Pages

Saturday, December 4, 2010

హితసూచిని : రాజశేఖర చరిత్ర

టీవీ9 ఈ ఆదివారం (January 26th, 2010) అర్థరాత్రి దాటిన తర్వాత, దాదాపు 150 ఏళ్ల క్రితం ప్రచురించబడిన రెండు తెలుగు పుస్తకాలపై అరుదైన చర్చకు అవకాశమిచ్చింది. అన్ని మసాలా కార్యక్రమాలు, రేటింగులకోసం రుబ్బుళ్లు పూర్తయ్యాక రాత్రి ఒంటిగంట సమయంలో ఇద్దరు తెలుగు ప్రముఖులచేత ఈ చర్చా కార్యక్రమం నడిపారు.

ఆ సమయానికి నాలాంటి నిద్రరాని వాళ్లు, కంప్యూటర్ ముందు కూర్చుని టీవీ చూస్తూ పనులు చేసుకునే కొందరు తప్ప తెలుగు వాళ్లు దాదాపుగా నిద్రపోయి ఉంటారు. రేటింగ్ పెరగడానికి ఏ మాత్రం అవకాశం రాని ప్రసారం కాబట్టి దీన్ని రాత్రి ఒంటిగంటకు తోసేసారు. అయినా సరే టీవీల్లో అరుదుగా వస్తున్న సాహిత్య చర్చల్లో ఇదీ ఒకటిగా గుర్తించాలి.

“1990 తర్వాత ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక రంగాలలో కాలానికి వెనుకబడిపోతోందా అని అనుమానం వేస్తోంది. 150 ఏళ్ల క్రితం కందుకూరి వీరేశలింగం రాజశేఖర చరిత్ర నవల ద్వారా, సామినేని ముద్దు నరసింహం హితసూచిని ద్వారా తెలుగువారికి హేతుబద్దంగా జీవించడంపై పాఠాలు నేర్పారు.

ఈ రెండు పుస్తకాలను ప్రస్తుతం పీకాక్ క్లాసిక్స్ ప్రచురించింది. ఇప్పటి పాఠకులకు వీటి అవసరం చాలా ఉంద”ని వకుళాభరణం రామకృష్ణ, వేదవతి గారు ఈరోజు అంటే 24 అర్థరాత్రి దాటాక ఒంటిగంటకు టీవీ9లో జరిగిన చర్చలో పాల్గొని చెప్పారు.

150 ఏళ్ల క్రితం వీరేశలింగం, సామినేని ముద్దు నరసింహం తమ రచనల ద్వారా మూఢనమ్మకాలను నమ్మకండి, హేతుబద్దంగా జీవించండి, దేవుళ్లపేరిట దేవతల పేరిట సాగుతున్న ఛాందసాలను నమ్మకండి అని వాదించి మహిళలతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు తమ రచనల ద్వారా హితబోధ చేసారని, కాని ప్రస్తుతం తెలుగు దేశంలో వాతావరణం చూస్తే మనం కాలాన్ని దాటటం కాకుండా కాలంలో వెనుకకు పోతున్నామా అనిపిస్తూ ఉంటుందని రామకృష్ణ, వేదవతిగారు ఈ చర్చలో ఆవేదన వ్యక్తం చేసారు.

ముఖ్యంగా 1990 తర్వాత పలు కారణాల వల్ల తెలుగు సమాజంలో హేతువు, హేతుబద్ధంగా ఆలోచించడం, తార్కికంగా జీవించడం వంటివి కనుమరుగు అవుతూ వస్తున్నాయని వీరు చెప్పారు. కంప్యూటర్ విప్లవం సమాజాన్ని ముందుకు తీసుకుపోయిందో లేదో గాని అస్ట్రాలజీ, రాశిఫలాలను డేటా, ఆడియో, వీడియో రూపంలో అప్‌లోడ్ చేస్తూ, అర్థబిత్తల హీరోయిన్ల చర్మ ప్రదర్శనలతో వెబ్‌సైట్లు తాము తరిస్తూ ప్రజలను తరింపజేస్తున్న కాలం వచ్చేసింది. న్యూస్ పోర్టళ్లుగా చెప్పుకుంటున్న కొన్ని తెలుగు వెబ్‌సైట్ల ధూర్త పోకడ ఇలా తెల్లారుతోంది.

