్యకరమైన సందేశాలు, నినాదాలు చేస్తూ నేషనల్ మాల్‌ని చుట్టుముట్టింది. ఇక వీరికి మద్దతుగా అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగానూ వందలాది స్థలాల్లో సంఘీభావ ప్రదర్శనలు జరిగాయి.

ఈ భారీ జన సందోహంలో తమతల్లులతో పాటు పిల్లలు కూడా ట్రంప్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం గమనార్హం. "మేం ట్రంప్‌కు వ్యతిరేకంగా ఇక్కడికి రాలేదు. కాని అతడికి మద్దతుగా మాత్రం రాలేదు" అని ఒక హోర్డింగ్ పేర్కొంది. "దేవుడు ప్రతి ఒక్కరిపై తన ప్రేమను ప్రదర్శిస్తాడన్న భావాన్ని పంచుకోవడానికే మేమిక్కడికి వచ్చాం" అని అందులో రాశారు.

ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో గర్భనిరోధం, హెల్త్ కేర్, గే హక్కులు, వాతావరణ మార్పు వంటి అంశాలపై ప్రదర్శించిన వైఖరిని దుమ్మెత్తిపోస్తూ వాషింగ్టన్ నగరంలో మహిళలు చేసిన నినాదాలు న్యూయార్క్, ఫిలడెల్పియా, చికాగో, లాస్ ఏంజెల్స్ నగరాల నుంచి పారిస్, బెర్లిన్, లండన్, ప్రేగ్, సిడ్నీ, ప్రేగ్, కోపెన్ హాగెన్ తదితర యూరప్ నగరాలల్లో కూడా మహిళా ప్రదర్శనల్లో ప్రతిధ్వనించాయి. మయన్మార్ నుంచి ఆస్ట్రేలియా వరకు ప్రపంచవ్యాప్తంగా ట్రంప్‌కు వ్యతిరేకంగా కనీసం 600 మహిళా నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయని సమాచారం.

"అమెరికా చరిత్రలో ఇంతకంటే బాధ్యతా రహితమైన, పురుషాహంకారి అయిన, ప్రమాదకారి అయిన వ్యక్తిని ఇకపై కూడా ప్రెసిడెంట్‌గా చూడలేమ"ని సౌత్ కరోలినా యూనివర్శిటీ టీచర్ శశికా కోనెన్ స్నిడర్ పేర్కొన్నారు.

అమెరికాలో గత కొన్ని వారాలుగా చెలరేగుతున్న ట్రంప్ వ్యతిరేక మార్చ్‌లు శనివారం నాటి మహిళల ప్రపంచవ్యాప్త ప్రదర్శనలతో పరాకాష్టకు చేరుకున్నాయి. వందల సంవత్సరాల అమెరికా చరిత్రలో ఒక అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఇంతమంది మహిళలు తిరగబడ్డం ఇదే మొదటి సారి. ఈ నేపథ్యంలో ట్రంప్ సమీప భవిష్యత్తులో పదవీ చ్యుతుడై ఉపాధ్యక్షుడే అధ్యక్ష బాధ్యతలను స్వీకరించినా ఆశ్చర్యపడనవసరం లేదంటూ అమెరికన్ రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తుండటం గమనార్గం.

శనివారం వాషింగ్టన్ లోని నేషనల్ మాల్‌లో 5 లక్షలమంది పైగా మహిళలు ట్రంప్‌కి వ్యతిరేకంగా చేసిన  నిరసన ప్రదర్శనలపై మరింత సమాచారం కోసం... కింది లింకులను చూడండి.

Women's anti-Trump march clogs Washington streets | Reuters


What We’re Seeing at the Women’s March


తాజా సమాచారం
ఇతర దేశాలను సంపద్వంతంగా మారుస్తున్న క్రమంలోనే అమెరికా వెనకబడిపోయిందని ట్రంప్ యిజం చెబుతున్న వాదనలో నిజమెంతో కింది కథనం చెబుతోంది. దీన్ని కూడా చూడగలరు.

మీకు చేతకాక మాపై పడితే ఎలా బిగ్ బ్రదర్: అమెరికాపై ఆలీబాబా విసుర్లు

యావత్ ప్రపంచాన్ని సుసుంపన్నంగా మార్చిన అమెరికా తాను మాత్రం వెనుకబడిపోయిందని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే స్వరం చైనా నుంచి వచ్చింది. అమెరికా ఆర్థిక మందకొడితనానికి కారణం అమెరికానే కానీ మరెవ్వరూ కాదని చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా.కామ్ వ్యవస్థాపకుడు జాక్ మా ఆక్షేపించారు. యుద్ధాల కోసం తాను చేసిన ఖర్చుల కారణంతోటే  అమెరికా ఆర్థిక పరిస్థితి దెబ్బతింది గానీ చైనాతో వ్యాపార సంబంధాల వల్ల కాదన్నారు. అమెరికా గత 30 ఏళ్లలో రూ.952లక్షల కోట్లను మౌలిక సదుపాయాలపై కాకుండా యుద్ధాలపై వెచ్చించిందని తెలిపారు.

