Pages

Thursday, February 18, 2016

ఈ అబద్ధాల రాయుళ్లూ దేశభక్తి పరులేనా?

"తెలుగునాట భక్తిరసం- తెప్పలుగా పారుతోంది
డ్రెయినేజీ స్కీములేక- డేంజరుగా మారుతోంది''

అంటూ ప్రముఖ అభ్యుదయ కవి గజ్జెల మల్లారెడ్డి, వ్యక్తుల ప్రైవేట్ వ్యవహారంగా ఉన్న భక్తిని వ్యాపారమయం చేస్తున్న అపధోరణిని పై కవిత ద్వారా దశాబ్దాల క్రితమే అక్షరీకరించారు.

దీన్ని ఇప్పుడు భారత దేశం మొత్తానికి వర్తింపజేసి 'ఇండియాలో దేశభక్తి తెప్పలుగా పారుతోంది.. డ్రెయినేజీ స్కీములేక డేంజరుగా మారుతోంది'  అని మార్చి పాడుకుంటే బాగుంటుంది. ఈ మధ్యకాలంలో దేశభక్తి భావనను ఇంతగా కలుషితం చేస్తున్న దేశం మరొకటి లేదనిపించేవిధంగా భారత్ ప్రపంచం ముందు నవ్వుల పాలవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రోహిత్ వేముల నుంచి మొదలై, కన్హయ కుమార్ అరెస్టు దాకా సాగుతున్న ప్రహసనంలో రాజ్యం రాజ్యమే దేశభక్తికి కొత్త నిర్వచనాలిస్తూ.. భిన్నాభిప్రాయం ప్రకటించిన వారినల్లా జైళ్లలో కుక్కడం, వెలివేసి  మరీ ఆత్మహత్యలకు ప్రేరేపించడం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

కానీ యూనివర్సిటీ వంటి అత్యున్నత విద్యాసంస్థల వైస్ చాన్సలర్‌లే ఇంత అబద్దాలకు, పచ్చి వక్రీకరణలకు దిగగలరని మా తరం ఎన్నడూ ఊహల్లో కూడా భావించలేదు. 33 ఏళ్ల క్రితం యూనివర్సిటీ చదువు పూర్తి చేసుకున్న మా పాత తరంకి వైస్ చాన్సలర్లు ఇలా కూడా ఉంటారా అనే కొత్త సత్యం ఇప్పుడు బోధపడుతోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అప్పారావు, ఇప్పుడు జవహర్‌లాల్ యూనివర్సిటీ వైస్ చాన్సరల్ జగదీష్‌ కుమార్ అబద్దాలు ఆడటంలో అందరినీ మించిపోయారని తేలిపోయింది. యూనివర్సిటీ పరువు తీయడంలో ఇంత అధ్వానంగా వ్యవహరించిన వీసీలను ఇటీవలికాంలో మాత్రం చూడలేదు. ఈ ఇద్దరు వీసీలూ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు వాళ్లు కావడంతో తెలుగువాళ్ల పరువు హుసేన్ సాగర్‌ సాక్షిగా మురికిలో కలిసిపోయింది.

విద్యార్థుల శ్రేయస్సునూ, యూనివర్సిటీ ప్రతిష్టను తాకట్టు పెట్టి మరీ వీరెందుకిలా వ్యవహరించారన్నది ప్రశ్న. ఒక విద్యార్థి సంఘానికి, దాని రాజకీయ పార్టీకి తలొగ్గకపోతే ఇలాంటి అబద్దాలు వీరి నోటి నుంచి ఎలా వస్తాయన్నది ఇప్పుడు చర్చగా మారింది. రోహిత్‌ను వెలి వేయలేదని, హైద్రాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్‌ను, ఇతర దళిత విద్యార్థులపై ఎలాంటి ఆంక్షలూ విధించలేదని, చివరివరకూ దళిత విద్యార్థుల గురించే ఆలోచించానని గతంలో ఆ వర్సటీ వీసీ అప్పారావు అడుగడుగునా అబద్దాలు చెప్పిన చరిత్ర మన కళ్లముందే ఉంది

.

ఇప్పడు మరొక తెలుగు వైస్ చాన్సలర్ అబద్దాలు చెప్పడంలో తానెవరికీ తీసిపోనంటూ నిరూపించుకున్నారు. జెఎన్‌యూలో హాస్టళ్లను తనిఖీ చేయాలని, విద్యార్థులను అరెస్టు చేయాలని పోలీసులను తాను కోరలేదని ఆ వర్శిటీ వీసీ జగదీష్ కుమార్ చెబుతున్నదానికీ, కనిపిస్తున్న ఆధారాలకు ఏమాత్రం పొంతన కుదరటం లేదని పత్రికలు ఇప్పుడు కోడై కోస్తున్నాయి. ఢిల్లీ పోలీసులు, వీసికి మధ్య కొనసాగిన లేఖల్లో అవసరమైతే తనిఖీలు చేసుకోవచ్చని ఈ వీసీ అనుమతి ఇవ్వడం స్పష్టంగా ఉందని తేలింది. జెఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయకుమార్‌ను అరెస్టు చేసిన రోజే (ఫిబ్రవరి 11) వీసీ రాసిన లేఖలో అవసరమనిపిస్తే జేఎన్‌యూ క్యాంపస్‌లోకి ప్రవేశించి తనిఖీలు చేసుకోవచ్చని వీసీ అనుమతిచ్చినట్లు దక్షిణ ఢిల్లీ డీసీపీకి వర్సిటీ రిజిస్ట్రార్ భూపిందర్ జుట్షి రాతపూర్వకంగా తెలియపర్చారని తాజా వార్త.