150 ఏళ్ల భావ సంస్కారం తర్వాత వెనుక పట్టు పడుతున్న తెలుగు సమాజానికి కనువిప్పు కలిగించేందుకు రాజశేఖర చరిత్ర, హితసూచిని పుస్తకాలను తిరిగి పీకాక్ క్లాసిక్స్ వారు వీటిని తిరిగి ప్రచురించారు. ఒక్కొక్కటి 120 పుటలు గల ఈ రెండు పుస్తకాల వెల చెరొక 50 రూపాయలు. విశాలాంద్రలో తదితర అన్ని పుస్తకాల షాపులలో ఇవి దొరుకుతాయి.

ఆధునిక తెలుగు సమాజంలో సంఘసంస్కరణకు రెక్కలు తొడిగిన ఆ తొలికాలంలో, ఇద్దరు మహనీయులు సామాజిక విషయాలపై, మనిషి ఆలోచనలపై, జీవన ధోరణిపై కొత్త సంస్కారానికి దారి తీసిన చరిత్రను మనం అర్థం చేసుకోవాలంటే సులభ వ్యావహారిక శైలిలో పై ఇద్దరు ప్రముఖుల చేత సంక్షిప్తం చేయించి పీకాక్ క్లాసిక్స్ వారు తెచ్చిన ఈ రెండు పుస్తకాలను ఇప్పటి పాఠకులు, సాహిత్య పఠనంపై ఆసక్తి గలవారు తప్పక తీసుకోవాలి.

జనవరి రెండో వారంలో ముగిసిన చెన్నయ్ బుక్ ఫెయిర్‌లో వీరేశలింగం గారి నవల రాజశేఖర చరిత్ర తీసుకున్నాను. హితసూచిని దొరకలేదు.

ఒక జాతి సామాజిక, సాంస్కృతిక చరిత్రలో కొత్త మలుపుకు నాందిపలికిన నూతన భావధారను మరోసారి మననం చేసుకోవడానికయినా మన తీరిక సమయాన్ని ఈ రెండు పుస్తకాల అధ్యయనం కోసం వెచ్చిద్దాం రండి. పీకాక్ క్లాసిక్స్ వారికి అభినందనలు… కృతజ్ఞతలు…
(January 26th, 2010న చందమామ బ్లాగులో ప్రచురించబడింది)


మెరుగైన సమాజం పేరుతో సెక్సును, రేటింగ్ పెంచుకోవడం రూపంలో నానా చెత్త ప్రసారాలు చేస్తున్న టీవీ9 -అంటే మిగతా టీవీలు చాలా పవిత్రంగా ఉన్నాయని కాదు- ఈ ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత, దాదాపు 150 ఏళ్ల క్రితం ప్రచురించబడిన రెండు తెలుగు పుస్తకాలపై అరుదైన చర్చకు అవకాశమిచ్చింది. అన్ని మసాలా కార్యక్రమాలు, రేటింగులకోసం రుబ్బుళ్లు పూర్తయ్యాక రాత్రి ఒంటిగంట సమయంలో ఇద్దరు తెలుగు ప్రముఖులచేత ఈ చర్చా కార్యక్రమం నడిపారు. ఆ సమయానికి నాలాంటి నిద్రరాని వాళ్లు, కంప్యూటర్ ముందు కూర్చుని టీవీ చూస్తూ పనులు చేసుకునే కొందరు తప్ప తెలుగు వాళ్లు దాదాపుగా నిద్రపోయి ఉంటారు. రేటింగ్ పెరగడానికి ఏ మాత్రం అవకాశం రాని ప్రసారం కాబట్టి దీన్ని రాత్రి ఒంటిగంటకు తోసేసారు. అయినా సరే టీవీల్లో అరుదుగా వస్తున్న సాహిత్య చర్చల్లో ఇదీ ఒకటిగా గుర్తించాలి.
“1990 తర్వాత ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక రంగాలలో కాలానికి వెనుకబడిపోతోందా అని అనుమానం వేస్తోంది. 150 ఏళ్ల క్రితం కందుకూరి వీరేశలింగం రాజశేఖర చరిత్ర నవల ద్వారా, సామినేని ముద్దు నరసింహం హితసూచిని ద్వారా తెలుగువారికి హేతుబద్దంగా జీవించడంపై పాఠాలు నేర్పారు. ఈ రెండు పుస్తకాలను ప్రస్తుతం పీకాక్ క్లాసిక్స్ ప్రచురించింది. ఇప్పటి పాఠకులకు వీటి అవసరం చాలా ఉంద”ని వకుళాభరణం రామకృష్ణ, వేదవతి గారు ఈరోజు అంటే 24 అర్థరాత్రి దాటాక ఒంటిగంటకు టీవీ9లో జరిగిన చర్చలో పాల్గొని చెప్పారు.