బీజింగ్‌ అమెరికా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కారణం ఆ దేశమేనని అలీబాబా డాట్‌ కామ్‌ అధినేత జాక్‌ మా ఆరోపించారు. యుద్ధాల కోసం ఆ దేశం చేసిన ఖర్చుల కారణంతోటే ఆర్థిక పరిస్థితి దెబ్బతిందే గానీ చైనాతో వ్యాపార సంబంధాల వల్లకాదన్నారు. అమెరికా గత 30 ఏళ్లలో రూ.952లక్షల కోట్లను మౌలిక సదుపాయాలపై కాకుండా యుద్ధాలపై వెచ్చించిందని తెలిపారు.
 
డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం గురించి పదే పదే వస్తున్న వ్యాఖ్యానాలను జాక్ మా ఖండించారు. అమెరికా ఆర్థిక దుస్థితికి ఆ దేశం సాగించిన యుధ్ధాలే కారణం కానీ చైనాతో వ్యాపార సంబంధాల వల్ల కాదని జాక్ మా తేల్చి చెప్పారు. యుద్ధాల కోసం అమెరికా చేసిన భారీ వ్యయాలే అమెరికా పతనానికి దారితీశాయని జాక్ స్పష్టం చేశారు. 
 
చాలామంది భావిస్తున్నట్లు అమెరికన్ల ఉద్యోగాలను చైనా దొంగిలించలేదని అన్నారు. అమెరికా వ్యూహాత్మకంగా చేసిన స్వయంకృత అపరాధాల కారణంగా అక్కడ ఉద్యోగాల కొరత ఏర్పడిందని చెప్పారు. ముప్పై ఏళ్ల క్రితం మేథోసంపత్తిపై హక్కులను మాత్రం ఉంచుకొని తక్కువస్థాయి కార్మిక ఉద్యోగాలను మిగిలిన ప్రపంచానికి అమెరికా వదిలేసిందని జాక్‌మా అన్నారు. ఆ కారణంగానే ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌ లాంటి కంపెనీలు భారీగా ఆదాయాన్ని సాధించాయని పేర్కొన్నారు. 
 
మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి బహుళజాతి కంపెనీలు ప్రపంచీకరణ ద్వారా బిలియన్లాది డాలర్ల లాభాలను సృష్టించాయని, ఈ భారీ మొత్తాలను స్వదేశంలో మౌలిక సదుపాయాలకు ఉపాధి కల్పనకు వెచ్చించకుండా 13 యుద్ధాలపై అమెరికా ఖర్చుపెట్టిందని, నిధులను హేతుబద్ధంగా కేటాయించడంలో ఘోరవైపల్యమే అమెరికా దుస్థితికి కారణమని  జాక్ మా తేల్చి చెప్పారు.అమెరికన్ కంపెనీలు ఆసియా ఖండంలో ఆలీబాబా ప్లాట్‌ఫారంపై తమ ఉత్పత్తులు అమ్మినట్లయితే పలు మార్గాల్లో పది లక్షలమంది అమెరికన్లకు ఉపాధి లభిస్తుందని, ట్రంప్ ప్రభుత్వం ఇలాంటి ఉత్పాదకతా అంశాలపై దృష్టి పెడితే తనకూ, ప్రపందానికీ మంచిదని ఆలీబాబా. కామ్ వ్యవస్థాపకుడు జాక్ మా హితవుచెప్పారు. 
 
వ్యాపార యుద్ధాన్ని ప్రారంభించడం తేలికే కానీ ముగించడం కష్టం అని ఆయన అన్నారు. ఈ యుద్ధం ముగియాలంటే అసలు యుద్ధం ప్రారంభం కావాలని అన్నారు. సాధారణంగా వ్యాపారం వల్ల ప్రజల ఆలోచనలు, సంస్కృతులను పంచుకుంటారని అన్నారు. 
 
1979లో చైనా అమెరికా వ్యాపార విలువ 2.5 బిలియన్‌ డాలర్లు అని అది 2016 నాటికి అంటే  38 ఏళ్లలో 211 రెట్లు పెరిగి 519 బిలియన్‌ డాలర్లు అయింది. కానీ అమెరికాకు చైనా 400 బిలియన్ డాలర్ల సరుకులను ఎగుమతి చేయడంతో ఇరుదేశాల మధ్య వాణి్జ్య సమతూకం చైనాకే ఎక్కువ అనుకూలంగా మారింది. 

Blame costly wars, not China, for poor state of U.S. economy: Jack Ma ...

www.thehindu.com/news/...wars...economy.../article17077834.ece

8 comments:

Anonymous said...

This is the time to take action against all liberal garbage. Hope Trump will act on them.

Anonymous said...