నరనరానా హిందూ భావజాలం జీర్ణించుకున్న వారిని ఈ దేశంలోని సమస్త అధికార రంగాల్లోనూ చొప్పించే ప్రయత్నం పకడ్బందీగా చేస్తున్నట్లు కర్నాటక బీజేపీ వర్గాలు గత ఏడాది చెప్పిన మాటలు అక్షర సత్యాలని ఇప్పుడు మరింతగా రుజువవుతున్నాయి. (ఇప్పటికే కర్ణాటక లోని పోలీసు విభాగంలో 60 శాతం మేరకు సంఘ్ పరివార్ అనుకూల శక్తులనే నియమించామని ఆ రాష్ట్ర బీజీపీ నేత స్పష్టం చేశారు కూడా). ఈ ఇద్దరు తెలుగు వీసీలు కూడా ఆ బాపతువారే అని ఇప్పుడు తేలుతోంది.

తెలంగాణ ప్రాంతానికి చెందిన జగదీష్ కుమార్‌ను రెండు నెలల క్రితం ఉన్నట్లుండి ఢిల్లీ లోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ వీసీగా నియమిస్తున్నట్లు వార్తలు రాగానే ఎవరీయన అని వాకబు చేస్తే. కరుడుగట్టిన ఆరెసెస్‌ వాది అని మీడియా మిత్రులు ఆనాడే చెప్పారు. వాక్స్వాతంత్రానికి, వ్యక్తి స్వేచ్చకు ప్రతీకగా నిలిచిన జేఎన్‌యూకు ఇతగాడిని వీసీగా పంపిస్తున్నారంటేనే ఆ వర్సిటీకి మూడిందని, ఆరోజే మీడియా మిత్రులు హెచ్చరించారు. సరిగ్గా అదే నిజమైందిపుడు.

జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ కుమార్‌ను ఎంత నిరాధార ఆరోపణలతో జైలుకు పంపించారో ఇప్పుడు వాస్తవాలు బయటపడుతున్నాయి. కింది లింకును చూడగలరు.

JNU student leader Kanhaiya named in FIR only after TV report

హిందూస్తాన్‌టైమ్స్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి వ్యవస్థానుకూల లేదా బీజేపీ అనుకూల పత్రికలే కన్హయ ఉదంతంలో అధికారుల, పోలీసుల అతి చేష్ట్యను తూర్పారబడుతూ వరుస కథనాలు ప్రచురిస్తున్నాయి. పైగా కన్హయపై దేశద్రోహ నేరం కింద కేసు నమోదు చేయడం గర్హనీయమని, పాకిస్తాన్ జిందాబాద్ లాంటి నినాదాలు చేశాడని అతడిని అరెస్టు చేయడం జరిగివుంటే అది దేశద్రోహం కిందికి రాదని, దేశద్రోహ నేరాన్ని సుప్రీంకోర్టు విస్పష్టంగా నిర్వచించిందని ప్రముఖ రాజ్యాంగ వేత్త, మాజీ అటార్నీ జనరల్ సొలీ సొరాబ్జీ వ్యాఖ్యానించారు. ఇవేవీ మనుషుల్లో కాకుండా... మట్టిలో, రాళ్లలో, మంచుకొండల్లో మాత్రమే దేశభక్తిని చూస్తున్న వారికి కనిపించవు, వినిపించవు కాబోలు.

అసలు దేశద్రోహం అనే పదమే నేర న్యాయ చట్టంలో లేదని సెడిషన్ అనే పదానికి రాజద్రోహం అని వందల సంవత్సరాలుగా వాడుకలో ఉంటూండగా దాన్ని దేశద్రోహంగా మార్చి ఉద్దేశపూర్వకంగా భావోద్వేగాలను రెచ్చగొట్టే తత్వం ఇప్పుడు బలం పుంజుకుంటోందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. బ్రిటిష్ వారు కూడా రాజద్రోహం అనే పదమే వాడారు తప్పితే వారి వలస పాలనలో దేశద్రోహం అనే భావనకే తావు లేదు. పైగా అది కాలం చెల్లిన పదం. ఎక్కడైతే పుట్టిందో ఆ బ్రిటన్‌లోనే 20 ఏళ్ల క్రితమే రద్దయిన పురాతన చట్టం అది. కాని నేటి భారతీయ కుహనా దేశభక్తులకు మాత్రం ఆ వలస పాలనా వారసత్వాన్ని కొనసాగించడమే కాదు దాన్ని వక్రీకరించి దేశభక్తి పైత్యాన్ని తారస్థాయికి తీసుకుపోవడం కూడా తాము ప్రబోధించే సంస్కృతిలో భాగమైనట్లుంది.