150 ఏళ్ల క్రితం వీరేశలింగం, సామినేని ముద్దు నరసింహం తమ రచనల ద్వారా మూఢనమ్మకాలను నమ్మకండి, హేతుబద్దంగా జీవించండి, దేవుళ్లపేరిట దేవతల పేరిట సాగుతున్న ఛాందసాలను నమ్మకండి అని వాదించి మహిళలతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు తమ రచనల ద్వారా హితబోధ చేసారని. కాని ప్రస్తుతం తెలుగు దేశంలో వాతావరణం చూస్తే మనం కాలాన్ని దాటటం కాకుండా కాలంలో వెనుకకు పోతున్నామా అనిపిస్తూ ఉంటుందని రామకృష్ణ, వేదవతిగారు ఈ చర్చలో ఆవేదన వ్యక్తం చేసారు.
ముఖ్యంగా 1990 తర్వాత పలు కారణాల వల్ల తెలుగు సమాజంలో హేతువు, హేతుబద్ధంగా ఆలోచించడం, తార్కికంగా జీవించడం వంటివి కనుమరుగు అవుతూ వస్తున్నాయని వీరు చెప్పారు. కంప్యూటర్ విప్లవం సమాజాన్ని ముందుకు తీసుకుపోయిందో లేదో గాని అస్ట్రాలజీ, రాశిఫలాలను డేటా, ఆడియో, వీడియో రూపంలో అప్‌లోడ్ చేస్తూ, అర్థబిత్తల హీరోయిన్ల చర్మ ప్రదర్శనలతో వెబ్‌సైట్లు తాము తరిస్తూ ప్రజలను తరింపజేస్తున్న కాలం వచ్చేసింది. న్యూస్ పోర్టళ్లుగా చెప్పుకుంటున్న కొన్ని తెలుగు వెబ్‌సైట్ల ధూర్త పోకడ ఇలా తెల్లారుతోంది.
150 ఏళ్ల భావ సంస్కారం తర్వాత వెనుక పట్టు పడుతున్న తెలుగు సమాజానికి కనువిప్పు కలిగించేందుకు రాజశేఖర చరిత్ర, హితసూచిని పుస్తకాలను తిరిగి పీకాక్ క్లాసిక్స్ వారు వీటిని తిరిగి ప్రచురించారు. ఒక్కొక్కటి 120 పుటలు గల ఈ రెండు పుస్తకాల వెల చెరొక 50 రూపాయలు. విశాలాంద్రలో తదితర అన్ని పుస్తకాల షాపులలో ఇవి దొరుకుతాయి.
ఆధునిక తెలుగు సమాజంలో సంఘసంస్కరణకు రెక్కలు తొడిగిన ఆ తొలికాలంలో, ఇద్దరు మహనీయులు సామాజిక విషయాలపై, మనిషి ఆలోచనలపై, జీవన ధోరణిపై కొత్త సంస్కారానికి దారి తీసిన చరిత్రను మనం అర్థం చేసుకోవాలంటే సులభ వ్యావహారిక శైలిలో పై ఇద్దరు ప్రముఖుల చేత సంక్షిప్తం చేయించి పీకాక్ క్లాసిక్స్ వారు తెచ్చిన ఈ రెండు పుస్తకాలను ఇప్పటి పాఠకులు, సాహిత్య పఠనంపై ఆసక్తి గలవారు తప్పక తీసుకోవాలి. జనవరి రెండో వారంలో ముగిసిన చెన్నయ్ బుక్ ఫెయిర్‌లో వీరేశలింగం గారి నవల రాజశేఖర చరిత్ర తీసుకున్నాను. హితసూచిని దొరకలేదు.
ఒక జాతి సామాజిక, సాంస్కృతిక చరిత్రలో కొత్త మలుపుకు నాందిపలికిన నూతన భావధారను మరోసారి మననం చేసుకోవడానికయినా మన తీరిక సమయాన్ని ఈ రెండు పుస్తకాల అధ్యయనం కోసం వెచ్చిద్దాం రండి. పీకాక్ క్లాసిక్స్ వారికి అభినందనలు… కృతజ్ఞతలు…

26-01-2010న చందమామ బ్లాగులో ప్రచురించబడింది.