ట్రంపులో కొన్ని వ్యక్తిత్వ పరమైన లోపాలున్నమాట నిజమే. కానీ ఇతను ఇప్పటివరకూ ఏలిన అధ్యక్షుల్లా యుధ్ధోన్మాదికాదని అనుకుంటున్నాను. ట్రంపుని ఒక వ్యక్తిగా వ్యతిరేకించడంకంటే, అతని విధానాలను per-policy basis విమర్శించడానికి నేనిష్టపడుతాను.

ట్రంపు కనీసం మన ప్రధానికంటే మెరుగని అనుకుంటున్నాను. ఇంతవరకూ ట్రంపుపారించిన రక్తపుటేరులేపాటివి?

Anonymous said...

Describing journalists as the most dishonest human beings on Earth, US President Donald Trump has said he has been "running a war" with the media and warned them of consequences for falsely reporting that less number of people attended his inauguration.

Anonymous said...

The word presstitutes is very much apt for the press people any where in the world

kanthisena said...

వ్యాఖ్యల్లో విషయం పక్కకు పోయిందా అనిపిస్తోంది. అన్ని లక్షల మంది మహిళలు ట్రంప్ అనే ఒక వ్యక్తికి లేదా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఇంత తీవ్రస్థాయిలో ఎందుకు తిరగబడుతున్నారు అనేది చర్చనీయాంశమైతే సముచితంగా ఉంటుందేమే కదా.

Anonymous said...

ఎన్నికలలో గెలిచిన ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారం చేసిన పక్కరోజే బుద్ది జ్ణానం లేకుండా, లక్షల మంది ట్రంప్ కు వ్యతిరేకం గా రోడ్లో కొస్తారా? ఆయన చేసిన నేరం ఎమిటి? పైస విలువలేని వారిని, మీకు విలువలేదని చెప్పటమేనా? వాళ్లని పొగడలేదనేగా? ఇరాక్ లో ఎజిది మహిళలను, చేతులకు గొలుసులు కట్టి, వేలం పాట పాడుతూంటే నేడు వీధుల్లోకొచ్చి నీరసనలు చేసే మహిళలంతా ఎమి చేస్తునారబ్బా? ఒక్క ఊరులో అన్నా నిరశన తెలపలేదు కదా.

ట్రంప్ కు వ్యతిరేకం గా మహిళలు చేస్తున్న యాగి చూస్తూంటే, 'తిన మరిగీ కోడి ఇల్లేకి కూసిందట', సామెత గుర్తుకొస్తున్నాది. ట్రంప్ మహిళలకు కేటాయించే పథకాలలో భారికోతపెడితే గాని తిక్క కుదరదు. జరగబోయేది కూడా అదే. జెండర్ వివక్షత బొర్డ్ వేసుకొని తేరగా ప్రజల సొమ్మును దొబ్బితినటం వాళ్లకి, ఎన్నికలలో ఓట్ల కోసం తినిపించటం లిబరల్ పార్టి లకు అలవాటైపోయింది. వాపును చూసి బలం అనుకొంట్టున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఊతంతో లబ్ది పొందుతూ డబ్బులు (ఉచితంగా)తింట్టు తెలివి పూర్తిగా నశించింది. ట్రంప్
10ట్రిలియన్ డాలర్ల నిధుల కోతను పెడుతున్న రంగాలలో ఫెమినిస్త్ సంస్థలు చాలా ఉన్నాయి. స్రీలు కూడా ఎఫెక్ట్ అవుతారు. అప్పుడు గాలి తీసిన బెలూన్ లా భూమి మీదకు దిగి వస్తారు.

ట్రంప్ గాడు మోదిలా మాటల మనిషి గాదు. మీడీయాలో మోడికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన presstitutes ల పై ఒక్క చర్య తీసుకోలేదు. పైగా బిజెపి మంత్రులు వీళ్లకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ట్రంప్ దెబ్బకు దెబ్బ మొదటి రోజునుంచే తీస్తున్నాడు. ట్రంప్ తో పోలిస్తే మోడి వేస్ట్
.

Anonymous said...

We're going to hold the press accountable."
https://twitter.com/FoxNews/status/822939003234041856

Anonymous said...

Behind Closed Doors At Davos: “Make Elites Great Again”

For the first time in years, the sense of crisis was pinned squarely on the West.

Everyone seemed to agree that they had “lost the narrative.”

The scene at Davos this year was something verging on panic. Politicians and “thought leaders” (a term used unironically at the elite gathering) grappled with the wave of populism sweeping the planet. The specter of Brexit and Trump hung over everything. European defense ministers, namely those from Germany and the Netherlands, gathered to openly discuss what it would mean to defend the continent without US support. Top Ukrainian officials pleaded not to be forgotten as Europe grapples with its own issues.

“Make elites great again!”

Jamie Dimon, the head of JPMorgan Chase, replied in his own way, letting out an expressive: “Make elites great again!” The banker, who was compensated $28 million last year.

https://www.buzzfeed.com/miriamelder/davos-make-elites-great-again?utm_term=.mo1X0jwDr#.fp5qjMAB3

Post a Comment