మొత్తంమీద మౌలిక ప్రశ్న. దేశభక్తులూ వారి అనుయాయులూ, వారి పంచమాంగ దళాలూ ఇన్ని అబద్దాలు, అసత్యాలు, నిరాధార చర్యల ద్వారా తమ దేశభక్తి చుట్టూ ఇలాంటి కోటలెందుకు కట్టుకుంటున్నారన్నదే ఇప్పుడు పజిల్‌గా మారింది. అబద్దాలతో, అసత్యాలతో, లేనిపోని అనుమానాలతో నిర్మితమవుతున్న ఇలాంటి కుహనా దేశభక్తికి మామూలు జనం ఎంత దూరంగా ఉంటే వారికీ, దేశానికీ కూడా చాలా మంచిది.

ఇలాంటి పైపై మెరుగుల దేశభక్తికి ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత శక్తివంతంగా సమాధానమిచ్చిన కన్హయ కుమారే మన కాలం వీరుడు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి సంఘాల నేతల సైద్ధాంతిక లేమిని చూస్తే కన్హయ రాసిన ఆ ఉత్తరం ఎంత తాత్వికంగా, ఎంత శక్తివంతంగా ప్రగతిశీల భావనను వ్యక్తీకరించిందో పూర్తిగా చదివితే కానీ బోధపడదు.

Is this anti-India :  Read full text of JNU leader Kanhaiya’s speech

గత మూడు రోజులుగా పాటియాలా కోర్టు ఆవరణలో లాయర్ల ముసుగులోని వీధి రౌడీలు, నేతలు జేఎన్‌యూ విద్యార్థులపై, జర్నలిస్టులపై చేస్తున్న దాడులు, వాటిపై రాజ్యయంత్రాంగం మొత్తంగా నిద్రపోవడం చూస్తూ మనసు రగిలిపోయిున ఒక సీనియర్ జర్నలిస్టు ఒకే మాటన్నారు. న్యాయాన్ని నడిరోడ్డుపై ఇలా కుళ్లబొడుస్తున్న ఇలాంటి వారి పని పట్టాలంటే శాంతి కపోతాలను అరువు తెచ్చుకుని గత యాభై ఏళ్లుగా ఎముకలు కుళ్లిన ప్రజాస్వామ్య విద్యార్థి సంఘాలు చాలవని, దీనికి మావోయిస్టులు బలపడటమే పరిష్కారమని, వారు చేపట్టే చర్యలే కొన్ని సందర్భాల్లో చాలా న్యాయమైనవని  ఆయన అన్నారు.

ఆయన మాటలు నిజం కాకూడదనే భావిద్దాం. కానీ ఈ కుహనా దేశభక్తుల వీరంగం చూస్తుంటే దేశంలో రేపు జరగబోయే పరిణామం అదేనా అనే సందేహం వస్తోంది.

Let Kanhaiya come, we will burn him alive: Lawyer recalls JNU horror


దేశరాజధానిలో నల్లకోటు ధరించిన లాయర్లు వీధిరౌడీలకంటే మించిన జుగుప్సాకరమైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ కస్టడీలో ఉన్న కన్హయపై పిడిగుద్దులు కురిపించారంటే ఈ వ్యవహారం ఇక మాటలతో తేలే పని కాదనిపిస్తోంది.

ఇప్పుడే అందిన వార్త. 2014 ఒక్క సంవత్సరంలోనే ఎన్డీయే పాలనలో 47  రాజద్రోహ కేసులు నమోదు చేశారని ఇన్నేళ్ల దేశ చరిత్రలో ఎన్నడూ ఇన్ని రాజద్రోహ కేసులు నమోదు కాలేదని ఎన్‌సీఆర్‌బీ నివేదిక తాజాగా తెలుపుతోంది. రాజద్రోహులు పెరుగుతున్నారంటేనే రాజ్య పాలన సక్రమంగా లేదని అర్థం. స్వతంత్ర పోరాటం పదే పదే మనకు నేర్పిన పాఠం ఇదే.

అబద్దాల పునాదిపై దేశభక్తిని వక్రమార్గం పట్టిస్తున్న పాలనలో రాజద్రోహాలు పెరగక తప్పదని పై గణాంకాలే చాటి చెబుతున్నాయి.

తాజా వార్త మరింత ఆసక్తిదాయకంగా ఉంది. దేశభక్తి వికృతత్వం బీజేపీ విద్యార్థి సంఘంలోనే కలవరం పుట్టిస్తున్నట్లు చెబుతున్న ఈ కింది వార్తను తప్పక చదవాల్సిందే.

కేంద్రంపై నిరసనగా ఏబీవీపీ నాయకులు రాజీనామా

న్యూఢిల్లీ: జేఎన్ యూలో కన్హయ్య కుమార్ అరెస్టు వివాదం, రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు, పోలీసుల స్పందన తమను కలిచి వేసిందంటూ బీజేపీకి చెందిన విద్యార్థి విభాగం అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కు చెందిన ముగ్గురు విద్యార్థి నాయకులు తమ బాధ్యతలకు రాజీనామా చేశారు. 'జేఎన్ యూకు చెందిన ముగ్గురు ఏబీవీపీ నాయకులు కేంద్రంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజీనామా చేశారు' అని పీటీఐ వార్తా సంస్థ గురువారం ఉదయం వెల్లడించింది.