RTS Perm Link
test Filed under సాహిత్యం | Edit | Comments (6)

6 Responses to “హితసూచిని – రాజశేఖర చరిత్ర”
1. chandamama on January 26, 2010 11:21 PM Edit This
ఈ కథనంలో చిన్న మార్పు. రాజశేఖర చరిత్ర నవలను సులభపరిచయం చేసినవారు సహవాసి గారు కాగా వేదవతి గారు హితసూచిని గ్రంధాన్ని పరిచయం చేశారు. రెండూ పీకాక్ క్లాసిక్స్ వారివే.
2. Praveen Sarma on January 27, 2010 12:58 AM Edit This
సామినేని ముద్దు నరసింహం గారి గురించి నా నాస్తిక గురువు రావిపూడి వెంకటాద్రి గారు చెప్పారు. వెంకటాద్రి గారి గురించి కూడా చదవండి: http://blogzine.sahityaavalokanam.gen.in/2010/01/blog-post_3745.html
3. chandamama on January 27, 2010 1:54 AM Edit This
ప్రవీణ్ గారూ,
రావిపూడి వెంకటాద్రిగారు విడిగా ప్రచురించిన సైన్స్ పుస్తకాలు చాలావరకు నేను చదివాను. అయితే హేతువాదం పుస్తకం చదవటం 20 ఏళ్లకు ముందు ఆగిపోయింది. కేవల మత వ్యతిరేక ప్రచారంతో ప్రజలకు నచ్చచెప్పడం కష్టం అనే కొత్త అవగాహనతో ఆ మాసపత్రికపై ఆసక్తి తగ్గిపోయింది.
కానీ ఇప్పుడనిపిస్తోంది. కేవల మత వ్యతిరేక నాస్తిక ప్రచారం తప్పు అనుకున్నప్పటికీ, ఎందుకు తప్పో తెలుసుకోవడానికయినా వాటితో సంబంధంలో ఉండాలి. చదవాలి. లేకుంటే ఒక సిద్ధాంతం ఏమి చెప్పింది అనే విషయం తెలుసుకోకుండానే దానిమీద బయటనుంచి రాళ్లు వేసినట్లే అవుతుంది. దీనివల్ల ఎవరికీ ఏ ప్రయోజనమూ ఉండదు కూడా.
రాయలసీమవైవు, ముఖ్యంగా తిరుపతిలో హేతువాదం మాసపత్రిక దొరకదు. షాపుల్లో కనబడదు. అందుకే దాంతో టచ్ పూర్తిగా పోయింది కూడా. వీలయితే ఆ పత్రిక ఇప్పుడు కూడా వస్తుంటే చిరునామా చెప్పగలరు.
ధన్యవాదాలు.
4. Ramakrishna on January 27, 2010 5:48 AM Edit This
విశాఖ లో ఎం.సి.ఎ చదివే రోజుల్లో ప్రతి ఆదివారం జగదాంబ సెంటర్ కి వెళ్ళి పాత పుస్తకాలు ఎతుక్కునే వాడిని.
అలా రాజశేఖరచరిత్ర నాదగ్గరకి వచ్చింది. మంచి నవల, ది వికార్ ఆఫ్ ది వేక్ఫీల్డ్ కి స్వేచ్చానువాదం.
5. తాడేపల్లి on January 27, 2010 6:34 AM Edit This
రాజశేఖరచరిత్రము స్వేచ్ఛానువాదం కాదు, స్వేచ్ఛానుసరణం మఱియు స్థానికీకరణం.
6. chandamama on January 31, 2010 12:13 AM Edit This
తాడేపల్లిగారూ, మీరు చెప్పిందే కరెక్ట్. రాజశేఖర చరిత్రము చక్కటి స్థానికీకరణకు నమూనా. సహవాసి గారు వ్యావహారికి భాషలోకి మార్చి తెచ్చిన ఈ కొత్త పుస్తరం చదవడానికి ఇంకా బాగుంది. సరికొత్ నవల చదివినంత ఆసక్తికరంగా కూడా ఉంది.
ధన్యవాదాలు
రామకృష్ణ గారు, మీరూ పాత పుస్తకాల ప్రియులేనన్నమాట. అభినందనలు.

0 comments:

Post a Comment