వారు ఒక లేఖను ఈ సందర్భంగా విడుదల చేసినట్లు పేర్కొంది. విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చూస్తూ కూడా ప్రభుత్వానికి మద్దతుగా ఉండలేమంటూ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అధ్యక్షుడు రాహుల్ యాదవ్, కార్యదర్శి అంకిత్ హన్స్, మరో కార్యదర్శి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న జేఎన్ యూ వివాదం, మనుస్మృతిపై చాలా కాలంగా బీజేపీకి ఉన్న అభిప్రాయం, రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన విషయంలో కేంద్రం తీరుపై అభిప్రాయ భేదాలు రావడంతోపాటు పోలీసుల చర్యలు కూడా తమను ఇబ్బందికి గురిచేశాయని, విద్యార్థుల మధ్య చీలికలు తెచ్చేలా ఉన్నాయని వారు పేర్కొన్నారు. దీంతోపాటు దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడాన్ని తాము కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.)
-------------------------
దేశభక్తుల పార్టీ వ్యవహారాన్ని ఆ  పార్టీ అనుబంధ విద్యార్థి సంఘంతో ఇన్నాళ్లూ అంటకాగిన వారే ఇంత ఘనంగా ప్రకటిస్తున్నారు. కింది వార్త చూస్తే ఇంత దేశ భక్తా అని కిందపడి దొర్లాలనిపించకమానదు.

ఈ కింది వార్త దేశభక్తుల డొల్లతనాన్ని ఇంకా బాగా చెబుతోంది చూడండి. భారత మాతతో చెలగాటమాడితే గ్యాంగ్ రేప్ తప్పదట. ఇది ఖచ్చితంగా కుహనా దేశభక్తిని నరనరానా జీర్ణింప చేసుకున్న మూర్ఖ శిఖామణి ప్రేలాపన. ఈ ప్రేలాపన చేసినవాడిని కాదు ఇతగాడి తల్లిదండ్రులను చూసి మనం జాలిపడాలి. ఎలాంటి వాడికి వాళ్లు జన్మనిచ్చారా అని.

ఒకట్రెండు రోజుల్లో నిన్ను గ్యాంగ్‌రేప్ చేస్తారు!

ముంబై: ఒకట్రెండు రోజుల్లో నిన్ను గ్యాంగ్‌రేప్ చేస్తామంటూ ఓ మహిళా జర్నలిస్టును ట్విట్టర్‌లో హెచ్చరించాడో దుండగుడు. ఈ బెదిరింపులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై పోలీసులు అతనిపై కేసు నమోదుచేశారు. అమరేంద్రకుమార్ సింగ్ అనే ట్విట్టర్‌ ఖాతాదారుడు ఈ మేరకు హెచ్చరిక చేశాడు. జేఎన్‌యూ వివాదం నేపథ్యంలో ఢిల్లీ పటియాల కోర్టులో పాత్రికేయులపై జరిగిన దాడిని ఖండిస్తూ ముంబైలో విలేకరులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఫొటోలను ఓ మహిళా జర్నలిస్టు తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసింది. దీంతో ఆమెను ఉద్దేశించి అమరేంద్రకుమార్ తీవ్రస్థాయి బెదిరింపులకు దిగాడు. 'ఒకట్రెండు రోజుల్లో నీపై తీవ్రమైన గ్యాంగ్‌ రేప్ జరుగుతుంది. స్పృహలోకి రండి. భారత మాతతో చెలగాటమాడకండి' అంటూ అతడు ట్వీట్ చేశాడు. దీనిపై ఆ పాత్రికేయురాలు పోలీసులను ఆశ్రయించడంతో.. అతనిపై ఐపీసీ సెక్షన్లు 354 (ఏ) 1 (అమర్యాదపూర్వకంగా వ్యవహరించడం), 509 (మహిళలను అవమానించే చర్యలకు పాల్పడటం), 506 (నేరపూరిత ఉద్దేశం) కింద ఆజాద్ మైదాన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదుచేశారు.)

సంస్కృతి గురించి ఓనమాలు తెలియని బాపతు రకాలే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. బాధాకరమైనదేమిటంటే మొత్తం మన సోషల్ మీడియా అంతా ఇలాంటి సంస్కృతీ ఉద్ధారకులే పాతుకుపోయారు. భిన్నాభిప్రాయం పట్ల వీరి వ్యాఖ్యలు చూస్తే సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న అభిప్రాయం తప్పు కాదనిపిస్తుంది. ఒక తెలుగులోనే కాదు .. దేశమంతా సోషల్ మీడియా బతుకు ఇలాంటివాళ్లతోటే తెల్లారుతోంది. సాక్షాత్తూ నరేంద్రమోదీకే డోకు వచ్చి తూర్పారపట్టిన ఈ రకం దేశభక్తి ఇప్పుడు ఇలా సోషల్ మీడియాలో తెప్పలుగా పారుతోంది మరి.

చివరగా.. ఇలాంటి దేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే ఎంత బావుణ్ణో..!

ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ,
ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో,
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో ,
సంసారపు గోడల మధ్య
ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో,
ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో,
ఎక్కడ అలసట నెరుగని శ్రమ
తన బాహువుల్ని పరిపూర్ణత వైపు చాస్తుందో,
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో
స్వచ్చమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో,
ఎక్కడ మనసు
నిరంతరం వికసించే భావాలలోకి, కార్యాలలోకి
నీచే నడపబడుతుందో,
ఆ స్వేచ్ఛా స్వర్గానికి,
తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు.
-గీతాంజలి (రవీంద్రనాథ్ టాగోర్)

గమనిక:
(రెండురోజులుగా కళ్లకలక సమస్యతో నా ఈ టపాపై వచ్చిన స్పందనలకు సమాధానమివ్వలేకపోయాను. ఇక్కడ తాజాగా అదనపు సమాచారాన్ని పొందుపరుస్తున్నాను. చూడగలరు.)

నా టపాను ఇంకా చూస్తున్న వారికి ఇక్కడ మరొక లింకును ఇస్తున్నాను. మీరు ఆమోదించినా లేకున్నా సరే ది వైర్ వెబ్ సైట్లో ప్రచురితమైన ఈ ఆంగ్ల కథనాన్ని తప్పక చదవగలరు. ఇండో అమెరికన్ రచయిత, ది వైర్ సంపాదకుడు, హిందూ మాజీ జర్నలిస్టు సిద్ధార్థ్ వరదరాజన్ 19వ తేదీన ఈ కథనం ప్రచురించారు.

On Kanhaiya: It is Time to Stand Up and Be Counted

http://thewire.in/2016/02/19/on-kanhaiya-it-is-time-to-stand-up-and-be-counted-22039/

ఆకలి నుంచి స్వాతంత్యం, భూస్వామ్య విధానం నుంచి స్వాతంత్ర్యం, మతతత్వం నుంచి స్వాతంత్ర్యం అంటూ ఎలుగెత్తిన కన్హయ్య ప్రసంగంలోని మాటలను కత్తిరించి కశ్మీరీ స్వాతంత్ర్యం అంటూ కథలల్లి ప్రకటించిన జీన్యూస్, ఇండియా న్యూస్, న్యూస్ ఎక్స్, టైమ్స్ నౌ టీవీ జర్నలిస్టులు జర్నలిజానికే కాదు.. భారతదేశానికే కళంకం అంటూ ఈ వ్యాస రచయిత ఆరోపిస్తున్నారు.

కన్హయ్య అనని మాటలను అనినట్లుగా అసలు వీడియోను మార్చిన బీజేపీ నేతలు కానీ, దాన్ని అందిపుచ్చుకున్న డిల్లీ పోలీస్ చీఫ్ బస్సీ కానీ, వంతపాడిన ఆర్ఎస్ఎస్ అనూకూల చానెళ్లు కాని, లేని నేరం మోపి కోర్టు ఆవరణలోనే కన్హయపై, అధ్యాపకులపై దాడి చేసిన బీజేపీ ఎంఎల్ఏ, ప్రొ బిజేపీ లాయర్లు కాని వీళ్లకంటే మించిన దేశ ద్రోహులు లేరంటూ సిద్ధార్థ్ వరదరాజన్ ప్రకటిస్తున్నారు.

చైతన్యశీలి అయిన ఒక యువకుడి జీవితాన్ని పిచ్చికుక్కలకు ఆహారంగా వదిలిన మార్ఫింగ్ జర్నలిస్టులకే శిక్ష విధించాలంటున్నాడీయన. ఆయన కథనంతో మీరు ఏకీభవించినా, ఏకీభవించకపోయినా సరే, ఆయన వాదనను కనీసం చదవండి చాలు.

సోమవారం లోపు ఈ వ్యాసాన్ని అనువదించి ఇక్కడే ప్రచురిస్తాను. దీంతోపాటు కన్హయ్య పూర్తి ప్రసంగ పాఠాన్ని కూడా..





20 comments:

Anonymous said...

People like you are more dangerous than terrorists. Presstitutes and Lefties are heinous than Afjal guru. The JNU students are bandicoots who are enjoying tax payers money. Instead of studies those crooks are creating nuisance. Pseudo intellectuals and arm chair experts like you are supporting those nincompoops.

Anonymous said...

హిందూస్తాన్‌టైమ్స్ పక్కా కాంగ్రెస్ పార్టి ది. ఈ పత్రికలు అన్ని కాంగ్రెస్ కే కొమ్ము కాస్థాయి. అది బహిరంగ రహస్యమే.

Saahitya Abhimaani said...

"...నరనరానా హిందూ భావజాలం జీర్ణించుకున్న వారిని ఈ దేశంలోని సమస్త అధికార రంగాల్లోనూ చొప్పించే ప్రయత్నం..."

For decades there has been infiltration of communists in every organization including Universities. What is your comment for that. If you think only Communists can occupy positions like Universities etc. please confirm.

Anonymous said...

you are afraid of social media and spewing venom on the nation in the name of freedom of speech. People know what is being cooked in JNU all these years.

Anonymous said...

వాళ్ల సంగతి అటుంచండి . మీ అభిప్రాయం ప్రకారం భారత దేశం నాశనమవ్వాలని కోరుకుని నినాదాలు చేసేవాళ్లది దేశ భక్తి అంటారు అంతేకదా ? ఎవడన్నా ఈదేశం సొమ్ముతిని ఉగ్రవాదులకు సహాయపడెలా మాట్లాడటం తప్పుకదా అంటే వాళ్లది ఉన్మాదం అని స్పష్టం చెస్తున్నారు మీరు . దీన్ని సమర్దిమ్చుకోవటానికి ఎక్కడో పనికిమాలిన్ ఆవేశం ప్రదర్శించే వారిని ఎత్తిచూపుతారు.
మీరు వ్రాసేప్పుడు మీ అభిప్రాయం స్పష్టం చేయండి. దేశభక్తి అంటే ఏమిటో .

Saahitya Abhimaani said...

@Anonymous

I advise you to post with your name.

hari.S.babu said...

విద్యార్ధుల్ని ఎవరు వెలివేశారు?సాంకేతికంగా అకక్ద జరిగినది యూనివర్శిటీ క్రమశిక్షణా చర్యల సంఘం ఇదివరకు హాలా సందర్భాలలో చేసినటుగానే రూల్సు ఒప్పుకున్న పద్ధతిలోనే నిషేధం విధించారు.వాళ్లకి పైత్యం ముదిరి "వెలివాడ" అని బోర్డులు పెట్టుకుంతే అదీ వైస్ చాన్సలర్ వెలివేసినట్టు ఎలా అవుతుంది?వైస్ చాన్సలర్ ఖండించినది దానిని గురించి అయీంప్పుడు ఆయన చెప్తున్నది అబద్ధం అని మీరెలా అనగలరు?

వాళ్ళూ బద్ధాలు చెప్తున్నారు అని మీరు న్నిర్ధార్నకి వచ్చేముందు ఆధారాలు సరి చూసుకోవాలి.వాళ్లని వైస్ చాన్సలర్ స్వయంగా వెలివెయ్యలేదు.క్రమశిక్షణా సంగహ్మ్ నిషేధాలు పెడితే వాళ్ళు మమ్మల్ని వెలివేశారు అని చెప్పుకున్నారు.

Anonymous said...

Umar is son of banned terror outfit SIMI's ex-Prez

http://www.dailypioneer.com/city/umar-is-son-of-banned-terror-outfit-simis-ex-prez.html

Saahitya Abhimaani said...

@Hari Babu, good question and well said.

Anonymous said...

Please do us a favor, Can you publish what Mr. Khannayya said? If someone says Pakistan Zindabad, what else he could have said against India. Now you are trying to define what is Desa Droham or Raja Droham.. shame on you..

kanthisena said...

ఈ టపాకు వ్యాఖ్యలు చేసిన జ్ఞాత, అజ్ఞాత మిత్రులకు.. సకాలంలో స్పందించలేకపోయినందుకు చింతిస్తున్నా. కళ్లకలక సమస్యతో రెండు రోజులుగా ఇబ్బంది ఎదురైనందున స్పందించలేకపోయాను. మీ వ్యాఖ్యలన్నింటికీ తప్పక సమాధానం ఇస్తాను. చివరి టపాలో అజ్ఞాత రాసిన విషయంపై కూడా స్పందిస్తాను. కన్హయ్య ప్రసంగం పూర్తి ఇంగ్లిష్ పాఠం నా టపాలోనే ఇచ్చాను. దాన్ని తప్పకుండా తెలుగుచేసి ప్రచురిస్తాను. పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదం తానివ్వలేదని, ఆ నినాదానికి తాను వ్యతిరేకమని కన్హయ్య ఇప్పటికే చాలాసార్లు ప్రకటించాడు. పైగా తాను భారత రాజ్యాంగానికి విధేయుడనని సుప్రీంకోర్టులోనే చెప్పాడు.

పైగా అప్జల్ గురుపై సమావేశానికి హాజరైనంత మాత్రాన అతడు రాజద్రోహ నేరానికి పాల్పడినట్లు కాదని ఇప్పటికే నిఘా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. రాజనాథ్ సింగ్, రవిశంకర ప్రసాద్ ఇప్పటికే ఈ విషయమై ఢిఫెన్సుతో కూడిన ప్రకటనలు గుప్పించేశారు కూడా. మీడియా మొత్తంగా ఈ అంశంలో ప్రభుత్వ నిర్వాకాన్ని, తొందరపాటుతనాన్ని తూర్పారపట్టడం గత రెండు మూడు రోజుల దినపత్రికలను, వెబ్ సైట్లను చూసినా అర్థమవుతుంది.

ఇక హెచ్ సీయూలో వెలివేసిందెవరు అని హరిబాబుగారు చేసిన వాదనకు సంబంధించి.. ఇప్పుడే అంటే ఈ శనివారం కేంద్ర మానవ వనరుల శాఖ నియమించిన నిజ నిర్ధారణ కమిటి తన నివేదికను సమర్పించింది. పార్లమెంటు ఎంపీల జోక్యం కంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ యాజమాన్యం ఘోరవైఫల్యం కారణంగానే రోహిత్ ఘటన చోటు చేసుకుందని, కనీసం నిరాహార దీక్షలో పాల్గొంటున్న విద్యార్థులతో సంప్రదింపులు చేయకపోయనందునే రోహిత్ ప్రాణాలు కో్ల్పోయాడని వ్యాఖ్యానించింది. దీనిపై నా వ్యాఖ్య అనవసరం అనుకుంటాను.

ఇకపోతే.. వీసీల అబద్దాల గురించి... రోహిత్ ఉరిపోసుసుకుని మరణించాక కూడా కనీసం మానవ స్పృహతో అప్పటికయినా విద్యార్థులను కలవడానికి ఇచ్చగించని వీసీ, ఇతర వర్శిటీ అధికారులు తాము చివరివరకు నిరసనలో ఉన్న విద్యార్థులతో సంప్రదిస్తూనే ఉన్నామంటూ పచ్చి అబద్దాలు పలికిన విషయం జనవరి 17 తర్వాత అన్ని మీడియాల్లో వచ్చింది. ఘటన జరిగిన 3 రోజుల వరకు వీసీ కానీ, ఇతర అధికారులు కానీ విద్యార్థుల శిబిరం వైపు కన్నెత్తి కూడా చూడలేదు.

దళిత విద్యార్థులకు పైత్యం వచ్చి వెలివాడ అని పేరుపెట్టుకుని తమను వెలివేశారని ప్రచారం చేశారా హరిబాబుగారూ, ఇంత జరిగిన తర్వాత కూడా మీరిలా అంటున్నారంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.

నా ఆరోగ్యం కాస్త కుదుటపడగానే నా వద్ద ఉన్న అదనపు సమాచారం, దాని లింకులను మరో టపాలో పొందుపరుస్తాను.

శివరామ్ ప్రసాద్ గారూ. మీ వ్యాఖ్య కూడా చూశాను. తర్వాతే స్పందిస్తాను. సకాలంలో స్పందించనందుకు క్షంతవ్యుడిని
రాజశేఖరరాజు

Anonymous said...

This week's Primetime Scorecard is out; 82% Indians are communal bigots:
Times Now 82 %
NewsX 7 %.
CNN-IBN 4 %
India Today 4 %
NDTV 3 %

kanthisena said...

నా టపాను ఇంకా చూస్తున్న వారికి ఇక్కడ మరొక లింకును ఇస్తున్నాను. మీరు ఆమోదించినా లేకున్నా సరే ది వైర్ వెబ్ సైట్లో ప్రచురితమైన ఈ ఆంగ్ల కథనాన్ని తప్పక చదవగలరు. ఇండో అమెరికన్ రచయిత, ది వైర్ సంపాదకుడు, హిందూ మాజీ జర్నలిస్టు సిద్ధార్థ్ వరదరాజన్ 19వ తేదీన ఈ కథనం ప్రచురించారు.
On Kanhaiya: It is Time to Stand Up and Be Counted
http://thewire.in/2016/02/19/on-kanhaiya-it-is-time-to-stand-up-and-be-counted-22039/

ఆకలి నుంచి స్వాతంత్య్ం, భూస్వామ్య విధానం నుంచి స్వాతంత్ర్యం, మతతత్వం నుంచి స్వాతంత్ర్యం అంటూ ఎలుగెత్తిన కన్హయ్య ప్రసంగంలోని మాటలను కత్తిరించి కశ్మీరీ స్వాంతంత్ర్యం అంటూ కథలల్లి ప్రకటించిన జీన్యూస్, ఇండియా న్యూస్, న్యూస్ ఎక్స్, టైమ్స్ నౌ టీవీ జర్నలిస్టులు జర్నలిజానికే కాదు భారతదేశానికే కళంకం అంటూ ఈ వ్యాస రచయిత ఆరోపిస్తున్నారు.

కన్హయ్య అనని మాటలను అనినట్లుగా అసలు వీడియోను మార్చిన బీజేపీ నేతలు కానీ, దాన్ని అందిపుచ్చుకున్న డిల్లీ పోలీస్ చీఫ్ బస్సీ కానీ, వంతపాడిన ఆర్ఎస్ఎస్ అనూకూల చానెళ్లు కాని, లేని నేరం మోపి కోర్టు ఆవరణలోనే కన్హయపై, అధ్యాపకులపై దాడి చేసిన బీజేపీ ఎంఎల్ఏ, ప్రొ బిజేపీ లాయర్లు కాని వీళ్లకంటే మించిన దేశ ద్రోహులు లేరంటూ సిద్ధార్థ్ వరదరాజన్ ప్రకటిస్తున్నారు.

చైతన్యశీలి అయిన ఒక యువకుడి జీవితాన్ని పిచ్చికుక్కలకు ఆహారంగా వదిలిన మార్ఫింగ్ జర్నలిస్టులకే శిక్ష విధించాలంటున్నాడీయన. ఆయన కథనంతో మీరు ఏకీభవించినా, ఏకీభవించకపోయినా సరే, ఆయన వాదనను కనీసం చదవండి చాలు.

సోమవారం లోపు ఈ వ్యాసాన్ని అనువదించి ఇక్కడే ప్రచురిస్తాను. దీంతోపాటు కన్హయ్య పూర్తి ప్రసంగ పాఠాన్ని కూడా..

Saahitya Abhimaani said...

ఈ చర్చ చూడండి:
https://www.youtube.com/watch?v=9KXf-98UAwE

Anonymous said...

మీరు గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి. జె.యన్.యు. లో కొందరు ప్రొఫెసర్ ల కి(సాయి బాబా) , హరగోపాల్ కి మావో ఇస్ట్ ల తో సంబంధాలు లేవా? మావోఇస్టుల అజెండా ఎమిటి? ప్రజాస్వామ్యమా? వరై తరపున వకాల్తా తీసుకొనే మేధావులు, వారు ప్రజాస్వామ్య వాదులైతే, జనతన సర్కార్ రాజ్యాంగం ఎమిటో ఇన్నాళు ప్రజలకు చెప్పకుండా, మీడీయాలో చర్చించకుండా ఎందుకు దాచారు.

Unknown said...

Those who want to read Kanhaiya Kumar's full speech translation in Telugu can visit this link.

http://epaper.prajasakti.com/c/8628400

Saahitya Abhimaani said...

రాజశేఖర రాజుగారూ, పైన నేను ఇచ్చిన లింకులో జెమినీ న్యూస్ యాంఖర్ శాయి వేసిన ప్రశ్నలకు అక్కడున్న మీ స్నేహితులు కాకుండా, మీరైతే ఎలా స్పందించేవారు చెప్పగలరు. కమ్యూనిస్టులు, ఎక్కడపడితే అక్కడ, ముఖ్యంగా యూనివర్సిటీల్లో చాపకింద నీరులాగా దూరిపోయి, తిష్ట వేసి, గత ఆరు దశాబ్దాలుగా విద్యార్ధుల బుర్రలు పాడిచేస్తూ (తమ పిల్లలను చక్కగా చదివించుకుని ఉద్యోగాల్లో పెట్టుకుంటూ)వాళ్ళను నక్సల్ గా అడవుల్లోకి పాపమే ప్రకిర్య చేసారా లేదా చెప్పండి. ఈ సో కాల్డ్ వామపక్ష "మేధావుల" పిల్లలు ఎవ్వరన్నా మీరు ఉద్యమాగా పిలుచుకునే ప్రక్రియలో భాగం అయ్యారా! ఎందుకు కాలేదు?

కమ్యూనిస్టులు మాత్రం ఎక్కడపడితే అక్కడ ప్రోఫెసర్లుగానూ, గైడ్లుగానూ, విభాగ అధిపతులుగాను, చరిత్రకారులుగానూ చేరిపోవచ్చు, అది సామాన్యమైన, సజహమైన ప్రక్రియ. మీ వాదం కానివారు ఈరోజున అతి కొద్దిచోట్లల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో నియమించపడుతూ ఉంటే మీకు కడుపు మంట ఆగటం లేదు. ఇలా మాట్లాడే కమ్యూనిస్టులు అంటే గౌరవం పోగుట్టుకుంటున్నారు. కమ్యూనిస్టులను విమర్శించే వారి కంటే, కమ్యూనిస్టు పిడివాడులవల్లె ఆ పార్టీ మనుగడ పూర్తిగా కుంటుపడిందన్న విషయం మీ నాయకులకు తెలిసే అవకాశం లేదు. అదే ఆ పార్టీ దురదృష్టం.

Anonymous said...

SIVARAMAPRASAD KAPPAGANTU ji,

Well said

Anonymous said...

విదేశి పౌరుడైన సిద్దార్థ్ వరదరాజన్ కమ్యునిస్ట్ కదా! మరి నిత్యం వ్యతిరేకించే కేపిటలిస్ట్ దేశమైన అమెరికా పౌరసత్వం ఎందుకు తీసుకొన్నాడు? తీసుకొని ఇండియాకొచ్చి కూచోవటమెందుకు? అమెరికా పౌరుడు కావటం వలన ఆయన ఈ దేశ పత్రికకి ఏడిటర్ గా నియమించ్టానికి వీలు లేదని, కోర్ట్ కి వెళితే హిందూ పత్రిక వారు పదవినుంచి తొలగించటానికి ఒక కారణం. ఇంతజరిగాక కూడా ఇండియాలో రాజకీయాల పై టివి స్టుడియోలలో చేరి ఫుల్ టైం విలేహరి లా ఎందుకు పాల్గొంటాడు. మీకు తెలుసో లేదో సిద్దార్థ్ అన్నగారు టుంకు వరదరాజన్ బ్రిటీష్ పౌరుడు. ఆయన కేపిటలిస్ట్ మద్దతు దారుడు. ఇంగ్లాండ్ పత్రికలలో మోడి రిఫాంస్ చాలా నిదానంగా ఉంది. ప్రైవేటైసేషన్ చేయటం లేదని రాస్తూంటాడు.

అన్నదమ్ములిద్దరు ఒక విషయం లో ఏకమౌతారు. అది భారతదేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా విదేశి పేపర్లకి వ్యాసాలు రాయటంలో!

Saahitya Abhimaani said...

రాజశేఖర రాజుగారూ ఈ కింది లింకులో ఒక వ్యాసం ఉన్నది. ఆ వ్యాసం కూడా మీరు తెలుగులోకి అనువదించి మీ బ్లాగులో ప్రచురిస్తే బాగుంటుంది.

http://www.mainstreamweekly.net/article2234.html

Post a Comment